Rahul Gandhi defamation case : మోదీపై అనుచిత వ్యాఖ్యల కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష
Rahul Gandhi defamation case : పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీని దోషిగా తేలుస్తూ.. రెండేళ్ల జైలు శిక్షను విధించింది గుజరాత్‌లోని ఓ జిల్లా కోర్టు. 2019లో ప్రధాని మోదీపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారని కోర్టు తేల్చింది.
Rahul Gandhi defamation case : పరువు నష్టం కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీని దోషిగా తేలుస్తూ గురువారం తీర్పును వెలువరించింది గుజరాత్ సూరత్‌లోని జిల్లా కోర్టు. ఫలితంగా ఆయనకు రెండేళ్ల జైలు శిక్షను విధించింది. 2019లో దాఖలైన పరువు నష్టం కేసును ఇంత కాలం విచారించిన కోర్టు.. ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేశారని తేల్చింది.
తీర్పును సవాలు చేసేందుకు రాహుల్ గాంధీకి అవకాశాన్ని ఇచ్చింది సూరత్‌లోని జిల్లా కోర్టు. అంతేకాకుండా.. రాహుల్ గాంధీకి 30 రోజుల బెయిల్‌ని మంజూరు చేసింది.
రాహుల్‌పై పరువు నష్టం కేసు..
Rahul Gandhi latest news : 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు కర్ణాటకలో పర్యటించారు రాహుల్ గాంధీ. కోలర్‌లో నిర్వహించిన ఓ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీపై, మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. "దొంగలందరికి.. మోదీ అనే ఇంటి పేరే ఎందుకు ఉంటోంది?" అని అన్నారు. దేశం నుంచి పారిపోయిన నీరవ్ మోదీ, లలిత్ మోదీలతో పాటు ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ఈ ఇంటి పేరు ఉండటంతో.. రాహుల్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది.
Rahul Gandhi defamation case live updates : ఈ క్రమంలో.. గుజరాత్‌లోని సూరత్ జిల్లా కోర్టులో రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశారు గుజరాత్ మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ. మొత్తం మోదీ సంఘాన్నే కించపరించే విధంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు వ్యాజ్యంలో పేర్కొన్నారు.
2021 అక్టోబర్‌లో చివరిసారిగా సూరత్ కోర్టుకు హాజరయ్యరు రాహుల్ గాంధీ. తన స్టేట్మెంట్ను కోర్టు ముందు సమర్పించారు. అప్పటి నుంచి గత వారం వరకు ఈ కేసుపై విచారణ జరిగింది. చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ హెచ్‌హెచ్ వర్మా.. తీర్పును గురువారానికి వాయిదా వేశారు. తాజాగా.. రాహుల్ గాంధీని దోషిగా తేలుస్తూ తీర్పును వెల్లడించారు.
Rahul Gandhi vs BJP : సూరత్ కోర్టు తీర్పును కాంగ్రెస్ వ్యతిరేకించింది. విచారణ మొదలైనప్పటి నుంచి అనేక తప్పులు జరిగాయని రాహుల్ గాంధీ తరఫు న్యాయవాది కిరిట్ పూనావాలా ఆరోపించారు.
సంబంధిత కథనం