Rahul Gandhi conviction: “నాడు చించిన ఆర్డినెన్సే నేడు రాహుల్ కొంప ముంచిందా?”
24 March 2023, 16:58 IST
Rahul Gandhi disqualification: 2013 లో సొంత ప్రభుత్వం యూపీఏ (UPA) తీసుకువచ్చిన ఒక ఆర్డినెన్స్ (ordinance) ను రాహుల్ గాంధీ చించేశారు. అది అర్థంలేని ఆర్డినెన్స్ అంటూ మండిపడ్డారు. రాహుల్ గాంధీ నాడు అనాలోచితంగా చేసిన ఆ చర్యే ఇప్పుడు ఆయన కొంప ముంచిందని అంటున్నారు.
రాహుల్ గాంధీ
Rahul Gandhi disqualification: రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వార్త ఇప్పడు సంచలనంగా మారింది. ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ, మోదీ ఇంటిపేరున్న వారంతా దొంగలే అనే అర్థమొచ్చేలా రాహుల్ గాంధీ (Rahul Gandhi) 2019లో చేసిన ఒక వ్యాఖ్య ఆయన అనర్హతకు కారణమైంది. అయితే, ఈ తక్షణ అనర్హత నిబంధన వెనుక ఒక ఆసక్తికర కథ ఉంది.
Rahul Gandhi disqualification: సుప్రీంకోర్టు తీర్పు
లిలి థామస్, లోక్ ప్రహారీ కేసుల్లో సుప్రీంకోర్టు (Supreme Court) వరుసగా 2013, 2018 లో ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సంబంధించి ఒక కీలక తీర్పును వెలువరించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం (Representation of the People Act - RP Act) లోని ఒక సెక్షన్ ను ఆ తీర్పుల్లో సుప్రీంకోర్టు (Supreme Court) కొట్టివేసింది. ఏదైనా క్రిమినల్ కేసులో 2 లేదా అంతకన్నా ఎక్కువ కాలం జైలు శిక్ష పడిన ప్రజా ప్రతినిధికి ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8 సబ్ సెక్షన్ 4 (Representation of the People Act - RP Act section 8(4)) ఒక వెసులుబాటు కల్పిస్తుంది. జైలు శిక్ష పడిన ఆ ప్రజా ప్రతినిధిని వెంటనే అనర్హుడిగా ప్రకటించకూడదని, అతడికి పై కోర్టుకు అప్పీల్ చేసుకోవడానికి 3 నెలల సమయం ఇవ్వాలని, పై కోర్టు స్టే విధిస్తే అనర్హత నిర్ణయాన్ని వాయిదా వేయాలని ఆ సెక్షన్ నిర్ధారిస్తుంది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని ఆ సెక్షన్ 8(4) (Representation of the People Act - RP Act section 8(4)) ను తన తీర్పుల్లో సుప్రీంకోర్టు (Supreme Court) కొట్టివేసింది.
Rahul Gandhi disqualification: ఆ ఆర్డినెన్స్ ల్లో ఏముంది?
సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పు కు వ్యతిరేకంగా 2013లో అధికారంలో ఉన్న యూపీఏ (UPA) ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ (ordinance) ను తీసుకువచ్చింది. జైలు శిక్ష పడిన ప్రజా ప్రతినిధిని వెంటనే, తక్షణమే అనర్హుడిగా ప్రకటించకూడదని, అప్పీల్ కు సమయం ఇవ్వాలని, పై కోర్టు స్టే విధిస్తే, అనర్హత అంశం పై నిర్ణయం తీసుకోకూడదని పేర్కొంటూ, అంటే, దాదాపు ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని ఆ సెక్షన్ 8(4) ను (Representation of the People Act - RP Act section 8(4)) పునరుద్ధరిస్తూ ఆ ఆర్డినెన్స్ (ordinance) ను రూపొందించారు.
Rahul Gandhi disqualification: ఆర్డినెన్స్ ను చించేసిన రాహుల్
ఆ ఆర్డినెన్స్ (ordinance) ను రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్రంగా వ్యతిరేకించారు. అది అర్థం లేని ఆర్డినెన్స్ (ordinance) అని మండిపడ్డారు. ఒక ప్రెస్ మీట్ లో ఆ ఆర్డినెన్స్ పై తన వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ, ఆ ఆర్డినెన్స్ (ordinance) కాపీని చించేశారు. ఇప్పుడు, ఆ ఆర్డినెన్స్ ను చించేసిన దాదాపు 10 సంవత్సరాల తరువాత.. రాహుల్ గాంధీ (Rahul Gandhi) తనే స్వయంగా అనర్హతకు గురి కావడం విశేషం. 2019లో కర్నాటకలో ఒక సభలో మాట్లాడుతూ, దేశాన్ని దోచుకుంటున్నవారికందరికీ మోదీ (Modi) అనే ఇంటి పేరు ఉందని రాహుల్ (Rahul Gandhi) వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలపై పూర్ణేశ్ మోదీ గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే సూరత్ కోర్టులో కేసు వేశారు. ఆ కేసు విచారణ అనంతరం సూరత్ కోర్టు రాహుల్ గాంధీ (Rahul Gandhi) కి రెండేళ్ల జైలు శిక్ష విధించింది.