Gujarat Sextortion case : సెక్స్ వీడియో కాల్ 'ట్రాప్​'తో.. రూ. 2.69కోట్లు పోగొట్టుకున్న వ్యాపారి!-gujarat businessman loses 2 69 crores in sex video call trap says cops ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Gujarat Businessman Loses 2.69 Crores In Sex Video Call Trap Says Cops

Gujarat Sextortion case : సెక్స్ వీడియో కాల్ 'ట్రాప్​'తో.. రూ. 2.69కోట్లు పోగొట్టుకున్న వ్యాపారి!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 13, 2023 01:32 PM IST

Gujarat Sextortion case : అతనో వ్యాపారి. ప్రశాంతంగా జీవిస్తున్న అతని జీవితంలోకి ఓ మహిళ ప్రవేశించింది. వీడియో కాల్​ చేసి దుస్తులు విప్పేయమంది. ఆమె చెప్పినట్టే చేసిన అతనికి.. ఆ తర్వాత ప్రశాంతత కరువైంది! నగ్న దృశ్యాలను ఆన్​లైన్​లో లీక్​ చేస్తానని బెదిరించి రూ. 50వేలు వసూలు చేసింది. అక్కడి నుంచి ఒకరి తర్వాత ఒకరు.. ఆ వ్యాపారికి కాల్​ చేస్తూ.. మొత్తం మీద రూ. 2.69కోట్లు దోచుసుకున్నారు!

సెక్స్ వీడియో కాల్ 'ట్రాప్​'తో.. రూ. 2.69కోట్లు పోగొట్టుకున్న వ్యాపారి!
సెక్స్ వీడియో కాల్ 'ట్రాప్​'తో.. రూ. 2.69కోట్లు పోగొట్టుకున్న వ్యాపారి!

Gujarat sex video call trap : గుజరాత్​కు చెందిన ఓ వ్యాపారిని కొందరు దుండగులు దోచుసుకున్నారు! ఓ మహిళను ఎర వేసి.. ఆమె ఉచ్చులోకి ఆ వ్యాపారిని దింపి.. చాలా నెలల పాటు ఆడుకున్నారు. మహిళ తీసిన ఆ వ్యాపారి 'నగ్న' దృశ్యాలతో రూ. 2.69కోట్లు వసూలు చేశారు. ఫేక్​ ఇన్​స్పెక్టర్​, ఫేక్​ సీబీఐ అధికారి, ఫేక్​ ఢిల్లీ హైకోర్టు ఆర్డర్​లు.. ఇలా దొరికినది దొరికినట్టు వాడుకుని.. ఆ వ్యాపారిని మానసికంగా క్షోభకు గురిచేశారు! ఈ సెక్స్​టార్షన్​ కేసులో అసలు ఏమైందంటే..

ట్రెండింగ్ వార్తలు

అసలేం జరిగిందంటే..

బాధితుడు.. ఓ రినెవెబుల్​ ఎనర్జీ సంస్థకు యజమాని. గతేడాది ఆగస్టు 8న.. అతనికి ఓ మహిళ నుంచి ఫోన్​ వచ్చింది. ఆ మహిళ తనని తాను రియా శర్మగా పరిచయం చేసుకుంది. మార్బిలో నివాసముంటున్నట్టు చెప్పింది.

Gujarat sex video call trap case : కొన్ని రోజుల తర్వాత.. వ్యాపారి- మహిళ వీడియో కాల్​ చేసుకున్నారు. వీడియో కాల్​లో దుస్తులు విప్పాలని ఆ మహిళ, వ్యాపారికి సూచించింది. అతను దస్తులు విప్పాడు! కొంతసేపు తర్వాత.. ఆ మహిళ వీడియో కాల్​ను కట్​ చేసేసింది.

కొద్ది సేపటికి ఆ మహిళ.. వ్యాపారికి ఫోన్​ చేసింది. "నీ న్యూడ్​ వీడియో నా దగ్గర ఉంది. రూ. 50వేలు ఇవ్వు. లేకపోతే ఆన్​లైన్​లో లీక్​ చేస్తా," అని బెదిరించింది. అతను రూ. 50వేలు చెల్లించాడు!

కొన్ని రోజుల తర్వాత.. బాధితుడికి మరో ఫోన్​ వచ్చింది. 'నేను ఢిల్లీలోని ఇన్​స్పెక్టర్​ గుడ్డు శర్మ మాట్లాడుతున్నాను. నీ న్యూడ్​ వీడియో నా చేతికి వచ్చింది. వీడియో లీక్​ చేయకుండా ఉండాలంటే.. రూ. 3లక్షలు చెల్లించాలి,' అని ఓ వ్యక్తి.. వ్యాపారిని డిమాండ్​ చేశాడు. బాధితుడు రూ. 3లక్షలు ఇచ్చాడు.

sex video call trap case : ఆగస్టు 14న.. ఢిల్లీ పోలీస్​ సైబర్​ సెల్​ సిబ్బంది అంటూ.. బాధితుడికి ఓ వ్యక్తి ఫోన్​ చేశాడు. "ఆ మహిళ ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. నువ్వేం చేశావు? ఇందులో నీ పేరు బయటకు రాకుండా ఉండాలంటే రూ. 81లక్షలు చెల్లించాలి," అని బెదిరించాడు. ఇతనికి కూడా బాధితుడు డబ్బులు ఇచ్చాడు.

ఇంకొన్ని రోజుల తర్వాత.. సీబీఐ అధికారి అంటూ.. ఇంకో వ్యక్తి, బాధితుడికి ఫోన్​ చేశాడు. "ఆత్మహత్య చేసుకున్న మహిళ తల్లి.. సీబీఐ దగ్గరికి వచ్చింది. మాటర్​ సెటిల్​ చేయాలంటే.. రూ. 8.5లక్షలు ఇవ్వు," అని ఆ వ్యక్తి, వ్యాపారితో అన్నాడు. ఇలా రోజులు గడిచాయి. డిసెంబర్​ వరకు డబ్బులు చెల్లిస్తూ వచ్చాడు ఆ వ్యాపారి.

Gujarat crime news : డిసెంబర్​లో అసలైన ట్విస్ట్​ ఎదురైంది. నేరగాళ్లు ఎంతు తెగించారంటే.. ఢిల్లీ హైకోర్టు నుంచి ఆదేశాలు వచ్చాయని చెబుతూ.. బాధితుడికి ఫోన్​ చేశారు. 'ఈ కేసులో నువ్వు నిర్దోషివి అంటూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలిచ్చింది. కేసును కొట్టేసింది,' అని చెప్పారు.

బాధితుడికి ఇక్కడే అనుమానం వచ్చింది. ఈ ఏడాది జనవరి 10న.. సైబర్​ క్రైమ్​ బ్రాంచ్​కు వెళ్లాడు. 11మందిపై కేసు వేశాడు. వారందరు తన నుంచి రూ. 2.69కోట్లు దోచుకున్నట్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఘటనపై సెక్షన్​ 387, 170, 465, 420, 120-బీ కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ పూర్తి వ్యవహారంపై దర్యాప్తును ముమ్మరం చేశారు.

IPL_Entry_Point