తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Healthy Winter Soups । చల్లటి చలిలో వెచ్చటి సూప్‌లు.. ఆస్వాదించండి, ఆనందించండి!

Healthy Winter Soups । చల్లటి చలిలో వెచ్చటి సూప్‌లు.. ఆస్వాదించండి, ఆనందించండి!

HT Telugu Desk HT Telugu

17 November 2022, 17:29 IST

google News
    • Healthy Winter Soups: చలికాలంలో వేడివేడిగా రోజూ ఒక కప్పు ఇలాంటి సూప్స్ తాగితే హాయిగా ఉంటుంది, ఆరోగ్యకరంగా ఉంటారు.
Healthy Winter Soups:
Healthy Winter Soups: (Pixabay)

Healthy Winter Soups:

Healthy Winter Soups: శీతాకాలం వచ్చిందంటే చల్లటి గాలుల్లో కొంచెం వెచ్చగా, ఇంకొంచెం హాయిగా అనిపించే అంశాల గురించి ఆలోచించకుండా ఉండలేము. ఈ చలికాలంలో వేడివేడి మసాల టీలతో పాటు, రుచికరమైన సూప్‌లు మనసును శాంతింపజేయడమే కాకుండా ఆరోగ్యానికి అనేక విధాల సహాయపడతాయి.

గిన్నె నిండుగా పాలు, వెన్న, మిరియాలు, ఇతర సుగంధ దినుసులు, ఉడికించిన కూరగాయల రసాలు కలగలిసిన సూప్ తాగుతుంటే, చలికి సుస్తయిన ప్రాణం ఒక్కసరిగా లేచి వచ్చిన అనుభూతి కలుగుతుంది. అలాంటి కొన్ని అద్భుతమైన సూప్‌ల రెసిపీలు మీకు ఇక్కడ తెలియజేస్తున్నాం, మరి మీరు ఆస్వాదించడానికి సిద్ధమేనా? అయితే పదండి, వెచ్చని సూప్‌లలో మునిగి తేలడానికి.

టొమాటో జాస్మిన్ సూప్

టామోటా సూప్ ఏ కాలంలోనైనా చాలామందికి ఆల్ టైం ఫేవరెట్. టొమాటో పల్ప్ టాంగీ ఫ్లేవర్‌తో జాస్మిన్ టీ తీపిని మిళితం చేసే ఈ సూప్ శీతాకాలంలో ఆస్వాదించడనికి అమోఘమైన రుచిని, అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగినది. మిరియాలు, ఇతర మూలికలు, ఆలివ్ నూనె కలిపి చేసుకోవాలి.

ఆల్మండ్ మష్రూమ్ సూప్

ముతకగా తరిగిన పుట్టగొడుగులు, బాదం పప్పులు, మిరియాలు, క్రీమ్, వెన్న, పాలు అన్నీ కలిపి ఉడికించి ఈ సూప్ చేసుకోవాలి. సాయంత్రం వేళ కుటుంబ సభ్యులంతా కలిసి ఆస్వాదించడానికి ఇది అద్భుతమైన హాయిగొలిపే సూప్

బీట్‌రూట్ సూప్

శీతాకాలంలో బీట్‌రూట్ శరీరానికి చాలా అవసరం. సోరకాయ లేదా క్యారెట్ వంటి ఇతర వెజిటెబుల్స్ జత చేస్తే ఈ సూప్ మరింత పోషకమయం అవుతుంది. ఉప్పు, మిరియాల పొడి చల్లుకొని వేడిగా లేదా చల్లగా తీసుకోవచ్చు.

క్యారెట్ అల్లం సూప్

క్యారెట్ అల్లం సూప్ చాలా మందికి వింటర్ టైం ఫేవరెట్. కొన్ని క్యారెట్ ముక్కలు, అల్లం ముక్కలు ఉడికించుకొని ఆపై రసాన్ని ఫిల్టర్ చేసుకొని ఉప్పు, మిరియాల పొడి చల్లుకొని వేడిగా ఆస్వాదించవచ్చు.

టాపిక్

తదుపరి వ్యాసం