తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Lack Of Sleep : నిద్రలేమి వల్ల మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువ..

Lack of Sleep : నిద్రలేమి వల్ల మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువ..

01 September 2022, 8:27 IST

    • Lack of Sleep : నిద్ర లేకపోవడం వల్ల ఏకాగ్రత ఉండదు. మానసిక కల్లోలం, అంతేకాకుండా వివిధ ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉంటుంది. అయితే తాజా అధ్యయనం ప్రకారం తగినంత నిద్ర లేకపోవడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని తేలింది. మరి సరైన నిద్రకావాలంటే మనం ఎలాంటి జీవనశైలిని అలవాటు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నిద్రలేమి వల్ల కలిగే మరో దుష్ప్రయోజనం
నిద్రలేమి వల్ల కలిగే మరో దుష్ప్రయోజనం

నిద్రలేమి వల్ల కలిగే మరో దుష్ప్రయోజనం

Lack of Sleep : 24 గంటల వ్యవధిలో 7-9 గంటలు నిద్రపోవడం సోమరితనానికి సంకేతం కాదు. అది మీ శారీరక, మెంటల్​ హెల్త్​కి మీరు వెచ్చించే క్వాలిటీ సమయం. నిద్రలేమి వల్ల చాలా నష్టాలు ఉన్నాయని అందరికి తెలుసు. కానీ పబ్‌మెడ్ సెంట్రల్‌లో ప్రచురించిన తాజా అధ్యయనం ప్రకారం.. తగినంత నిద్ర లేకపోవడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని తేల్చింది. స్లీప్ అప్నియా వంటి నిద్ర రుగ్మతలు మధుమేహం ప్రమాదంతో సంబంధం కలిగి ఉన్నాయని తగిన ఆధారాలతో నిరూపించింది..

నిద్ర లేమి శరీరంలో జీవక్రియ మార్పులకు దారితీస్తుంది. ఫలితంగా మీ గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది. అది మధుమేహం వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. మీ నిద్రపై శ్రద్ధ వహించడం మరింత ముఖ్యమైనది ఎందుకంటే మీకు ఇప్పటికే చక్కెర వచ్చే అవకాశాలు ఎక్కువున్నాయి. మీ నిద్రపై మీరు శ్రద్ధ చూపకపోతే.. ఏ మందులు మీకు సహాయపడిని సైకాలజీ అండ్ వెల్‌బీయింగ్ విభాగాధిపతి నేహా వర్మ అన్నారు. మీ నిద్ర విధానాలను మెరుగుపరచడానికి, డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడానికి కొన్ని మార్గాలను సూచించారు.

నిద్రకు షెడ్యూల్

మీరు మీ నిద్ర సమయాన్ని సరిదిద్దుకోవాలి. మీరు పడుకునే సమయాన్ని, మీరు మేల్కొనే సమయాన్ని మీరే నిర్ణయించుకోవాలి. “మీకు నిద్ర రాకపోయినా.. ఆ సమయానికి మీరు పడుకోవాలి. మీరు ఎక్కువ నిద్రపోవాలనుకుంటున్నారా లేదా అనే దానిబట్టి మీరు లేచే సమయాన్ని ఫిక్స్ చేసుకోవాలి. ఇలా డైలీ చేస్తూ ఉంటే.. మీ మనస్సు కండిషన్ పొందుతుంది. కొన్ని రోజులకు సమాయానుగుణంగా మీకు నిద్ర రావడం మొదలవుతుంది.

ప్రశాంతమైన వాతావరణం

నిద్రపోయేటప్పుడు మీరు ఎంత హాయిగా ఉంటున్నారనేది చూసుకోవాలి. సౌకర్యవంతమైన పరుపులు, దిండ్లు ఎంచుకోవాలి. గది ఉష్ణోగ్రత మితంగా ఉండేలా చూసుకోవచ్చు. మంచి మెలోడీ సాంగ్స్ వినండి.

కాఫీ, టీలు తగ్గించండి

మీరు నిద్రలేమితో బాధపడుతున్నారంటే కెఫిన్ తీసుకోవడం తగ్గించాలి. అందుకే కాఫీ లేదా టీలు తగ్గించాలి. ఇలా చేస్తే అది మీ నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో చాలా వరకు సహాయపడుతుంది.

ఒత్తిడిని తగ్గించుకోండి

వ్యక్తిగత లేదా పని సంబంధిత ఒత్తిడికి గురవడం నిద్రలేని రాత్రులకు కారణం కావచ్చు. “మానసిక ఆరోగ్య నిపుణుడిని సంప్రదించడం వలన మీరు మీ మనస్సుపై ఒత్తిడి లేకుండా ఎలా చూసుకోవచ్చో.. నిద్రకు ముందు ఒత్తిడి లేకుండా ఎలా తగ్గించుకోవచ్చో చెప్తారు. ఈ కౌన్సిలింగ్ మీకు నిజంగా సహాయపడుతుంది." అని వర్మ చెప్పారు.

స్క్రీన్ సమయాన్ని తగ్గించండి

గాడ్జెట్‌ల అధిక వినియోగం, డిజిటల్ సమయం కూడా నిద్రలో పెద్ద పెద్ద అంతరాయాలను కలిగిస్తుంది. డిజిటల్ డిటాక్స్‌ అనేది అందరికీ అవసరమే. వాటిని ఎలాగో దూరం చేసుకోలేము కాబట్టి.. గ్యాప్ సమయం ఎక్కువ తీసుకోండి. అంటే ఎక్కువసేపు స్క్రీన్​ను చూడటం తగ్గించండి.

టాపిక్