తెలుగు న్యూస్ / ఫోటో /
Relationship Tips। భాగస్వామి ప్రవర్తన విసుగు తెప్పిస్తే.. ఈ పని చేయండి!
- Relationship Tips: భార్యాభర్తల మధ్య సంబంధం ప్రేమ, అవగాహన అనే దారంతో ముడిపడి ఉంటుంది. కొన్నిసార్లు భాగస్వామి అనుచిత ప్రవర్తన, అపార్థాలు ఇద్దరి హృదయంలో ద్వేషం పుట్టడానికి దారితీస్తుంది.
- Relationship Tips: భార్యాభర్తల మధ్య సంబంధం ప్రేమ, అవగాహన అనే దారంతో ముడిపడి ఉంటుంది. కొన్నిసార్లు భాగస్వామి అనుచిత ప్రవర్తన, అపార్థాలు ఇద్దరి హృదయంలో ద్వేషం పుట్టడానికి దారితీస్తుంది.
(2 / 8)
మీ భాగస్వామి తరచూ విసుగు తెప్పిస్తుంటే, దానికి కలత చెందడం లేదా వారితో గొడవలు పెట్టుకోవడం వలన మీ సంబంధంలో అలజడి చెలరేగవచ్చు. మీ ఇద్దరి మధ్య అవగాహన కుదరడానికి ఈ చిట్కాలు పాటించండి.
(3 / 8)
మీ భాగస్వామి చిరాకు తెప్పిస్తున్నారంటే అది ఏ విషయంలో, అందుకు కారణం ఏమిటో ముందుగా అర్థం చేసుకోవాలి. ఇందుకు ఇద్దరిదీ పాత్ర ఉంటే ముందుగా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నించండి.
(4 / 8)
మీ భాగస్వామి స్వభావమే ఎల్లప్పుడూ చిరాకుగా ఉన్నట్లయితే, వెంటనే వారిపై అరవకుండా కాస్త సంయమనం పాటించండి. సహనంతో మార్గం సుగమం అవుతుంది.
(5 / 8)
భార్యాభర్తల మధ్య తరచుగా ఇంటి బాధ్యతల విషయంలో గొడవలు జరుగుతుంటాయి. బాధ్యత ఇద్దరిదీ కాబట్టి వారు శ్రద్ధ చూపకపోతే వారికి మీ నుంచి కొంత సహకారం అందించండి. వారిని ఇన్వాల్వ్ చేయడానికి ప్రయత్నించండి.
(6 / 8)
ఇద్దరూ కలిసి సమయాన్ని గడపండి. కొన్నిసార్లు ఒంటరితనం వల్ల కూడా వ్యక్తుల్లో చిరాకు రావడం మొదలవుతుంది. అటువంటి పరిస్థితిలో, మీ భాగస్వామికి పూర్తి సమయం ఇవ్వండి. పనితో పాటు వారికి కొంత సమయం ఇవ్వండి. ఇది భాగస్వామి మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.
ఇతర గ్యాలరీలు