World AIDS Day 2022 | సంతోషకరమైన లైంగిక జీవితం కోసం 'రక్షణ' తప్పనిసరి!
World AIDS Day 2022: మీరు ఒకరితో దీర్ఘకాలిక సంబంధంలో ఉన్నా లేదా తాత్కాలిక సంబంధంలో ఉన్నా, సురక్షితమైన సెక్స్‌ను ఎలా ప్రాక్టీస్ చేయాలో తెలుసుకోవడం ముఖ్యం.
World AIDS Day 2022: ప్రతి సంవత్సరం డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవంగా పాటిస్తారు. ఈ రోజున, అరక్షిత సెక్స్ ద్వారా సంక్రమించే HIV/AIDS (అక్వైర్డ్ ఇమ్యునో డెఫిషియెన్సీ సిండ్రోమ్) వంటి లైంగిక వ్యాధుల గురించి అవగాహన కల్పిస్తారు. అంతేకాకుండా ఎయిడ్స్‌తో బాధపడుతున్న రోగులకు, హెచ్‌ఐవి-పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారికి ఆత్మస్థైర్యాన్ని అందిస్తారు. హెచ్‌ఐవికి వ్యతిరేకంగా పోరాటంలో ఐక్యంగా ఉండటానికి ప్రజలకు సందేశాన్ని ఇచ్చేందుకు ఇది ఒక అవకాశం.
AIDS అనేది HIV (హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్) వల్ల కలిగే ఒక అనారోగ్య పరిస్థితి. ఇది లైంగికంగా సంక్రమించే అంటువ్యాధి. HIV-పాజిటివ్ రోగితో లైంగిక సంబంధం కలిగి ఉండటం ద్వారా ఇది వారికి కూడా సోకుతుంది. అంతేకాకుండా HIV-పాజిటివ్ రోగికి ఉపయోగించిన ఇంజెక్షన్ డ్రగ్స్ వాడకం లేదా సూదులు వేరొకరికి వాడటం ద్వారా, HIV-పాజిటివ్ రోగి రక్తాన్ని మరొకరికి ఎక్కించటం ద్వారా కూడా ఈ వ్యాధి సోకుతుంది. గర్భధారణ సమయంలో, ప్రసవ సమయంలో లేదా తల్లి పాలిచ్చేటపుడు తల్లి నుంచి బిడ్డకు కూడా ఈ ఇన్ఫెక్షన్ సోకుతుంది.
అందుకే సురక్షితమైన లైంగిక సంబంధం ఆవశ్యకత, సురక్షితమైన సెక్స్ ఎలా అభ్యసించాలనే దానిపై అవగాహనను వ్యాప్తి చేయడానికి కూడా ఎయిడ్స్ దినోత్సవం ప్రాముఖ్యతను కలిగి ఉంది.
HIV/ STDలు సోకినపుడు ఉండే లక్షణాలు
జ్వరం, చలి, దద్దుర్లు, రాత్రి చెమటలు, కండరాల నొప్పులు, గొంతు మంట, అలసట, వాపు శోషరస కణుపులు, నోటి పూతలు ఉండవచ్చు. ఇవి కాకుండా సాధారణంగా STDలు సోకినపుడు..
మూత్రవిసర్జన, స్కలనం సమయంలో నొప్పి
జననేంద్రియ ప్రాంతంలో దద్దుర్లు లేదా దురద
పురుషాంగం నుండి లేదా యోని నుండి అసాధారణమైన ఉత్సర్గ
జననేంద్రియ ప్రాంతంలో దద్దుర్లు, గాయాలు లేదా పుండ్లు
చీము విడుదల చేసే బొబ్బలు
లేదా కొన్నిసార్లు అసలు లక్షణాలేమి కనిపించకపోవచ్చు.
HIV/STDల నివారణ
STDలు సోకకుండా నివారించాలంటే కేవలం మూడు మార్గాలు ఉపయోగపడతాయి. అవేంటో ఇక్కడ చూడండి.
సురక్షిత శృంగారంపై అవగాహన
హెచ్‌ఐవి వంటి లైంగిక సంక్రమణ వ్యాధులు ఎలా సోకుతాయో ముందుగా అవగాహన కలిగి ఉండండి. STDల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకునేందులు ఏం చేయాలో తెలిసి ఉండాలి. సెక్స్ సమయంలో ప్రతి STD వ్యక్తి నుండి వ్యక్తికి ఎలా సంక్రమిస్తుందో అర్థం చేసుకోండి.
రక్షణను ఎంచుకోండి
రక్షణ రెండు మార్గాలలో ఉంటుంది. ఒకటి సెక్సులో పాల్గొనకపోవడం, రెండోది నాణ్యమైన కండోమ్స్ ఉపయోగించడం. కండోమ్స్ చౌకైనవి, ఉపయోగించడానికి కూడా సులభమైనవి
పరీక్షలు చేసుకోవడం
ప్రతి STDకి వేర్వేరు పరీక్షలు ఉన్నాయి. అన్ని ఒకే టెస్టులో నిర్ధారించలేం. కాబట్టి లక్షణాలు, అనుమానాలు ఉన్నప్పుడు STDకి పరీక్షలు చేసుకోవడం మంచిది. మీరు పాజిటివ్ అయితే భాగస్వామికి ఇది తెలియజేస్తే వారిని రక్షించవచ్చు.
సంబంధిత కథనం