తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Snoring : ఈ అలవాట్లతో గురక తగ్గించుకోవచ్చు

Snoring : ఈ అలవాట్లతో గురక తగ్గించుకోవచ్చు

HT Telugu Desk HT Telugu

06 March 2023, 20:06 IST

    • Snoring Problem : ఎవరైనా నిద్రలో గురక పెడితే.. నరకంలాగా అనిపిస్తుంది. చాలామందికి గురక రావడం సాధారణం అయిపోయుంది. కానీ ఇతరులకు మాత్రం ఇబ్బందే. అందుకే జీవనశైలిలో మార్పులతో గురక సమస్యకు చెక్ పెట్టొచ్చు.
గురక సమస్య
గురక సమస్య (unsplash)

గురక సమస్య

గురక అనేది స్లీపింగ్ పార్ట్‌నర్‌కు అంతరాయం కలిగించే, నిరాశపరిచే సమస్య. ఇది నిద్ర నాణ్యతను ప్రభావితం చేస్తుంది. పగటిపూట అలసట, చిరాకు, ఆరోగ్య సమస్యలకు కూడా దారితీస్తుంది. జీవనశైలి(Lifestyle)లో మార్పులను పాటించి గురక(Snoring)ను తగ్గించుకోవాలి. లేకపోతే.. ఇది స్లీప్ అప్నియా వంటి మరింత తీవ్రమైన పరిస్థితికి సంకేతం కావచ్చు. స్లీప్ అప్నియా అనేది నిద్రలో శ్వాస తీసుకోవడంలో అంతరాయం ఏర్పడి గురక, ఊపిరి పీల్చుకోవడం, ఇతర లక్షణాలకు దారితీస్తుంది. అందుకే కొన్ని జీవనశైలి మార్పులను పాటించాలి.

బరువు కూడా గురకకు కారణం అవుతుంది. మెడ చుట్టూ కొంతమందికి బరువు ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇది శ్వాసనాళంపై ఒత్తిడి(Stress)ని కలిగిస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారం(Health Food), క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా బరువు తగ్గడం గురకను తగ్గించడంలో సహాయపడుతుంది. మీ నిద్రను మెరుగుపరుస్తుంది.

నిద్రవేళకు ముందు ఆల్కహాల్, మత్తుమందులను తీసుకోకండి. వాటితో కూడా గురక సమస్య వస్తుంది. ఈ పదార్థాలు గొంతులోని కండరాలను సడలించి, వాటిని కంపించేలా చేస్తాయి. ఇది గురకకు దారి తీస్తుంది. బదులుగా, హైడ్రేటెడ్ గా ఉండటానికి, గురక తగ్గించడానికి నిద్రవేళకు ముందు హెర్బల్ టీ(herbal tea) లేదా నీరు తాగడానికి ప్రయత్నించండి.

ప్రతిరోజూ ఒకే సమయంలో పడుకోవడం, మేల్కొనడం మీ నిద్ర(Sleep) చక్రాన్ని నియంత్రించడంలో, మీ నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. పడకగదిని చల్లగా, చీకటిగా, నిశ్శబ్దంగా ఉంచడం ద్వారా మంచి నిద్ర వాతావరణాన్ని సృష్టించుకోవచ్చు. నిద్ర నాణ్యతను మెరుగుపరచడంతోపాటుగా.. గురక(Snoring)ను తగ్గించడంలో సహాయపడుతుంది.

గురక అనేది సాధారణంగా తీవ్రమైన సమస్య కాదు. కానీ అది నిద్రకు భంగం కలిగిస్తుంది. పగటిపూట అలసట, చిరాకు కలిగిస్తుంది. కొన్ని సందర్భాల్లో, గురక అనేది స్లీప్ అప్నియా వంటి మరింత తీవ్రమైన పరిస్థితికి సంకేతం కావచ్చు. ఇది ఇలాగే వదిలేస్తే ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

వెల్లకిలా పడుకుంటే గురక వస్తుంది. అందుకని పక్కకు తిరిగి పడుకోండి. తల భాగం ఎత్తులో ఉండేలా చుసుకోవాలి. పడక గదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ముక్కు రంధ్రాలను తెరిచి ఉంచే పట్టీలు వేసుకోవాలి. యోగా, ప్రాణాయామం అలవాటు చేసుకోవాలి. శ్వాసపై నియంత్రణ పెరిగి.. గురక తగ్గుతుంది. గొంతు, నాలుకకు సంబంధించిన వ్యాయామాలు చేయాలి.

టాపిక్