FICCI-Anarock Survey: 3 బెడ్ రూమ్స్ ఉన్న ఇళ్లకే ప్రాధాన్యం; బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ రియాల్టీనే: సర్వే రిపోర్ట్-almost 50 percent home buyers prefer 3bhk homes 75 percent want balconies survey ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Almost 50 Percent Home Buyers Prefer 3bhk Homes; 75 Percent Want Balconies: Survey

FICCI-Anarock Survey: 3 బెడ్ రూమ్స్ ఉన్న ఇళ్లకే ప్రాధాన్యం; బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ రియాల్టీనే: సర్వే రిపోర్ట్

HT Telugu Desk HT Telugu
Mar 05, 2024 06:50 PM IST

FICCI-Anarock Survey: రియాల్టీ రంగంలో వినియోగదారుల ఆలోచనల్లో గణనీయమైన మార్పు చోటు చేసుకుందని ఫిక్కీ - అనరాక్ సర్వే తేల్చింది. గతంలో 2 బీహెచ్ కే ఇళ్లు, లేదా 2 బీహెచ్ కే ఫ్లాట్స్ కు ప్రాధాన్యత ఇచ్చిన వినియోగదారులు.. ఇప్పుడు 3 బీహెచ్ కే కు ప్రాధాన్యత ఇస్తున్నారని వెల్లడించింది.

ఢిల్లీలో జరిగిన ఫిక్కీ రియల్ ఎస్టేట్ సమిట్
ఢిల్లీలో జరిగిన ఫిక్కీ రియల్ ఎస్టేట్ సమిట్

FICCI-Anarock Consumer Sentiment Survey: గృహా కొనుగోలుకు సంబంధించి వినియోగదారుల్లో చాలా మార్పు వచ్చిందని ఫిక్కీ - అనరాక్ సర్వే తేల్చింది. ఆ సర్వే ప్రకారం.. దాదాపు 50 శాతం మంది గృహ కొనుగోలుదారులు 3బీహెచ్ కే (3 బెడ్ రూమ్స్ ఉన్న ఇళ్లు) గృహాల కొనుగోలుకు మొగ్గు చూపుతుండగా, 38 శాతం మంది మాత్రం 2బీహెచ్కే (2 బెడ్ రూమ్స్ ఉన్న ఇళ్లు) వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం 75 శాతం మంది ప్రాపర్టీ కోరుకునే వారు.. తమ ఫ్లాట్ లేదా ఇంటికి కచ్చితంగా బాల్కనీలు ఉండాలని కోరుకుంటున్నారు. అంతే కాదు, 58% మిలీనియల్స్ మరియు 39% జెన్-ఎక్స్ కొనుగోలుదారులు ఇతర పెట్టుబడుల నుండి వచ్చే లాభాలను గృహాలను కొనుగోలు చేయడానికి ఉపయోగించాలని కోరుకుంటున్నారని ఫిక్కీ-అనరాక్ కన్స్యూమర్ సెంటిమెంట్ సర్వే (హెచ్ 2 2023) తెలిపింది. మార్చి 5న రాజధానిలో జరిగిన ఫిక్కీ రియల్ ఎస్టేట్ సమ్మిట్ లో ఆవిష్కరించిన సర్వేలో హెచ్ 2 2022 ఎడిషన్ లో 3 బీహెచ్ కేలకు డిమాండ్ 42 శాతంగా ఉందని తేలింది. అనరాక్ రీసెర్చ్ 2023 జూలై నుండి డిసెంబర్ వరకు, వివిధ వయస్సుల వారైన సుమారు 5,510 మందిని ఆన్లైన్ మాధ్యమంలో ప్రశ్నించి, ఈ నివేదిక రూపొందించింది.

ట్రెండింగ్ వార్తలు

పెద్ద అపార్ట్ మెంట్లకు డిమాండ్

ప్రాపర్టీ ధరలు పెరుగుతున్నప్పటికీ పెద్ద అపార్ట్ మెంట్లకు డిమాండ్ పెరుగుతూనే ఉంది.ముఖ్యంగా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ-ఎన్ సీఆర్ లలో 3బిహెచ్ కె (3 BHK) లకు ఎక్కువ డిమాండ్ కనిపిస్తోంది. హైపర్ ప్రైస్ ఎంఎంఆర్ లో 44 శాతం మంది 2బీహెచ్ కే (2 BHK) ల వైపే మొగ్గు చూపారు. ఎంఎంఆర్ (17%), పుణె (10%) పశ్చిమ మార్కెట్లలో 1బిహెచ్ కే యూనిట్లకు డిమాండ్ ప్రధానంగా కనిపిస్తోందని తెలిపింది.

లగ్జరీ ఇళ్లకు ప్రాధాన్యం

పెద్ద అపార్ట్మెంట్లకు పెరుగుతున్న ప్రాధాన్యతతో పాటు రూ.1.5 కోట్లకు పైగా విలువ చేసే లగ్జరీ ఇళ్లకు కూడా డిమాండ్ పెరిగింది. హెచ్ 2 2023 సర్వేలో పాల్గొన్న వారిలో కనీసం 20 శాతం మంది ఈ ధరల పరిధిలో ఇళ్లు కొనడానికి ఇష్టపడుతుండగా, హెచ్ 2 2021లో 12 శాతం మంది ఉన్నారు. రూ.45-90 లక్షల బడ్జెట్ శ్రేణి అత్యంత ప్రజాదరణ పొందిందని, 33 శాతానికి పైగా భావి గృహ కొనుగోలుదారులు దీనికి అనుకూలంగా ఉన్నారని సర్వే పేర్కొంది.

తగ్గిన చౌక గృహాల డిమాండ్

చౌక గృహాల డిమాండ్ హెచ్ 2 2021 లో 25% నుండి 2023 హెచ్ 2 లో 20%కి తగ్గింది. ‘టాప్ 7 నగరాల్లో సగటు ఫ్లాట్ పరిమాణాలు గత సంవత్సరం వార్షికంగా 11% పెరిగాయని అనరాక్ డేటా సూచిస్తుంది. ఇది 2022 లో 1,175 చదరపు అడుగుల నుండి 2023 లో 1,300 చదరపు అడుగులకు పెరిగింది. తొలిసారిగా రెడీ టు మూవ్ ఇళ్లకు డిమాండ్ తక్కువగా ఉందని సర్వేలో తేలింది. హెచ్ 2 2023 లో, సిద్ధంగా ఉన్న గృహాలు మరియు కొత్త లాంచ్ ల నిష్పత్తి 23: 24 గా ఉందని సర్వే హైలైట్ చేసింది. హెచ్1 2020లో ఇది 46:18గా ఉంది’ అని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పురి తెలిపారు.

కోవిడ్-19 మహమ్మారి తర్వాత

కోవిడ్-19 మహమ్మారి తర్వాత ఆఫీసులకు తిరిగి రావడం పెరుగుతోంది. దాంతో సబర్బన్ ప్రాంతాలు, నగర కేంద్రాల వైపు గృహ కొనుగోలుదారులు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుత సర్వే (హెచ్ 2 2023) లో 30% మంది ఇంటిని కొనుగోలు చేయడానికి సబర్బన్ ప్రాంతాలను తమ మొదటి ఎంపికగా ఎంచుకున్నారు. హెచ్ 2 2021 లో 25% మంది సబర్బన్ ప్రాంతాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రస్తుతం 75 శాతం మంది ప్రాపర్టీ కోరుకునే వారు బాల్కనీలను కోరుకుంటున్నారని సర్వేలో తేలింది.

మార్కెట్లోకి ఇన్వెస్టర్లు

ఇప్పుడు ఇన్వెస్ట్ మెంట్ రియల్ ఎస్టేట్ ను అత్యుత్తమ ఆప్షన్ గా అత్యధికులు ఎంచుకుంటున్నారు.హెచ్ 2 2023 లో, సుమారు 36% మంది భావి కొనుగోలుదారులు పెట్టుబడిగా ఆస్తులను కొనుగోలు చేస్తామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో 57 శాతం మంది రియల్ ఎస్టేట్ (real estate) ను బెస్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఆప్షన్ గా భావిస్తుండగా, స్టాక్ మార్కెట్ కు 29 శాతం మంది అనుకూలంగా ఉన్నారు. పెట్టుబడి ఎంపికలలో బంగారం చివరి స్థానంలో ఉంది. ప్రస్తుతం కేవలం 6 శాతం మంది మాత్రమే బంగారంపై పెట్టుబడులకు మొగ్గుచూపుతున్నట్లు సర్వేలో వెల్లడైంది.

హోం లోన్ వడ్డీ రేటు

హోమ్ లోన్ వడ్డీ రేట్లు 8.5 శాతం కంటే తక్కువగా ఉంటే తమ ఇంటి కొనుగోలు నిర్ణయంపై ఎలాంటి ప్రభావం ఉండదని 73 శాతం మంది అభిప్రాయపడ్డారు. మరోవైపు, మిలీనియల్స్ లో 58% మంది తమ మొదటి ఇంటిని కొనడానికి ప్రణాళికాబద్ధంగా వెళ్లాలనుకుంటున్నారు. మొదట స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టి, అందులో గడించే లాభాలతో ఇల్లు కొనుగోలు చేయాలని వారు భావిస్తున్నారు. వారు ముందుగా ఒక ఇంటిని అద్దెకు తీసుకోవడానికే ఇష్టపడుతున్నారు. ఈ సర్వే ప్రకారం 25 శాతం కొనుగోలుదారులు ప్రారంభ సమయంలో, 25 శాతం మంది పూర్తయిన సమయంలో, 50 శాతం మంది ప్రాజెక్టు కాలవ్యవధిలో ఇల్లు కొనాలనుకుంటున్నారు.

WhatsApp channel