Gap in intercourse: మీరు కొంతకాలం సెక్స్ చేయకపోతే ఏం జరుగుతుంది?-what happens if you do not have sex for some days details inside ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  What Happens If You Do Not Have Sex For Some Days Details Inside

Gap in intercourse: మీరు కొంతకాలం సెక్స్ చేయకపోతే ఏం జరుగుతుంది?

HT Telugu Desk HT Telugu
Feb 20, 2023 08:50 PM IST

Gap in inter course: కొంతమంది కొన్ని కారణాలతో శృంగారానికి దూరంగా ఉంటారు. ఉద్యోగం వలన, ఇతర బాధ్యతలతో అలా అవుతుంది కామన్. అయితే దీనిపై కొన్ని అపోహలు ఉన్నాయి. కొంతకాలం సెక్స్ చేయకపోతే ఏం జరుగుతుంది?

శృంగార జీవితం
శృంగార జీవితం (unsplash)

సెక్స్ చుట్టూ అనేక అపోహలు ఉంటాయి. దీనికి సెక్స్ ఎడ్యుకేషన్(Sex Education) లేకపోవడం ప్రధాన కారణమని చెప్పవచ్చు. అయితే జీవితంలో కొన్ని కారణాలతో సెక్స్ కు కొంతకాలం గ్యాప్ వస్తుంది. కావాలని ఉన్నా.. పరిస్థితులు అలా చేసేస్తాయి. దాంపత్య జీవితంలో కలహాలు, విడాకులు, బిజీ షెడ్యూల్, ఉద్యోగం కోసం ఇతర ప్రాంతాల్లో ఉండటం ఇలా చాలానే కారణాలు ఉంటాయి. అయితే సెక్స్(Sex)కు చాలా రోజులు దూరంగా ఉండే ఎలాంటి సమస్యలు వస్తాయి?

ఎక్కువ కాలం సెక్స్ చేయకపోవడం వలన కొన్ని సమస్యలు వస్తాయని నిపుణులు చెప్పే మాట. మహిళల్లో జననేంద్రియ సమస్యలు వస్తాయి. అంత త్వరగా బయటపడకపోవచ్చు. కానీ తరువాత ఆమె మళ్ళీ సెక్స్ చేసేప్పుడు.. సమస్యలు రావొచ్చు. మీరు సెక్స్ నుండి విరామం(Break) తీసుకుంటే.. యోని బిగుతుగా ఉన్నట్లు అనిపిస్తే, అది టెన్షన్ లేదా కంఫర్ట్/ప్రేరేపణ లేమికి సంబంధించినది కావచ్చు.

ఎక్కువ కాలం సెక్స్ చేయకపోవడం వల్ల లిబిడో తగ్గిపోతుందని కూడా నమ్ముతారు. అయితే మీరు రిలేషన్ షిప్‌(Relationship)లో ఉన్నట్లయితే, మీ కోరికలు, అవసరాలను మీ భాగస్వామికి తెలియజేయాలి. సెక్స్ సమయంలో ఎండార్ఫిన్, ఆక్సిటోసిన్ వంటి హ్యాపీ హార్మోన్లు రిలీజ్ అవుతాయి. శృంగారానికి దూరంగా ఉంటే.. మీ శరీరం హార్మోన్లను తక్కువగా విడుదల చేస్తుంది. ఈ కారణంగా ఒత్తిడి(Stress)ని ఎదుర్కోవలసి వస్తుంది. ఆందోళన కూడా ఉంటుంది.

క్రమం తప్పకుండా సెక్స్ చేయడం వల్ల రోగనిరోధక(Immunity) వ్యవస్థ పనితీరు మెరుగుపడడం, రక్తపోటు తగ్గడం, ఒత్తిడి స్థాయిలు తగ్గడం, గుండె ఆరోగ్యం బాగుండటం కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. నిర్దిష్ట ఆహారాలు, పని దినచర్యలతోనూ ఈ ఆరోగ్యాలను పొందొచ్చు.

మీ మానసిక ఆరోగ్యం(Mental Health)పైనా సెక్స్ అనేది ప్రభావం చూపిస్తుంది. చాలా కాలం తర్వాత సెక్స్ చేసే మహిళలకు, ఆందోళన కీలక పాత్ర పోషిస్తుంది. అయితే చాలా రోజుల తర్వాత సెక్స్‌లో పాల్గొనే ముందు మీ భాగస్వామి ఫోర్‌ప్లేలో నిమగ్నమై ఉండేలా ప్లాన్ చేయండి. ఇది కాస్త మీకు ఉపశమనం కలిగిస్తుంది. శృంగారానికి దూరంగా ఉండటం కారణంగా.. మతిమరుపు వచ్చే అవకాసం ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. సెక్స్ చేయకపోవడం వల్ల జ్ఞాపకశక్తి సమస్యలు పెరిగే అవకాశం ఉంది.

లైంగిక ఉద్దీపన లేకపోవడం వల్ల యోనిలో సహజ సరళత తగ్గుతుంది అనేది నిజం. అందువల్ల, మహిళలు చాలా కాలం తర్వాత సెక్స్ చేస్తున్నట్లయితే లూబ్రికెంట్లను ఉపయోగించడం మంచిది. చాలా కాలం సెక్స్ కు దూరంగా ఉంటే యోని భాగంలో అసౌకర్యంగా ఉంటుంది. ఆ తర్వాత సౌకర్యవంతంగా చేసేందుకు కాస్త సమయం పడుతుంది. అంతేకాదు.. ఎక్కువ గ్యాప్ వస్తే.. సెక్స్ పట్ల ఆసక్తిని పూర్తిగా కోల్పోయేలా చేస్తుంది. తరచూ పాల్గొంటే.. శృంగార సామర్థ్యం మెరుగుపడుతుంది.

WhatsApp channel

సంబంధిత కథనం