తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rishi Sunak Net Worth : కింగ్​ చార్లెస్​ కన్నా.. రిషి సునక్​- అక్షతా మూర్తులే ధనవంతులు!

Rishi Sunak net worth : కింగ్​ చార్లెస్​ కన్నా.. రిషి సునక్​- అక్షతా మూర్తులే ధనవంతులు!

Sharath Chitturi HT Telugu

19 May 2024, 15:30 IST

google News
    • Rishi Sunak richer than King Charles : రిషి సునక్, భార్య అక్షతా మూర్తి వద్ద కింగ్ చార్లెస్ కంటే ఎక్కువ డబ్బు ఉంది. ఈ విషయం.. సండే టైమ్స్​ రిచ్​ లిస్ట్​ ద్వారా తెలిసింది.
కింగ్​ చార్లెస్​ కన్నా రిషి- మూర్తులే ధనవంతులు!
కింగ్​ చార్లెస్​ కన్నా రిషి- మూర్తులే ధనవంతులు!

కింగ్​ చార్లెస్​ కన్నా రిషి- మూర్తులే ధనవంతులు!

Sunday Times Rich List 2024 : బ్రిటన్​ ప్రధానమంత్రి రిషి సునక, ఆయన భార్య- ఇన్ఫోసిస్​ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తి వ్యక్తిగత సంపద.. గత ఏడాది 122 మిలియన్ పౌండ్లు పెరిగిందని సండే టైమ్స్ రిచ్ లిస్ట్ ద్వారా తేలింది. 2023లో వీరిద్దరి నికర విలువ 529 మిలియన్ పౌండ్ల నుంచి 651 మిలియన్ పౌండ్లకు పెరిగింది. తన తండ్రి స్థాపించిన ఇన్ఫోసిస్​లో అక్షతా మూర్తికి వాటా ఉండడమే ఇందుకు కారణం. యూకేలోని సంపన్నుల వార్షిక జాబితా ప్రకారం.. రిషి సునక్​- అక్షతా మూర్తులు ఇప్పుడు.. కింగ్ చార్లెస్ కంటే ధనవంతులు!

నెంబర్​ 10. డౌనింగ్ స్ట్రీట్​లో నివసిస్తున్న అత్యంత సంపన్న దంపతులు ప్రధాని రిషి, మూర్తి. రిచ్​ లిస్ట్​లో 245వ స్థానంలో ఉన్నారు. కింగ్ చార్లెస్ కంటే ఇప్పుడు వారి వద్ద ఎక్కువ డబ్బు ఉంది. ఈ సంవత్సరం ఆయన వ్యక్తిగత సంపద 600 మిలియన్ పౌండ్ల నుంచి 610 మిలియన్ పౌండ్లకు పెరిగింది. 2022లో సునక్​లు.. దివంగత క్వీన్ ఎలిజబెత్ 2 కంటే ఉన్నత స్థానంలో ఉన్నారు. వారి వ్యక్తిగత సంపద ఆ సంవత్సరం £370 మిలియన్లకు మించి ఉంటుందని అంచనా.

ప్రజల జీవితాలు, కాస్ట్​ ఆఫ్​ లివింగ్​ మరింత భారంగా మారుతున్న సమయంలో.. ఈ నివేదిక బయటకు రావడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ట్రస్సెల్ ట్రస్ట్ నుంచి ఇటీవలి డేటా ప్రకారం.. గత సంవత్సరంలో 3.1 మిలియన్ల ఆహార పార్శిల్స్ పంపిణీ చేయడం జరిగింది. ఇది రికార్డు! పెరుగుతున్న జీవన వ్యయాల వల్ల ఏర్పడిన సంక్షోభంలో దేశాన్ని నడిపిస్తున్న ప్రధాని.. ఒక మాజీ హెడ్జ్ ఫండ్ మేనేజర్. రెండు హెడ్జ్ ఫండ్లలో భాగస్వామి కావడానికి ముందు, రిషి సునక్​.. 2001-2004 లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్​మెన్​ సాక్స్​ విశ్లేషకుడిగా గడిపారు. సునక్ మొత్తం ఆదాయంలో కేవలం 6.5%.. ఆయన పెట్టుబడుల నుంచి వస్తుంది. మిగిలినది ఆయన ఎంపీ జీతం £91,346) మరియు పిఎమ్ జీతం £80,807.

ఈ జాబితాలో ఉన్న మిగతా వారు..

Rishi Sunak Akshata Murthy net worth : ఈ జాబితాలో టాప్ 10 వ్యక్తులు:

1. గోపి హిందుజా - £37.2 బిలియన్లు

2. సర్ లియోనార్డ్ బ్లావట్నిక్ - £29.25 బిలియన్

3. డేవిడ్ మరియు సైమన్ రూబెన్ మరియు కుటుంబం - £24.9 బిలియన్

4. సర్ జిమ్ రాట్క్లిఫ్ - £23.5 బిలియన్

5. సర్ జేమ్స్ డైసన్ అండ్ ఫ్యామిలీ - £20.8 బిలియన్

6. బర్నబీ మరియు మెర్లిన్ స్వైర్ మరియు కుటుంబం - £17.2 బిలియన్

7. ఇదాన్ ఒఫెర్ - £14.9 బిలియన్

Rishi Sunak latest news : 8. లక్ష్మీ మిట్టల్ అండ్ ఫ్యామిలీ - £14.9 బిలియన్

9. గై, జార్జ్, అలన్నా మరియు గాలెన్ వెస్టన్ మరియు కుటుంబం - £14.4 బిలియన్

10. జాన్ ఫ్రెడ్రిక్సన్ అండ్ ఫ్యామిలీ - £12.8 బిలియన్లు

తదుపరి వ్యాసం