తెలుగు న్యూస్  /  Lifestyle  /  Low Calorie Soups And Stews Recipes To Lose Weight Fast Naturally

Low Calorie Soups Recipes। వేగంగా బరువు తగ్గేందుకు తక్కువ కేలరీలు కలిగిన సూప్‌లు

HT Telugu Desk HT Telugu

23 November 2022, 23:26 IST

    • Low Calorie Soups Recipes: బరువు తగ్గేందుకు కేలరీలు తక్కువగా ఉండే ఆహారాలు కోరుకుంటున్నారా? ఇక్కడ పేర్కొన్న 3 సూప్స్ తాగండి, వేగంగా బరువు తగ్గిపోండి.
Low Calorie Soups
Low Calorie Soups (Unsplash)

Low Calorie Soups

శీతాకాలంను ఆస్వాదించాలంటే మన ఆహారంలో వేడి వేడి సూప్‌లు కూడా ఉండేలా చూసుకోవాలి. చల్లటి చలిలో ఒక గినె నిండా రుచికరమైన వేడి సూప్ తాగితే వెచ్చదనం లభిస్తుంది. ఈ సీజన్ లో సూప్‌లు మీలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి, మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

మీరు బరువు తగ్గాలనే ఆలోచనలో ఉంటే కూడా వెజిటెబుల్ సూప్‌లు మీకు ఎంతో మంచి ఆహారంగా ఉంతాయి. ఎందుకంటే సూప్‌లు ద్రవపదార్థాలు కాబట్టి ఇవి తేలికగా జీర్ణమవుతుతాయి, అదే సమయంలో మీ ఆకలిని తీర్చి మీ కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి. ఇంకా ఇందులో కొన్ని తక్కువ కేలరీలు కలిగిన సూప్‌లు కూడా ఉన్నాయి. ఇవి తీసుకుంటే మీ శరీరంలో ఎక్కువ కేలరీలు చేరవు, పైగా అదనపు కొవ్వు కరుగుతుంది.

Low Calorie Soups - Stews Recipes- తక్కువ కేలరీలు కలిగిన సూప్‌ల రెసిపీలు

మీరు బరువు తగ్గేందుకు తక్కువ కేలరీలు కలిగిన సూప్‌లు తీసుకోవాలనుకుంటే ఆ జాబితాలో గుమ్మడికాయ పాలకూర సూప్, వెజిటబుల్ టొమాటో సూప్, సామై హాఫ్ వెజ్ సూప్ అద్భుతంగా ఉంటాయి. వాటిని రుచికరంగా ఎలా చేసుకోవాలి, సులభమైన రెసిపీలు ఇక్కడ అందజేస్తున్నాం చూడండి.

గుమ్మడికాయ పాలకూర సూప్ రెసిపీ

పావు కిలో బూడిద గుమ్మడికాయ తీసుకొని, శుభ్రంగా కడిఫి ఆపై తొక్క తీసి, చిన్న ముక్కలుగా కోయాలి, గింజలు తీసేయాలి. ఒక ఆపిల్ పీల్, ఆపిల్ ముక్క , పాలకూర ఆకులు, చిన్న అల్లం ముక్క అన్నీ వేసి గ్రైండర్ లో బాగా రుబ్బుకోవాలి. తర్వాత ఫిల్టర్ చేసుకోవాలి. అందులో కాస్త ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం, తేనె, చాట్ మసాలా పొడి వేసి తాగండి. ఈ సూప్ తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి. చెడు కొవ్వు నిల్వ ఉండదు.

వెజిటబుల్ టొమాటో సూప్ రెసిపీ

ఈ సూప్ తయారీకి కావలసినవి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, కాలీఫ్లవర్, బ్రోకలీ, క్యాబేజీ. అన్నీ కలిపి 200 గ్రాములు ఉండాలి. వీటిని ముక్కలుగా కోసుకొని, ఆపై మూడు టొమాటోల రసాన్ని తీసుకుని వడకట్టి ప్రెజర్ కుక్కర్ లో వేయాలి. ఆపై వెల్లుల్లి, లవంగాలు, సెలెరీ వేసుకోవాలి. ఉడికిన తర్వాత ఫిల్టర్ చేసి ఒక గిన్నెలోకి తీసుకొని, అవసరం మేరకు ఉప్పు, మిరియాల పొడి వేసి సర్వ్ చేసుకోవాలి. రాత్రి భోజనానికి బదులు వారానికి రెండు సార్లు ఈ సూప్ తాగితే బరువు పెరగరు. అనవసరమైన కొవ్వు కూడా కరుగుతుంది.

సామై హాఫ్ వెజ్ సూప్ రెసిపీ

పాన్‌లో ఒకటిన్నర టేబుల్ స్పూన్ సామై రైస్ లేదా సామల బియ్యం వేసి సువాసన వచ్చే వరకు వేయించాలి. చల్లారిన తర్వాత కడిగి చిన్న ప్రెషర్ కుక్కర్ లో వేసి రెండు టంబ్లర్ల నీళ్లు పోసి 2 వెల్లుల్లి రెబ్బలు దంచి వేయాలి. ఆపై సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి, 3 విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. పూర్తయ్యాక, గిన్నెలోకి ఫిల్టర్ చేసుకొని ఉప్పు, తెల్ల మిరియాలు వేసుకొని తాగవచ్చు. అవసరమైతే ఆకుకూరలు, బఠానీలు కలిపి కూడా ఉడికించుకోవచ్చు. ఈ సూప్ జీర్ణక్రియకు మంచిది, బరువు ఈజీగా తగ్గుతారు.