Diabetes Diet : మధుమేహం ఉన్నా.. స్వీట్స్ పూర్తిగా మానేయనవసరం లేదంట..-myths and facts about diabetes and diet ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Myths And Facts About Diabetes And Diet

Diabetes Diet : మధుమేహం ఉన్నా.. స్వీట్స్ పూర్తిగా మానేయనవసరం లేదంట..

Geddam Vijaya Madhuri HT Telugu
Aug 09, 2022 01:04 PM IST

Diabetes Diet : డయాబెటిక్​తో బాధపడేవారి డైట్ సంక్లిష్టంగా ఉండవలసిన అవసరం లేదు. అదే సమయంలో మీకు ఇష్టమైన అన్ని ఆహారాలను మీరు వదులుకోవాల్సిన అవసరం లేదు. మధుమేహాన్ని నిరోధించడానికి లేదా నియంత్రించడానికి కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. వాస్తవాలు, అపోహల గురించి తెలుసుకుని.. మీ డైట్​ని రూపొందించుకోవచ్చు.

స్వీట్స్ పూర్తిగా మానేయాల్సిందేనా?
స్వీట్స్ పూర్తిగా మానేయాల్సిందేనా?

Diabetes Diet : డయాబెటిక్ ఉన్నవారు ఏదైనా తినడానికి చాలా ఆలోచిస్తారు. అంతేకాకుండా కొన్ని అపోహాలు వారిని కొన్ని ఆహారాలకు మరింత దూరం చేస్తాయి. దీనివల్ల వారు సరైనా ఆహారాన్ని తీసుకోరు. దీనివల్ల ఆకలితో ఇబ్బంది పడతారు. వీటిని అధిగమించడానికి మీ హెల్తీ ఆహారాన్ని తీసుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా అపోహాలు ఏంటో వాస్తవాలు ఏంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అపోహ: పూర్తిగా చక్కెరకు దూరంగా ఉండాలి.

వాస్తవం: సరిగ్గా ప్లాన్ చేస్తే స్వీట్ తినొచ్చు. కానీ వాటిని లిమిట్​గా తీసుకోవాలి. మీరు లిమిట్​గా తీసుకుంటే ఇష్టమైన వాటిని తిని ఆనందించవచ్చు. ఆరోగ్యకరమైన భోజనం మీ డైట్​లో భాగమైనంత వరకు.. మీరు లిమెట్​గా డెజర్ట్​ తీసుకోవచ్చు.

అపోహ: పిండి పదార్థాలను తగ్గించుకోవాలి.

వాస్తవం: మీరు తినే కార్బోహైడ్రేట్లు, వడ్డించే పరిమాణం కీలకం. పిండి పదార్ధాలకు బదులుగా తృణధాన్యాలలోని కార్బోహైడ్రేట్లపై దృష్టి పెట్టండి. ఎందుకంటే అవి ఫైబర్​ను అధికంగా కలిగి ఉంటాయి. ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.

అపోహ: డయాబెటిక్ ఉన్న ప్రత్యేక డైట్ చేయాలి.

వాస్తవం: ఆరోగ్యకరమైన ఆహార సూత్రాలు ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉంటాయి. మీరు డయాబెటిక్ అయినా కాకున్నా.. హెల్తీ ఆహారం తీసుకోండి. ఖరీదైన డయాబెటిక్ ఆహారాలు మీకు ప్రత్యేకమైన ప్రయోజనాన్ని అందించవు.

అపోహ: అధిక ప్రోటీన్ ఆహారం తీసుకోవడం ఉత్తమం.

వాస్తవం: ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం.. ముఖ్యంగా జంతు ప్రోటీన్, నిజానికి ఇన్సులిన్ నిరోధకతకు కారణం కావచ్చు. ఇది మధుమేహంలో కీలక కారకం. ఆరోగ్యకరమైన ఆహారంలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు ఉంటాయి. మన శరీరం సరిగ్గా పనిచేయడానికి ఈ మూడు చాలా అవసరం. కాబట్టి సమతుల్య ఆహారం తీసుకోవాలి.

కాబట్టి అపోహలను పక్కన పెట్టి.. వాస్తవాలతో హెల్తీ డైట్ మెయింటైన్​ చేయండి. మీ డైట్​లో ఎలాంటివి ఎక్కువ తీసుకోవాలి? ఏ ఆహారాన్ని దూరం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎక్కువగా ఇవి తినొచ్చు..

* గింజలు (నట్స్), ఆలివ్ నూనె, చేప నూనెలు, అవిసె గింజలు లేదా అవకాడోల నుంచి తీసిన ఆరోగ్యకరమైన కొవ్వులు.

* పండ్లు, కూరగాయలు తినాలి. ముఖ్యంగా తాజావి తీసుకుంటే మరింత మంచిది. జ్యూస్​ల కంటే పండు తినడం మంచిది.

* అధిక ఫైబర్ కలిగిన తృణధాన్యాలు, వాటితో తయారు చేసిన రోటీలు తీసుకోవచ్చు.

* చేపలు, షెల్ఫిష్, సేంద్రీయ చికెన్ లేదా టర్కీ.

* గుడ్లు, బీన్స్, తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు, తియ్యని పెరుగు వంటి అధిక-నాణ్యత కలిగిన ప్రోటీన్.

ఇవి తగ్గించాలి..

* ప్యాకేజ్డ్, ఫాస్ట్ ఫుడ్స్. ముఖ్యంగా చక్కెర అధికంగా ఉండేవి, కాల్చిన ఫుడ్, స్వీట్లు, చిప్స్, డెజర్ట్‌లు తగ్గించాలి.

* చక్కెర తృణధాన్యాలు, శుద్ధి చేసిన పాస్తాలు లేదా బియ్యం.

* ప్రాసెస్ చేసిన మాంసం, ఎర్ర మాంసం (రెడ్ మీట్).

* కొవ్వు రహిత పెరుగు వంటి తక్కువ కొవ్వు ఉత్పత్తులు.. చక్కెరతో నిండి ఉంటాయి.

WhatsApp channel

సంబంధిత కథనం