Alcohol Benefits | కాస్త ఆల్కహాల్ మంచిదే అంటున్నారు నిపుణులు.. నిజమేనా?
ఆల్కహాల్. దీనిని తీసుకోకపోవడం మంచిదే కానీ. ఇక్కడే ఓ కొత్త విషయం దాగుంది. మద్యం తాగేవారికి గుండె ప్రమాదాలు ఎక్కువ వస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. కానీ మద్యం తాగనివారికి కూడా అంతే మొత్తంలో గుండె ప్రమాదాలు తప్పవు అంటున్నాయి అధ్యయనాలు. మరి ఎవరికి గుండెజబ్బులు రావంటున్నారో తెలిస్తే.. మీరు కూడా షాక్ అవ్వాల్సిందే.
తేలికపాటి ఆల్కహాల్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందని అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఆల్కహాల్ మిత వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలను వెల్లడిస్తున్నాయి. ఈ అధ్యయనంలో తేలిన ఫలితాలను 'జమ నెట్‌వర్క్ ఓపెన్'లో ప్రచురించారు. ఈ అధ్యయనంలో భాగంగా 3,71,463 మంది పెద్దలు పాల్గొన్నారు. సగటు వయస్సు 57 సంవత్సరాలు. సగటు మద్యపానం వారానికి 9.2 పానీయాలు. ఈ పరిశోధనలో మితంగా మద్యపానం చేసేవారికి అతి తక్కువ గుండె జబ్బులు ఉన్నాయని తేలింది. మద్యపానానికి దూరంగా ఉన్న వ్యక్తులు, అధికంగా మద్యం సేవించే వ్యక్తులకు గుండె ప్రమాదాలు ఎక్కువని తేల్చింది.
ట్రెండింగ్ వార్తలు
షాక్ అవ్వాల్సిందే..
ఏది ఏమయినప్పటికీ, తక్కువ నుంచి మితమైన మద్యపానం చేసేవారు.. ఎక్కువ శారీరక శ్రమ, కూరగాయలు తీసుకోవడం, ధూమపానం తక్కువ చేసే వారి కంటే ఆరోగ్యకరమైన జీవనశైలిని కలిగి ఉన్నారని బృందం కనుగొంది. శాస్త్రవేత్తలు అధ్యయనంలో పాల్గొనేవారి నుంచి తీసుకున్న నమూనాల జన్యు విశ్లేషణలను పరిశీలించారు. అధిక ఆల్కహాల్ వినియోగాన్ని అంచనా వేసే జన్యు వైవిధ్యాలు ఉన్న వ్యక్తులు వాస్తవానికి ఎక్కువ మొత్తంలో ఆల్కహాల్ తీసుకునే అవకాశం ఉందని.. రక్తపోటు, కరోనరీ ఆర్టరీ వ్యాధికి గురయ్యే అవకాశం ఉందని వారు కనుగొన్నారు.
ఈ విశ్లేషణలో పురుషులు, స్త్రీలలో మద్యపానం స్పెక్ట్రమ్‌లో హృదయనాళ ప్రమాదంలో గణనీయమైన వ్యత్యాసాలను గుర్తించారు. వారానికి సున్నా నుంచి ఏడు పానీయాలకు వెళ్లినప్పుడు తక్కువ ప్రమాదం ఉందని. వారానికి ఏడు నుంచి 14 డ్రింక్స్ (గ్లాసులవరకు) వరకు పురోగమిస్తున్నప్పుడు చాలా ఎక్కువ ప్రమాదం పెరుగుతుందని గుర్తించారు. వారానికి 21 లేదా అంతకంటే ఎక్కువ తీసుకున్నప్పుడు అధిక ప్రమాదంగా గుర్తించారు.
తక్కువ ప్రమాదం..
ముఖ్యంగా యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ జాతీయ మార్గదర్శకాల ప్రకారం (అనగా పురుషులకు రోజుకు రెండు పానీయాలు, మహిళలకు రోజుకు ఒక పానీయం) "తక్కువ ప్రమాదం"గా భావించే స్థాయిలలో కూడా హృదయనాళ ప్రమాదం పెరుగుతుందని పరిశోధనలు వెల్లడించాయి.
మాస్ జనరల్ బ్రిగమ్ బయోబ్యాంక్‌లో 30,716 మంది పాల్గొనగా.. రోజుకు ఒక ఆల్కహాల్ పానీయం తాగే వ్యక్తులకు ప్రయోజనం చేకూరుతున్నట్లు గుర్తించారు. ఎక్కువగా మద్యం సేవించే వారు... తగ్గించడం వల్ల కూడా ఆరోగ్యం మెరుగైనట్లు పరిశోధనల్లో తేలింది. "హృదయనాళ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఆల్కహాల్ తీసుకోవడం సిఫారసు చేయరాదని పరిశోధనలు ధృవీకరిస్తున్నాయి; బదులుగా, ఆల్కహాల్ తీసుకోవడం తగ్గించడం వల్ల ప్రతి ఒక్కరిలో హృదయనాళ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. " అని నిపుణులు వెల్లడించారు.
సంబంధిత కథనం
Alcohol | మద్యం సేవించేటపుడు ఇవి తింటున్నారా?
March 02 2022