తెలుగు న్యూస్  /  Lifestyle  /  What Is Schedule Sex Here's Complete Details

Schedule Sex : షెడ్యూల్ సెక్స్ అంటే ఏంటి? కలిగే ప్రయోజనాలు

HT Telugu Desk HT Telugu

26 February 2023, 20:50 IST

    • What Is Schedule Sex : జీవనశైలి మరిపోయింది.. ఎవరి లైఫ్ లో వారు బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ కారణంగా శృంగార జీవితం మీద కూడా ప్రభావం పడుతుంది. దీంతో కొంతమంది షెడ్యూల్ సెక్స్ వైపు ఆలోచిస్తున్నారు.
షెడ్యూల్ సెక్స్
షెడ్యూల్ సెక్స్

షెడ్యూల్ సెక్స్

సెక్స్ అనేది జంటలకు మానసికంగా మాత్రమే కాదు.. ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తోంది. రెగ్యూలర్ గా సెక్స్ చేయడం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు కూడా చెబుతారు. అయితే బిజీ లైఫ్ కారణంగా చాలా మంది సెక్స్(Sex)కు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది వారం కావొచ్చు., నెల కావొచ్చు. కొంతమంది దగ్గరే ఉన్నా.. కొన్ని కారణాలతో చేయకపోవచ్చు. అయితే ఇలాంటి వారంతా షెడ్యూల్ సెక్స్(Schedule Sex) చేయోచ్చు. అప్పటి వరకూ.. దానికి సంబంధించిన విషయాల గురించి మీ భాగస్వామితో మాట్లాడొచ్చు. ఇది ఇద్దరికీ మంచిది. కలిసిన రోజున ఎంచక్కా ఎంజాయ్ చేయోచ్చు. షెడ్యూల్ సెక్స్ ద్వారా ప్రయోజనాలూ ఉన్నాయి.

మీరు మీ భాగస్వామికి దూరంగా ఉంటే.. ఇలాంటి షెడ్యూల్ సెక్స్(Schedule Sex) ప్లాన్ చేయండి. అప్పటి వరకూ సెక్స్ సంబంధించిన విషయాల గురించి చర్చించండి. ఇద్దరూ కలిశాక రెచ్చిపోతారు. మాటలు అన్నీ గుర్తుచేసుకుంటారు. మీరు సెక్స్ తేదీ(Sex Date), సమయాన్ని షెడ్యూల్ చేసుకోవాలి. ఈ విషయాన్ని క్యాలెండర్ లో నోట్ చేసుకోవాలి. దీనితో మనసు ఆ రోజు మీద ఉంటుంది. షెడ్యూల్ చేసిన రోజున మీరు మీ భాగస్వామితో కలిసి స్వేచ్ఛగా ఉండేలా సమయాన్ని ప్లాన్ చేయాలి. టెక్నాలజీ(Technology) పెరిగిన ఈ రోజుల్లో ఫోన్లతోనే ఎక్కువగా గడుపుతున్నాం. మీ షెడ్యూల్ సెక్స్ రోజున సాంకేతిక పరికరాలను దూరంగా పెట్టండి. మీరిద్దరూ ఒకరికొకరు టైమ్ ఇచ్చుకోవాలి. ఏకాంతంగా గడపాలి.

సెక్స్ షెడ్యూల్ రోజున సెక్స్ నుండి మీరు తప్పించుకోలేరు. అప్పటికే ఆ రోజున చేస్తామనే మాటలు మీ మైండ్లో ఫిక్స్ అయిపోతాయి. సెక్స్ టైమ్ టేబుల్ ఫిక్స్ కారణంగా, మీరు మీ భాగస్వామితో సన్నిహిత క్షణాలను ఆనందిస్తారు. సెక్స్ కోసం ప్లాన్ చేసినప్పుడు... ఆ క్షణాల కోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. మీకు చాలా సమయం ఉంటుంది. మీ లైంగిక జీవితాన్ని మంచిగా మార్చేందుకు మీ భాగస్వామితో ప్లాన్ చేయాలి.

సెక్స్ షెడ్యూల్ చేయడం మీ సంబంధానికి నిబద్ధతను ప్రదర్శిస్తుంది. కమ్యూనికేషన్‌(Communication)ను మెరుగుపరుస్తుంది. నాణ్యమైన సమయానికి హామీ ఇస్తుంది. అయితే వారానికోసారో.. లేదంటే రెండు మూడు రోజులకు ఒక్కసారో.. మీరే డిసైడ్ చేసుకోవాలి. మీరు ఎక్కువ సెషన్‌లను షెడ్యూల్ చేస్తే, ఎక్కువ సెక్స్‌ చేసే అవకాశం ఉంటుంది.

మీ నిబద్ధతకు కట్టుబడి ఉన్నారని నిర్ధారించుకోవడానికి కనీసం ఒక వారం ముందుగానే క్యాలెండర్‌(Calendar)లో సెక్స్‌ని షెడ్యూల్ చేయండి. బిజీ షెడ్యూల్‌లతో లైఫ్ ఎటో వెళ్తుంది. మీ లైంగిక జీవితం దెబ్బతింటుంది. మీ క్యాలెండర్‌లో సెక్స్‌ని షెడ్యూల్ చేయడం అనేది మీ సెక్స్ జీవితం దెబ్బతినకుండా చూసుకోవడానికి ఒక మార్గం.

ఉదాహరణకు, మీరు మరియు మీ భాగస్వామి ప్రతి వారం సెక్స్‌(Weekly Sex)లో పాల్గొనడానికి ఎన్నిసార్లు ప్లాన్ చేస్తున్నారో లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. ఈ సంఖ్యపై పరస్పర ఒప్పందానికి రావడం ఒక ముఖ్యమైన మొదటి అడుగు. చాలా మంది జంటలు వారానికి ఒకసారి సెక్స్‌లో పాల్గొంటారని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే, ఈ సంఖ్య వయస్సును బట్టి మారుతుంది. మీ ఇద్దరికీ ఏది అనువైనదో తెలుసుకోవడానికి మీ భాగస్వామితో బహిరంగంగా చర్చించండి.

మీరు నెలకు రెండుసార్లు సెక్స్ చేయడానికి కష్టపడుతున్నప్పుడు ప్రతిరోజూ సెక్స్ చేయడానికి ప్లాన్ చేయడం సమంజసం కాదు. మీరు చిన్న లక్ష్యాలతో ప్రారంభించి, పెంచుకుంటూ పోవడం మంచిది. ఉదాహరణకు వారం వారం సెక్స్ లక్ష్యాన్ని చేరుకోవడానికి ముందు నెలకు రెండు, మూడు సార్లు లక్ష్యాన్ని చేరుకోవాలి.

ఒకే పరిమాణానికి సరిపోయే ఖచ్చితమైన సెక్స్ షెడ్యూల్ లేదు. ఇది జంట నుండి జంటకు చాలా తేడా ఉంటుంది. ఒక ఆదర్శవంతమైన సెక్స్ షెడ్యూల్ మీ బిజీ లైఫ్‌స్టైల్‌(Busy Lifestyle)ను పరిగణనలోకి తీసుకుంటుంది. మీ సన్నిహిత జీవితానికి సమయాన్ని వెచ్చించటానికి ఉపయోగపడుతుంది. మీ భాగస్వామితో మనసు విప్పి మాట్లాడి.. ఆనందంగా ఉండండి.