తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Kedarnath Dham Yatra 2024: రేపటి నుంచి కేదార్ నాథ్ ధామ్ యాత్ర ప్రారంభం; రిజిస్టర్ చేసుకోకుండా వెళ్లొచ్చా?

Kedarnath Dham yatra 2024: రేపటి నుంచి కేదార్ నాథ్ ధామ్ యాత్ర ప్రారంభం; రిజిస్టర్ చేసుకోకుండా వెళ్లొచ్చా?

HT Telugu Desk HT Telugu

09 May 2024, 19:08 IST

  • Kedarnath Dham yatra 2024: భువిపై, హిమాలయ పర్వత సానువుల్లో పరమ శివుడు కొలువై ఉన్న పరమ పవిత్ర పుణ్యక్షేత్రం.. కేదార్ నాథ్ ధామ్ యాత్ర అక్షయ తృతీయ సందర్భంగా, రేపటి నుంచి ప్రారంభమవుతుంది. ఈ యాత్ర కార్తిక పౌర్ణమి వరకు కొనసాగే అవకాశముంది. ఈ యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

హిమాలయాల్లో కొలువైన కేదార్ నాథ్ ఆలయం
హిమాలయాల్లో కొలువైన కేదార్ నాథ్ ఆలయం (HT_PRINT)

హిమాలయాల్లో కొలువైన కేదార్ నాథ్ ఆలయం

Kedarnath Dham yatra 2024: ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్ ధామ్ యాత్ర మే 10వ తేదీన ప్రారంభమవుతోంది. ఈ యాత్రలో పాల్గొనడానికి సరైన రిజిస్ట్రేషన్ అవసరం ఉంటుంది. రిజిస్ట్రేషన్ లేకుండా కేదార్ నాథ్ యాత్రకు వెళ్లే ఆలోచన చేయకండి. శివుని అవతారంగా పూజలందుకుంటున్న కేదార్ నాథ్ ధామ్ ఈ అక్షయ తృతీయ (మే 10) రోజున భక్తుల కోసం తలుపులు తెరవనుంది. కార్తీక పౌర్ణమి (నవంబర్ 15) వరకు తెరిచి ఉండే అవకాశం ఉంది. గర్వాల్ హిమాలయాలలోని ఈ హిందూ పుణ్యక్షేత్రాన్ని మిగతా రోజుల్లో తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా మూసివేస్తారు.

ట్రెండింగ్ వార్తలు

Porsche accident : ‘వ్యాసాలు రాయి..’ పోర్షేతో ఇద్దరిని చంపిన మైనర్​కి 15 గంటల్లోనే బెయిల్​!

Iran President : హెలికాప్టర్​లో ప్రయాణం.. ఆరోగ్యానికి హానికరం! నాడు సంజయ్​ గాంధీ- నేడు రైసీ..

Iran President Raisi death : హెలికాప్టర్​ ప్రమాదంలో ఇరాన్​ అధ్యక్షుడు రైసీ మృతి

Rishi Sunak net worth : కింగ్​ చార్లెస్​ కన్నా.. రిషి సునక్​- అక్షతా మూర్తులే ధనవంతులు!

రిజిస్ట్రేషన్ లేకుండా కేదార్ నాథ్ ధామ్ కు వెళ్లే మార్గం లేదా?

రిజిస్ట్రేషన్ లేకుండా కేదార్ నాథ్ ధామ్ కు వెళ్లే అవకాశం లేదు. మీరు రిజిస్ట్రేషన్ లేకుండా గౌరీకుండ్ దాటి కేదార్ నాథ్ ధామ్ కు చేరుకునే మార్గం లేదు. అయితే, ధామ్ కు వెళ్లే మార్గంలో అనేక రిజిస్ట్రేషన్ పాయింట్లు ఉన్నాయి, ఇక్కడ మీరు ఆఫ్ లైన్ లో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు వ్యక్తిగత వాహనంలో ప్రయాణిస్తుంటే, రిషికేష్ లో ఉన్న రిజిస్ట్రేషన్ పాయింట్ వద్ద రిజిస్టర్ చేసుకోవచ్చు. మీరు ప్రజా రవాణాను ఉపయోగిస్తుంటే, గౌరీకుండ్ లో నమోదు చేసుకోవచ్చు. గౌరీకుండ్ వద్ద ఉత్తరాఖండ్ పోలీసులు చెక్ పోస్టు ఏర్పాటు చేసి ప్రతి ప్రయాణికుడికి రిజిస్ట్రేషన్ స్లిప్ ఉండేలా చూసుకుని ట్రెక్కింగ్ కు వెళ్లేందుకు అనుమతిస్తారు.

కేదార్ నాథ్ ధామ్ కోసం రిజిస్టర్ చేసుకోవడం ఎందుకు ముఖ్యం?

కేదార్ నాథ్ ధామ్ కోసం రిజిస్ట్రేషన్ చాలా అవసరం. ఎందుకంటే ఇది యాత్రకు వెళ్లిన వారి సంఖ్యను ట్రాక్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సహాయపడుతుంది. ఇది మీ మొత్తం సమాచారాన్ని ప్రభుత్వానికి అందించడానికి కూడా సహాయపడుతుంది, కాబట్టి క్లిష్టమైన ప్రయాణంలో మీకు ఏదైనా సమస్య ఎదురైతే, మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సంప్రదించవచ్చు.

కేదార్ నాథ్ ధామ్ కోసం ఆన్ లైన్ లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?

మీరు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లింక్ registrationandtouristcare.uk.gov.in. ద్వారా కేదార్ నాథ్ ధామ్ యాత్ర 2024 కోసం నమోదు చేసుకోవచ్చు. కేదార్ నాథ్ ఆలయానికి కాలినడకన లేదా విమాన మార్గం ద్వారా, లేదా హెలికాప్టర్ ద్వారా చేరుకోవచ్చు.

తదుపరి వ్యాసం