Rahul Gandhi defamation case : జైలు శిక్షపై రాహుల్​ గాంధీ స్పందన ఇది..-gujarat after being held guilty in defamation case rahul quotes gandhiji in tweet about truth nonviolence ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rahul Gandhi Defamation Case : జైలు శిక్షపై రాహుల్​ గాంధీ స్పందన ఇది..

Rahul Gandhi defamation case : జైలు శిక్షపై రాహుల్​ గాంధీ స్పందన ఇది..

Sharath Chitturi HT Telugu
Published Mar 23, 2023 01:21 PM IST

Rahul Gandhi defamation case : పరువు నష్టం కేసులో రాహుల్​ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది సూరత్​ కోర్టు. తాజాగా.. ఈ వ్యవహారంపై ఆయన స్పందించారు.

సూరత్​ కోర్టుకు హాజరైన రాహుల్​ గాంధీ
సూరత్​ కోర్టుకు హాజరైన రాహుల్​ గాంధీ (PTI)

Rahul Gandhi defamation case : పరువు నష్టం కేసులో తనకు రెండేళ్ల జైలు శిక్షను విధిస్తూ గుజరాత్​ సూరత్​ కోర్టు వెలువరించిన తీర్పుపై.. మహాత్మా గాంధీ వ్యాఖ్యలను ఉదహరిస్తూ స్పందించారు కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ. సత్యం, అహింస తన మతం అని పేర్కొన్నారు.

2019 లోక్​సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాహుల్​ గాంధీకి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్​పై గురువారం తీర్పును వెలువరించింది సూరత్​లోని జిల్లా కోర్టు. రాహుల్​ గాంధీని దోషిగా తేల్చింది. రెండేళ్ల జైలు శిక్షను విధించింది. 30 రోజుల పాటు బెయిల్​ను మంజూరు చేస్తూ.. తీర్పును సవాలు చేసేందుకు వెసులుబాటును కల్పించింది. ఈ వ్యవహారంపై రాహుల్​ గాంధీ తాజాగా ట్వీట్​ చేశారు.

Rahul Gandhi latest news : "సత్యం, అహింస నా మతం. సత్యం అన్నది నా దేవుడు. దానిని చేరుకునేందుకు అహింస సహకరిస్తుంది- మహాత్మా గాంధీ," అని రాహుల్​ గాంధీ తన ట్విట్టర్​ ఖాతాలో రాసుకొచ్చారు.

విపక్షాలు ఫైర్​..

రాహుల్​ గాంధీకి ఆయన సోదరి ప్రియాంక గాంధీ అండగా నిలిచారు.

Rahul Gandhi Jail sentence : "రాహుల్​ గాంధీ గొంతుకను అణచివేసేందుకు మొత్తం యంత్రాంగం శ్రమిస్తోంది. అన్ని విధాలుగా కృషిచేస్తోంది. నా సోదరుడు ఎప్పుడు భయపడలేదు. ఎప్పుడు భయపడడు కూడా. నిజాయితీగా జీవిస్తున్నాడు. నిజమే మాట్లాడతాడు. ప్రజల తరఫు ఉంటూనే ఉంటాడు. కోట్లాది మంది భారతీయుల ప్రేమ అతని వద్ద ఉంది," అని ప్రియాంక గాంధీ అన్నారు.

రాహుల్​ గాంధీకి జైలు శిక్ష వ్యవహారంపై ఢిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​ స్పందించారు. విపక్షాన్ని అంతం చేసేందుకు కుట్ర జరుగుతోందని మండిపడ్డారు.

Rahul Gandhi defamation case live updates : "విపక్ష నేతలు, పార్టీలను అంతం చేసేందుకే ఈ కుట్ర జరుగుతోంది. బీజేపీయేతర పార్టీల నేతలపై కేసులు వేసే విధంగా కుట్రలు చేస్తున్నారు. నాకు రాహుల్​ గాంధీతో విభేదాలు ఉండొచ్చు, కానీ పరువు నష్టం కేసులో ఆయన్ని ట్రాప్​ చేయడం సరైనది కాదు. నేను కోర్టును గౌరవిస్తాను, కానీ తీర్పును అంగీకరించలేను," అని కేజ్రీవాల్​ అన్నారు.

ఈ వ్యవహారంపై కాంగ్రెస్​ సీనియర్​ నేత, మధ్యప్రదేశ్​ మాజీ సీఎం దిగ్విజయ్​ సింగ్​ స్పందించారు. "మోదీ ఇంటి పేరును లేవనెత్తినా కూడా పరువు సమస్యలు వస్తుండటం ఆందోళనకర విషయం," అని అన్నారు.

రాహుల్​ గాంధీపై కేసు ఇది..

Rahul Gandhi news today : 2019 లోక్​సభ ఎన్నికలకు ముందు కర్ణాటకలో పర్యటించారు రాహుల్​ గాంధీ. కోలర్​లో నిర్వహించిన ఓ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీపై, మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. "దొంగలందరికి.. మోదీ అనే ఇంటి పేరే ఎందుకు ఉంటోంది?" అని అన్నారు. దేశం నుంచి పారిపోయిన నీరవ్​ మోదీ, లలిత్​ మోదీలతో పాటు ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ఈ ఇంటి పేరు ఉండటంతో.. రాహుల్​ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది.

ఈ క్రమంలో.. 2019లో గుజరాత్​లోని సూరత్​ జిల్లా కోర్టులో రాహుల్​ గాంధీకి వ్యతిరేకంగా పిటిషన్​ దాఖలు చేశారు గుజరాత్​ మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్​ మోదీ. మొత్తం మోదీ సంఘాన్నే కించపరించే విధంగా రాహుల్​ గాంధీ వ్యాఖ్యానించారు వ్యాజ్యంలో పేర్కొన్నారు.

Whats_app_banner
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.