తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Upsc Nda Na Results 2024: ఎన్డీఏ, ఎన్ఏ 2024 ఫలితాలను విడుదల చేసిన యూపీఎస్సీ

UPSC NDA NA results 2024: ఎన్డీఏ, ఎన్ఏ 2024 ఫలితాలను విడుదల చేసిన యూపీఎస్సీ

HT Telugu Desk HT Telugu

09 May 2024, 19:25 IST

    • UPSC NDA NA results 2024: 2024 ఎన్డీఏ (NDA), ఎన్ఏ (NA) రాత పరీక్షల ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. ఏప్రిల్ 21న నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను చెక్ చేయడానికి అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ upsc.gov.in ను చెక్ చేయండి.
ఎన్డీఏ, ఎన్ఏ 2024 ఫలితాల విడుదల
ఎన్డీఏ, ఎన్ఏ 2024 ఫలితాల విడుదల

ఎన్డీఏ, ఎన్ఏ 2024 ఫలితాల విడుదల

UPSC NDA NA results 2024: యూపీఎస్సీ నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA), నేవల్ అకాడమీ 2024 ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) తన అధికారిక వెబ్ సైట్ upsc.gov.in లో విడుదల చేసింది. ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ upsc.gov.in లో తమ రిజల్ట్ ను చెక్ చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

Rishi Sunak net worth : కింగ్​ చార్లెస్​ కన్నా.. రిషి సునక్​- అక్షతా మూర్తులే ధనవంతులు!

Naturals Ice Cream : నేచురల్స్​ ఐస్​క్రీమ్​ వ్యవస్థాపకుడు రఘునందన్​ కామత్​ కన్నుమూత..

Thief Lawyer: కి‘‘లేడీ లాయర్’’.. కోర్టులోనే దర్జాగా దొంగతనాలు; ఎట్టకేలకు అరెస్ట్

COVID-19: మళ్లీ కోవిడ్-19 కలకలం; సింగపూర్ లో వారం రోజుల్లో 25,900 కేసులు నమోదు

జనవరి 2 నుంచి ఎన్ఏ ట్రైనింగ్ ప్రారంభం

115వ ఇండియన్ నేవల్ అకాడమీ కోర్సు (INAC) జనవరి 2 నుంచి ప్రారంభం అవుతోంది. నేషనల్ డిఫెన్స్ అకాడమీలోని ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాల్లో ప్రవేశం కోసం రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (SSB) నిర్వహించే ఇంటర్వ్యూకు అర్హత సాధించిన అభ్యర్థుల రోల్ నంబర్లను యూపీఎస్సీ ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. రాత పరీక్ష ఫలితాలు వెలువడిన రెండు వారాల్లోగా అభ్యర్థులు ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ వెబ్సైట్ joinindianarmy.nic.in లో ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలని కమిషన్ తెలిపింది.

ఇంటర్వ్యూ డేట్స్..

ఈ నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA), నేవల్ అకాడమీ (NA) 2024 రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ లను నిర్వహిస్తుంది. ఈ ఇంటర్వ్యూల కేంద్రాలు, తేదీలను రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడీకి తెలియజేయాలి. ఇప్పటికే సైట్లో రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు అలా చేయాల్సిన అవసరం లేదని కమిషన్ తెలిపింది. ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ సమయంలో అభ్యర్థులు తమ వయస్సు, విద్యార్హతల ఒరిజినల్ సర్టిఫికెట్లను సంబంధిత సర్వీస్ సెలక్షన్ బోర్డులకు (SSB) సమర్పించాల్సి ఉంటుందని యూపీఎస్సీ తెలిపింది.

ఏప్రిల్ 21న పరీక్ష

యూపీఎస్సీ ఏప్రిల్ 21, 2024న ఎన్డీఏ, ఎన్ఏ పరీక్షలను నిర్వహించింది. ఈ పరీక్ష ద్వారా 400 పోస్టులను భర్తీ చేయాలని కమిషన్ లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్మీలో 208, నేవీలో 42, ఎయిర్ ఫోర్స్ లో 120, నేవల్ అకాడమీలో 30 పోస్టులను రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా భర్తీ చేయనున్నారు.

రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి

  • యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ upsc.gov.in ను ఓపెన్ చేయండి.
  • హోమ్ పేజీలో కనిపించే What’s new section పై క్లిక్ చేయండి.
  • నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్ (ఐ), 2024 అనే లింక్ పై క్లిక్ చేయండి.
  • పీడీఎఫ్ ఫైల్ ఓపెన్ చేసి మీ రోల్ నంబర్ కోసం చూడండి.
  • పీడీఎఫ్ ను డౌన్ లోడ్ చేసుకోండి.
  • భవిష్యత్తు రిఫరెన్స్ కోసం ప్రింటెడ్ కాపీని ఉంచండి.

తదుపరి వ్యాసం