తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mango Murabba: మామిడికాయలతో మురబ్బా చేసుకొని తినండి, రుచి అదిరిపోతుంది

Mango Murabba: మామిడికాయలతో మురబ్బా చేసుకొని తినండి, రుచి అదిరిపోతుంది

Haritha Chappa HT Telugu

03 May 2024, 15:30 IST

google News
    • Mango Murabba: వేసవి వచ్చిందంటే మామిడికాయలు అధికంగా దొరుకుతాయి. మామిడి పండ్లు, మామిడికాయలు వేసవిలోనే లభిస్తాయి. కాబట్టి వాటిని తినాలి. మామిడి కాయలతో చేసే మ్యాంగో మురబ్బా చాలా టేస్టీగా ఉంటుంది.
మ్యాంగో మురబ్బా రెసిపీ
మ్యాంగో మురబ్బా రెసిపీ

మ్యాంగో మురబ్బా రెసిపీ

Mango Murabba: పుల్లపుల్లగా తీయగా ఉండే మ్యాంగో మురబ్బా నాలికకు తగిలితే చాలు... యమ్మీగా అనిపిస్తుంది. ఈ మ్యాంగో మురబ్బాను చేయడం చాలా సులువు. పిల్లలు కూడా దీన్ని ఇష్టంగా తింటారు. ముఖ్యంగా పచ్చి మామిడికాయలతో చేస్తాం కాబట్టి ఇది ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. కాస్త పుల్లపుల్లగా ఉండే అందరికీ నచ్చుతుంది. దీని చేయడం చాలా సులువు. ఈ రెసిపీ కోసం కేవలం పుల్లగా ఉండే పచ్చి మామిడికాయలను మాత్రమే ఎంచుకోవాలి. అప్పుడే ఇది టేస్టీగా వస్తుంది.

మ్యాంగో మురబ్బా రెసిపీకి కావాల్సిన పదార్థాలు

పచ్చి మామిడి కాయలు - నాలుగు

పంచదార - ఒక కప్పు

బెల్లం తురుము - ఒక కప్పు

బ్లాక్ సాల్ట్ - అర స్పూను

కారం - అర స్పూను

జీలకర్ర పొడి - అర స్పూను

మ్యాంగో మురబ్బా రెసిపీ

1. మ్యాంగో మురబ్బా చేయడానికి చాలా పుల్లగా ఉండే మామిడికాయల్ని ఎంచుకుంటే ఇది ఎక్కువ రోజులపాటు నిల్వ ఉంటుంది. రుచి కూడా బాగుంటుంది.

2. మామిడికాయలపై ఉండే పొట్టును తీసేయాలి.

3. మామిడికాయలను సన్నగా తురిమి ఒక గిన్నెలో వేసుకోవాలి.

4. స్టవ్ మీద కళాయి పెట్టి చిన్న మంట పెట్టాలి.

5. అందులోనే మామిడికాయ తురుమును వేయాలి.

6. అలాగే బెల్లం తురుమును కూడా వేసి కలుపుకోవాలి.

7. పంచదార వేసి ఈ మొత్తం మిశ్రమాన్ని ఉడికించాలి.

8. ఇదంతా హల్వాలాగా అవుతుంది.

9. ఆ సమయంలో జీలకర్ర పొడి, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి.

10. ఇదంతా దగ్గరగా గట్టి పడే వరకు చిన్న మంట మీద ఉడికిస్తూనే ఉండాలి.

11. బెల్లం తీగపాకంలాగా సాగుతున్నట్టు అవుతుంది.

12. ఆ సమయంలో స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే తియ్య తీయగా పుల్లపుల్లగా ఉండే మ్యాంగో మురబ్బా రెడీ అయినట్టే.

13. దీన్ని గాలి చొరబడని డబ్బాల్లో దాచుకొని మూత పెట్టుకోవాలి.

14. ఇప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని తినవచ్చు. పుల్లపుల్లగా ఉండే దీని రుచి ఎక్కువ రోజులు పాటు నిల్వ ఉండేలా చేస్తుంది.

పుల్ల మామిడికాయలు వేసవిలోనే లభిస్తాయి. కాబట్టి సీజనల్గా దొరికే వాటిని కచ్చితంగా తినాలి. ఇలా మ్యాంగో మురబ్బా చేసుకుంటే మీకు నోరు చప్పగా అనిపించినప్పుడల్లా దీన్ని టేస్ట్ చేస్తే అదిరిపోతుంది.

టాపిక్

తదుపరి వ్యాసం