Amit Shah attacks Congress: ‘అంతా కాంగ్రెస్ వల్లనే’; చైనాతో వివాదంపై అమిత్ షా
08 January 2024, 21:56 IST
Amit Shah attacks Congress: అరుణాచల్ ప్రదేశ్ లో దేశ సరిహద్దుల్లో చైనాతో జరిగిన తాజా ఘర్షణలకు కారణం కాంగ్రెస్సేనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అరోపించారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా
Amit Shah attacks Congress: చైనాతో తాజా సరిహద్దు ఘర్షణలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం పార్లమెంట్లో స్పందించారు. అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ అవలంబించిన తీరు కారణంగానే చైనా ఈ విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
Amit Shah in the Parliament:అంగుళం కూడా పోలేదు
చైనాతో తాజా ఘర్షణ సమయంలో భారత్ అంగుళం భూమిని కూడా కోల్పోలేదని హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. భారత సైనికులు తక్షణమే స్పందించి, అద్భుతమైన పోరాట పటిమ చూపి చైనా దళాలను వెనక్కు పంపించారని వివరించారు. చైనాతో సంబంధాల విషయంలో కాంగ్రెస్ పార్టీ, ప్రథమ ప్రధాని నెహ్రూ ఘోరమైన పొరపాట్లు చేశారన్నారు. భారత్ కు ఐక్యరాజ్య సమితి భద్రత మండలిలో శాశ్వత సభ్యత్వం దక్కకపోవడానికి నెహ్రూనే కారణమన్నారు. ఆయనే భారత్ కు శాశ్వత సభ్యత్వం అవసరం లేదన్నారని షా ఆరోపించారు.
Amit Shah attacks Congress: చైనాతో అంటకాగుతోంది ఎవరు?
చైనాతో జరిగిన ఘర్షణలపై పార్లమెంట్లో అమిత్ షా(Amit Shah) స్పందిస్తూ.. కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. చైనాతో అంటకాగుతోంది కాంగ్రెస్సేనని మండిపడ్డారు. ‘2020లో గల్వాన్ లో భారతీయ సైనికులు చైనా దళాలతో ప్రాణాలొడ్డి పోరాడుతున్న సమయంలో చైనా దౌత్యవేత్తలతో కలిసి విందులో పాల్గొన్నది ఎవరు?’ అని రాహుల్ గాంధీ ని ఉద్దేశించి Amit Shah పరోక్ష విమర్శలు చేశారు. 2006లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలోనే చైనా అరుణాచల్ ప్రదేశ్ తమదేనని బాహటంగా చెప్పిన విషయాన్ని షా గుర్తు చేశారు. గాంధీల నేతృత్వంలో నడుస్తున్న రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కు చైనా నుంచి నిధులు వచ్చిన విషయం పార్లమెంట్లో ప్రస్తావనకు రాకూడదనే ఉద్దేశంతోనే చైనాతో ఘర్షణలపై కాంగ్రెస్ రాద్ధాంతం చేస్తోందని Amit Shah విమర్శించారు. చైనా ఎంబసీ నుంచి కాంగ్రెస్ కు రూ. 1.35 కోట్లు విరాళంగా అందిన విషయం నిజం కాదా? అని ప్రశ్నించారు. అది FCRA నిబంధనలకు అనుగుణంగా లేకపోవడం వల్లనే రాజీవ్ గాంధీ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ ను రద్దు చేశామన్నారు.
Paper visas to JK residents: పేపర్ వీసాలు…
జమ్మూకశ్మీర్ పౌరులకు చైనా వివాదాస్పద పేపర్ వీసాలను జారీ చేసింది కూడా కాంగ్రెస్ హయాంలోనేనని అమిత్ షా గుర్తు చేశారు. చైనా సరిహద్దుల్లోని దెమ్చాక్ ప్రాంతంతో రోడ్లు, మౌలిక వసతుల నిర్మాణాలను కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో నిలిపేసిందని ఆరోపించారు. ‘మళ్లీ చెబుతున్నా.. మోదీజీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం అంగుళం భూమిని కూడా ఆక్రమణకు గురి కానివ్వదు. భారతీయ సైనికులు చూపిన ధైర్యసాహసాలు ప్రశంసనీయం. మన భూమిని వారు కాపాడారు’ అని అమిత్ షా పేర్కొన్నారు.
Congress rule 267 notice: కాంగ్రెస్ నోటీసు
చైనా తో ఘర్షణల నేపథ్యంలో ప్రభుత్వ సంసిద్ధతపై పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ 267 నిబంధన కింద నోటీసు ఇచ్చింది. ‘చైనా మన భూభాగాలను ఆక్రమిస్తోంది. ఉత్తరాఖండ్, లద్దాఖ్ ల తరువాత ఇప్పుడు అరుణాచల్ వరకు వచ్చింది. చైనా దుశ్చర్యలను అడ్డుకోవడానికి ప్రభుత్వం ఏ విధంగా సిద్ధమవుతోంది?’ అని లోక్ సభలో విపక్ష నేత, కాంగ్రెస్ సభ్యుడు ఆధిర్ రంజన్ చౌధురి ప్రశ్నించారు.
టాపిక్