Fish Cleaning: చేపలను ఉప్పు, పసుపు వేసి ఎందుకు శుభ్రపరచాలో తెలుసుకోండి
- Fish Cleaning: చేపలు శుభ్రపరిచాకే వండాలి. చేప ముక్కలకు ఉప్పు, పసుపు బాగా పట్టించి పది నిమిషాలు ఉంచాకే వాటిని కడిగి వండాలి. ఇలా ఉప్పు, పసుపునే ఎందుకు వాడతారు?
- Fish Cleaning: చేపలు శుభ్రపరిచాకే వండాలి. చేప ముక్కలకు ఉప్పు, పసుపు బాగా పట్టించి పది నిమిషాలు ఉంచాకే వాటిని కడిగి వండాలి. ఇలా ఉప్పు, పసుపునే ఎందుకు వాడతారు?
(1 / 6)
చేపలు వండే ముందు పరిశుభ్రంగా కడగాలి. చేపల్లో ఉప్పు, పసుపు వేసి నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల వాటిల్లో ఉండే బ్యాక్టిరియాలు వంటివి తొలగిపోతాయి.
(2 / 6)
భారతీయ వంటకాలు ఇతర దేశాలకు భిన్నంగా ఉంటాయి. చేపలను వండేముందు ఉప్పు, పసుపుతో నానబెట్టడం పూర్వం నుంచి అలవాటుగా వస్తోంది. పసుపు చేపలను చెడిపోకుండా ఎక్కువ కాలం తాజాగా ఉంచుతుంది.
(3 / 6)
పచ్చి చేపలను మ్యారినేట్ చేయడానికి పసుపును ఉపయోగించడం వల్ల యాంటీ బ్యాక్టిరియల్ లక్షణాలు చేపలకు సోకుతాయి. ఇది సూక్ష్మజీవులను, ఇన్ఫెక్షన్లను చంపుతుంది. ఉప్పు, పసుపును నీటిలో వేసి ఆ నీటిలో చేపలను నానబెట్టాలి. తద్వారా చేపలు తాజాగా ఉంటాయి. ఇది సూక్ష్మజీవుల పునరుత్పత్తిని నిరోధిస్తుంది.
(4 / 6)
చేపలను ఉప్పు, పసుపుతో మ్యారినేట్ చేయడం వల్ల ప్రోటీన్ కంటెంట్ బయటకు పోకుండా ఉంటుంది. ఇది చేపలను తాజాగా ఉంచుతుంది. వండాక పులుసు రుచిని పెంచుతుంది.
ఇతర గ్యాలరీలు