టాటూ వేయించుకున్న ఇద్దరికీ సోకిన HIV.. మీరు టాటూ వేయించకోవాలనుకుంటే జాగ్రత్త మరి-everyone must take these precautions when you get a tattoo ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  టాటూ వేయించుకున్న ఇద్దరికీ సోకిన Hiv.. మీరు టాటూ వేయించకోవాలనుకుంటే జాగ్రత్త మరి

టాటూ వేయించుకున్న ఇద్దరికీ సోకిన HIV.. మీరు టాటూ వేయించకోవాలనుకుంటే జాగ్రత్త మరి

Geddam Vijaya Madhuri HT Telugu
Aug 06, 2022 09:18 AM IST

వారణాసిలో టాటూలు వేయించుకున్న ఇద్దరు వ్యక్తులకు హెచ్‌ఐవీ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వారికి ఎటువంటి శారీరక సంబంధాలు లేకపోయినా.. ఎటువంటి రక్తం ఎక్కించుకోకపోయినా హెచ్‌ఐవీ వచ్చినట్లు తెలిసి షాక్ అయ్యారు. చివరికి టాటూ వల్లనే ఇది జరిగిందని తెలిసి బాధపడుతున్నారు. మరీ మీరు టాటూ వేయించుకోవాలని ఆలోచిస్తుంటే.. ఈ జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోండి.

<p>టూటుతో రిస్క్</p>
టూటుతో రిస్క్

టూటుతో రిస్క్

టాటూలు వేయించుకోవడమనేది ఈ జనరేషన్​లో ఫాష్యన్. రకరకాల టూటూలు వేయించుకుని సంబురపడిపోతుంటారు. తల్లిదండ్రులు గురించో.. ప్రేమించిన వారి గురించే.. లేదా వారి లైఫ్​కి తగిన కోట్స్ టాటూ రూపంలో వేయించుకుని ఆనందిస్తారు. అయితే ఈ టాటూలు వేయించుకునే సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే.. ప్రాణాలకే ప్రమాదం అనే విషయాన్ని మరోసారి రుజువు చేస్తుంది ఈ ఘటన.

మీడియా కథనాల ప్రకారం.. వారణాసిలోని బరాగావ్ ప్రాంతంలో నివసించే 20 ఏళ్ల యువకుడు ఇటీవల గ్రామంలో జరిగిన ఒక జాతరలో తన చేతికి టాటూ వేయించుకున్నాడు. ఇది జరిగిన వెంటనే.. అతని ఆరోగ్యం పాడైపోయింది. అతనికి తీవ్ర జ్వరంతో బలహీనుడయ్యాడు. కఠినమైన చికిత్సలు తీసుకున్నప్పటికీ.. అతనికి జ్వరం తగ్గలేదు. దీంతో వైద్యులు అతడికి హెచ్‌ఐవీ పరీక్షలు చేయించారు. దీనిలో షాక్​ అయ్యే రిజల్ట్ వచ్చింది. అతనికి HIV పాజిటివ్అని తెలింది. అయినప్పటికీ అతను ఆ నివేదికలను నమ్మలేదు. ఎందుకంటే.. తాను ఎలాంటి శారీరక సంబంధం పెట్టుకోలేదని.. రక్తం ఎక్కించలేదని వైద్యులకు తెలిపాడు. డాక్టర్లు అతని టాటూను గమనించి.. అతను హెచ్ఐవి పాజిటివ్‌గా ఉండటానికి కారణం అతని టాటూ అని వివరించారు.

నాగవాన్ ప్రాంతంలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. అక్కడ ఒక మహిళ ఒక హాకర్ నుంచి పచ్చబొట్టు వేయించుకుంది. వెంటనే అనారోగ్యంగా అనిపించడం ప్రారంభించింది. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమెకు హెచ్‌ఐవీ పాజిటివ్‌ అని తేలింది.

యాంటీరెట్రోవైరల్ చికిత్స (ART) సెంటర్ సీనియర్ డాక్టర్ ప్రీతీ అగర్వాల్ ప్రకారం ఇద్దరు హెచ్‌ఐవి సోకిన వ్యక్తులకు ఇన్‌ఫెక్షన్‌కు ప్రధాన కారణం గురించి ఎటువంటి క్లూ లేదు.

“వారు అసురక్షిత సెక్స్‌లో పాల్గొనలేదు. హెచ్​ఐవీ సోకిన రక్తం ఎక్కించుకోలేదు. అప్పుడు వారిని కౌన్సెలింగ్‌ చేయగా.. టాటూ వేయించుకున్నప్పటి నుంచి వారికి అనారోగ్య సమస్యలు మొదలయ్యాయని వెలుగులోకి వచ్చింది’’ అని డాక్టర్‌ స్పష్టం చేశారు. ఇన్ఫెక్షన్‌కు ప్రధాన కారణం టాటూ కోసం ఉపయోగించిన సూదులే ఆమె తెలిపింది.

ఎందుకలా అంటే..

టాటూలు వేయడానికి ఉపయోగించే సూదులు చాలా ఖరీదైనవి. అయినప్పటికీ.. ఆ టాటూ ఆర్టిస్ట్ ఒక కస్టమర్ కోసం ఒక సూదిని ఉపయోగించిన తర్వాత దానిని విసిరివేయాలి. కానీ వారు ఎక్కువ డబ్బు సంపాదించడం కోసం ఒకే సూదిని ఇతర వ్యక్తులకు ఉపయోగించడం వల్లనే ఇలా జరిగిందని డాక్టర్ తెలిపారు.

టాటూలు వేయించుకోవాలనుకునే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

టాటూలు వేయించుకునే వారు.. వేయించుకోవాలని ఆలోచన ఉన్నవారు కచ్చితంగా ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. సాధారణంగా డాక్టర్లు ఒకరికి వాడిని సూదిని మరొకరికి ఎలా వాడరో.. టాటూ వేయించుకునే సూది కూడా అంతే. లేదంటే ఒకరికి చెందిన రోగాలు మరొకరికి వచ్చే ప్రమాదముంది.

పచ్చబొట్టు తయారీదారు యంత్రంలో కొత్త సూదిని పెట్టాడో లేదో చూసుకోవాలి. టాటూ వేయించుకుంటున్నామనే ఆనందంలో దీనిమీద శ్రద్ధ చూపకపోతే.. జీవితాంత బాధపడాల్సి వస్తుంది. ఇటీవల టాటూలు వేయించుకున్నవారు.. హెల్త్ విషయంలో ఏమైనా ఇబ్బందులు అనుభవిస్తుంటే వెంటనే హెల్త్​ చెకప్ చేయించుకోవాలని సూచిస్తున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం