రియల్ ఎస్టేట్ స్కామ్‌లో సూపర్ స్టార్ మహేశ్ బాబుకు లీగల్ నోటీసులు అందాయి. సాయి సూర్య డెవలపర్స్‌కు సంబంధించి జరిగిన రూ. 34 లక్షల కుంభకోణం కేసులో మహేశ్ బాబును మూడో ప్రతివాదిగా చేర్చుతూ రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరం లీగల్ నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించి ఇవాళ విచారణ జరగనుంది.