Sextortion : సెక్స్‌టార్షన్ అంటే ఏంటి.. అధికారులు ఏం చెబుతున్నారు?
Cyber Crime In Hyderabad : మీ సోషల్ మీడియా లేదా డేటింగ్ సైట్‌లో ఉండేవారితో అప్రమత్తంగా ఉండి. స్నేహపూర్వకంగా ఉంటూ ఆమె వ్యక్తులను లైంగిక పరిస్థితుల్లోకి ఆకర్షించొచ్చు. మీరు సెక్స్‌టార్షన్ కు గురికావొచ్చు.
భాగ్యనగరంలో సెక్స్‌టార్షన్(Sextortion) కేసులు పెరిగాయి. పెద్ద మొత్తంలో చెల్లించమని చాలా మంది సైబర్ నేరస్థులు.. బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. డేటింగ్ ప్లాట్‌ఫారమ్(Dating Platforms)లు ప్రజలను మోసం చేసేందుకు.. వారి నుండి డబ్బును లాగేందుకు స్కామర్‌లకు కొత్త మార్గంగా ఉన్నాయి. లైంగికంగా ఆకర్శించి.. మీ ఫోటోలు, వీడియోలను చూపించి.. డబ్బులు వసూలు చేయడాన్ని 'సెక్స్‌టార్షన్' అని పిలుస్తారు.
ఈ నెల మొదట్లో చర్లపల్లి సెంట్రల్ జైలు(Charlapally Central Jail) అధికారికి ఒకరిని సైబర్ మోసగాళ్లు మోసం చేసినట్టుగా తెలుస్తోంది. వీడియోను వైరల్(Viral) చేస్తానని మహిళ బెదిరించడంతో తుర్కయాంజాల్ విద్యార్థి 'సెక్స్‌టార్షన్'కు గురై రూ.98,400 పోగొట్టుకున్నాడు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU) అధికారుల ప్రకారం.. బంగ్లాదేశ్(Bangaldesh)లో ఇటువంటి ప్లాట్‌ఫారమ్‌లపై ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. హైదరాబాద్(Hyderabad), వైజాగ్, బెంగళూరులలో ఉద్యోగాలు, గృహాలు కల్పిస్తామని హామీ ఇచ్చి.. ఇక్కడ దించుతారు. 'వారికి తప్పుడు గుర్తింపులు ఇస్తారు. భారతదేశంలోని వివిధ నగరాలకు వెళ్తారు. అక్కడ వారు వ్యభిచారం, సైబర్‌సెక్స్‌లోకి బలవంతం చేస్తారు.' అని ఓ అధికారి తెలిపారు.
సెక్స్‌టార్షన్ తరచుగా ఫ్రెండ్‌షిప్ ఆఫర్‌లతో ప్రారంభమవుతుంది. దోపిడీ చేసేందుకు ప్లాన్ వేసుకున్న వాళ్లు.. ముందుగా మీ ఫోటోలు, వీడియోలను షేర్ చేయమంటారు. 'డేటింగ్ యాప్‌లతో పాటు, సోషల్ మీడియా, వాట్సాప్ వంటి మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లలోని వ్యక్తులను కూడా లక్ష్యంగా చేసుకుంటారు. వీడియో కాల్ చేస్తారు. వీడియో కాల్ సమయంలో మహిళ మాట్లాడుతూ.. బట్టలు విప్పుతుంది. అవతలి వైపు స్క్రీన్-రికార్డింగ్(Screen Recording) చేస్తారు. రికార్డింగ్ తరువాత బాధితుడిని బెదిరించి డబ్బు వసూలు చేయడానికి ఉపయోగిస్తారు.' అని ఒక అధికారి చెప్పారు.
రాచకొండ సైబర్ క్రైమ్ అధికారులు, సైబర్ సెక్యూరిటీ నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. చాలా మంది సెక్స్ టార్షన్ బాధితులు ఫిర్యాదు చేసేందుకు భయపడుతున్నారు. డేటింగ్ యాప్(Dating App)లో వారి గురించి బాధితులు కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తెలుస్తుందనే ప్రధాన భయంగా ఉంటుంది. అలాంటి ప్లాట్‌ఫారమ్‌లలో వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని పంచుకునే ముందు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.