Wednesday Motivation : మీ కష్టాలే చీకటి అనుకుంటే.. మీరు సూర్యుడిలా ఉదయించాలి..-wednesday motivation on the sun is a daily reminder that we too can rise again from the darkness ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Wednesday Motivation On The Sun Is A Daily Reminder That We Too Can Rise Again From The Darkness

Wednesday Motivation : మీ కష్టాలే చీకటి అనుకుంటే.. మీరు సూర్యుడిలా ఉదయించాలి..

Geddam Vijaya Madhuri HT Telugu
Aug 10, 2022 07:08 AM IST

Wednesday Motivation : జీవితంలో ఓ భరించలేని కష్టం వచ్చిందని.. లైఫ్ అక్కడితో ఆగిపోతుందా? లేదు. ఈ రోజు ఉన్న కష్టం రేపు ఉండకపోవచ్చు. మీరు ఆ కష్టాలను, ఇబ్బందులను ఇప్పుడు ఎదుర్కోలేకపోవచ్చు. కానీ ఏదొకరోజు.. మీరు వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు. ఎంత కటిక చీకటి అయినా వెళ్లిపోవాల్సిందే. మరుసటి ఉదయం వెళుతురు రావాల్సిందే.

కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

Wednesday Motivation : కొన్ని పరిస్థితుల్లో మనం ఎలా బౌన్స్ బ్యాక్ అవ్వాలో తెలియదు. ఆ సమయంలో చుట్టూ ఉన్న పరిస్థితులే మనల్ని ప్రభావితం చేస్తాయి. అందులో మన సూర్యుడు ఒకరు. ఎంత చీకటినైనా.. తన కాంతితో ప్రకాశింపజేయగల శక్తి సూర్యునికి ఉంది. మనం కూడా అంతే.. ఎంతటి కష్టాలనైనా ఎదుర్కొని.. ఆ చీకటిని చీల్చుకుంటూ.. మన ప్రకాశవంతమైన జీవితంతో ముందుకు దూసుకుపోవాలి.

మనం అలా ముందుకు సాగినప్పుడే మన జీవితంలోని ఆ చీకటి తొలగిపోతుంది. సాయంత్రానికి మళ్లీ చీకటి వస్తుంది కదా అనుకోవచ్చు. కానీ మళ్లీ సూర్యుడు ఉదయిస్తాడు అనే విషయాన్ని మనం మరచిపోకూడదు. ప్రతి రాత్రి ఓ కష్టంలా భావిస్తే.. ప్రతి ఉదయం ఓ ఆశనివ్వాలి. ప్రతిరోజు ఓ కొత్తసవాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దానిని మనం స్వీకరించి.. ఎదుర్కొంటున్నామనేదే మేటర్. కష్టాలను ఎదుర్కోవాలి కానీ.. వాటి ప్రతికూలంగా పరిగణించకూడదు. ఆ సమయంలో మనం సానుకూలంగా ఆలోచించడానికి ప్రయత్నించాలి.

ఎన్ని కష్టాలు మిమ్మల్ని చుట్టుముట్టినా.. ఎక్కడా ఎటువంటి హోప్​ కనిపించకపోయినా.. మీకు మీరే సహాయం చేసుకోగలరని గుర్తించుకోవాలి. చీకటిని చీల్చుకుంటూ.. మీ కాంతిని ప్రసరింపచేయాలి. రాత్రి పడుకునేముందు అలారమ్ పెట్టి ఎందుకు నిద్రలేస్తాము. ఈ చీకటి శాశ్వతం కాదు.. ఉదయం కచ్చితంగా అవుతుందనే కదా. అలాగే ప్రతిరోజు రాత్రి పడుకునేముందు.. ఈ కష్టాలు శాశ్వతం కాదు. ఎవ్రిథింగ్ విల్ బి ఓకే అనుకుని పడుకోండి. మీ మీద మీకు నమ్మకం ఉంటే.. ఎలాంటి కష్టాన్ని అయినా మీరు ధైర్యంగా ఎదుర్కొంటారు.

ఒక్కోసారి మీరు మీ మీద నమ్మకాన్ని కోల్పోతారు. అది మళ్లీ బిల్డ్ అవ్వడానికి సమయం పడుతుంది. ఆ నమ్మకాన్ని మీరే పెంచుకోవాలి. మిమ్మల్ని మీరే మోటీవేట్ చేసుకోవాలి. మీవల్ల అవుతుంది అనుకోవాలి. ఎప్పటికైనా మీరు అనుకున్నది సాధిస్తారని గుర్తించుకోవాలి. ఈ రోజు మీరు అనుకున్నది జరగలేదా? సరే రేపు మీ ముందు ఉంది కదా. ఈ రోజు కాకుంటే రేపు.. నేను కచ్చితంగా అనుకున్నది సాధిస్తా అనుకుంటే చాలు. పరిస్థితులు మీకు కచ్చితంగా అవకాశాన్ని ఇస్తాయి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్