Rishi Sunak - Ashish Nehra relation: రిషి సునక్, ఆశిష్ నెహ్రా బ్రదర్సా..?-as rishi sunak becomes uk pm people share nehra related posts here s why ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rishi Sunak - Ashish Nehra Relation: రిషి సునక్, ఆశిష్ నెహ్రా బ్రదర్సా..?

Rishi Sunak - Ashish Nehra relation: రిషి సునక్, ఆశిష్ నెహ్రా బ్రదర్సా..?

HT Telugu Desk HT Telugu

Rishi Sunak - Ashish Nehra relation: భారతీయ సంతతికి చెందిన రుషి సునక్ బ్రిటన్ పీఎం అయ్యారు. రెండు రోజులుగా అన్ని ప్రసార మాధ్యమాల్లోనూ ఆ వార్తలే.

రుషి సునక్, ఆశిష్ నెహ్రా (Twitter/@DebAnu2002)

Rishi Sunak - Ashish Nehra relation: బ్రిటన్ పీఎం పీఠం అధిష్టించిన రుషి సునక్ తో పాటు మరో వ్యక్తి సడెన్ గా పాపులర్ ఐపోయాడు. అతడే, మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రా. అందరూ దాదాపు మర్చిపోయిన నెహ్రా.. . రుషి పుణ్యమా అని సడెన్ గా లైమ్ లైట్ లోకి వచ్చాడు. అయితే, ఈ ఇద్దరికీ సంబంధం ఏంటి అనుకుంటున్నారా?

Rishi Sunak - Ashish Nehra relation: బ్రదర్సా?

బ్రిటన్ కొత్త ప్రధాని రుషి సునక్, మన మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రా కు దగ్గరి పోలికలు ఉంటాయి. కావాలంటే పైన ఫొటో మరోసారి చూడండి. కొన్ని యాంగిల్స్ లో ఇద్దర్లో చాలా పోలికలు కనిపిస్తాయి. దాంతో, నెటిజన్లు తమ క్రియేటివిటీ అంతా చూపిస్తున్నారు. నెహ్రాను, సునక్ కు బంధుత్వం కలుపుతూ.. మీమ్స్ తో రెచ్చిపోతున్నారు. రిషి సునక్ కు శుభాకాంక్షలు తెలుపుతూ నెహ్రా చేసిన ట్వీట్ ను కూడా చాలా మంది రీట్వీట్ చేశారు.

Rishi Sunak - Ashish Nehra relation: కుంభమేళాలో తప్పిపోయారా?

అన్నిట్లోకి ఒక నెటిజన్ రియాక్షన్ మాత్రం హైలైట్. రిషి సునక్, ఆశిష్ నెహ్రా.. వారి చిన్నప్పుడు భారత్ లో కుంభమేళాలో తప్పిపోయారని, సునక్ ను వేరే వారు తీసుకుని బ్రిటన్ వెళ్లిపోయారని మంచి మసాలా స్టోరీ అల్లేశాడు. మరో ట్విటర్ యూజర్ ‘కంగ్రాచ్యులేషన్స్ నెహ్రాజీ’ అంటూ సునక్ కు బదులుగా.. నెహ్రాకు శుభాకాంక్షలు తెలిపాడు. మరో ట్విటర్ యూజర్ ప్రధాని మోదీ ఫ్లైట్ ఎక్కుతున్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘కోహినూర్ వజ్రాన్ని తీసుకురావడానికి బ్రిటన్ వెళ్తున్న భారత ప్రధాని మోదీ’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.