Tips for Glowing Skin : క్రీములు రాస్తే సరిపోదు.. జీవనశైలిలో కొన్ని మార్పులు చేయాల్సిందే..
Tips for Glowing Skin : మీరు మీ చర్మాన్ని కాపాడుకోవాలన్నా.. మీ మెరుపును తిరిగి పొందాలన్నా చలికాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు స్కిన్ కేర్ నిపుణులు. చలికాలంలో చర్మం పట్ల ఎంత అశ్రద్ధ చూపిస్తే.. అంత చికాకులు, ఇబ్బందులు వస్తాయి అంటున్నారు నిపుణులు. దానికోసం కొన్ని పాటించాలని తెలిపారు. అవి ఏంటంటే..
Tips for Glowing Skin : చలికాలంలో చర్మాన్ని కాపాడుకోవడానికి.. రోజువారీ చర్మ సంరక్షణ చిట్కాలు పాటించాలి అంటున్నారు స్కిన్ కేర్ నిపుణులు. ఎందుకంటే చలికాలంలో ఉష్ణోగ్రతల ప్రభావంగా చాలా మంది చర్మ సమస్యలు ఎదుర్కొంటారు. సరైన గైడన్స్ లేక.. వారు సమస్యను మరింత పెంచుకుంటారు. అయితే కొన్ని నియమాలు పాటించడం వల్ల ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు అంటున్నారు.
చర్మం ఆరోగ్యంగా ఉండటానికి, తాజాగా, సహజంగా మెరుస్తూ కనిపించడానికి జీవనశైలిలో కొన్ని మార్పులు చేయాలి అంటున్నారు. అలాగే తీసుకునే ఆహారంలో కూడా కొన్ని తీసుకోవాలి అంటున్నారు. ఇవన్నీ చేస్తేనే.. చర్మం ఆరోగ్యంగా, మెరుస్తూ ఉంటుందని చెప్పారు. ఇంతకీ చలికాలంలో చర్మ సంరక్షణ కోసం పాటించాల్సిన రోటీన్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
గోరువెచ్చని నీరు..
చాలామంది చలికాలం రాగానే.. పొగలు పొగలు వచ్చే నీటితో స్నానం చేస్తూ ఉంటారు. ఇది మీ చర్మ సమస్యలను మరింత పెంచుతుంది. కాబట్టి మీ చర్మాన్ని కాపాడుకోవాలనుకుంటే వేడినీటిని వెంటనే ఆపేయండి. అలా అని చల్లని నీటితో స్నానం చేయాలని కాదు. బదులుగా స్నానానికి గోరువెచ్చని నీటిని ఉపయోగించండి. ఇది మీ చర్మాన్ని కాపాడటమే కాకుండా.. మీ సహజ చర్మపు నూనెలను తగిన విధంగా సమతుల్యం చేస్తుంది. స్నానం తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేయడం అస్సలు మరచిపోకండి.
మాయిశ్చరైజింగ్ క్లెన్సర్
చర్మానికి ఉపశమనం కలిగించాలంటే.. మాయిశ్చరైజింగ్ క్లెన్సర్ ఉపయోగించండి. లేకుంటే పొడి చర్మ సమస్యలు వస్తాయి. ఉష్ణోగ్రత తగ్గుదల.. మన చుట్టూ ఉన్న గాలిలో తేమ స్థాయిలను తగ్గిస్తుంది. దీనివల్ల మన చర్మం డ్రై అయిపోతుంది. అందుకే మాయిశ్చరైజింగ్ క్రీమ్ లేదా క్లెన్సర్‌ని ఉపయోగించడం వల్ల.. మీ చర్మం హైడ్రేట్‌గా ఉంటుంది.
హానికరమైన ప్రభావాల నుంచి చర్మాన్ని రక్షించడంలో మాయిశ్చరైజర్లు, క్లెన్సర్లు ముఖ్యపాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా.. డెడ్ స్కిన్ సెల్స్ క్లియర్ చేయడానికి కూడా సహాయపడతాయి.
హైడ్రేట్‌గా ఉండండి..
చలికాలంలో చల్లటి గాలులకు గురికావడం వల్ల చర్మం పొడిబారుతుంది. కాబట్టి తప్పకుండా మీ చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది. సో నీళ్లు తాగడం మరచిపోవద్దు. మీ చర్మ సంరక్షణకు హైలురోనిక్ యాసిడ్, రెటినోల్‌ను ఉపయోగించవచ్చు. ఇది మీ చర్మాన్ని తాజాగా, మృదువుగా చేయడానికి గొప్పగా పనిచేస్తుంది. UV కిరణాల ద్వారా నష్టాన్ని నివారించడానికి.. మంచి SPFతో ఉన్నవాటిని ఎంచుకోండి.
ఆహారం పట్ల శ్రద్ధ తీసుకోండి..
ఈ సీజన్లో దొరికే పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోండి. బెర్రీలు విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లకు మంచి మూలం. చల్లని వాతావరణంలో మీ చర్మం ఆరోగ్యంగా ఉండటానికి ఇవి చాలా అవసరం.
స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్, ద్రాక్షపండ్లు లేదా చెర్రీస్. ఇలా మీరు ఇష్టపడే ఏదైనా ఎంచుకోండి. ఇది మీ నీరు తీసుకోవడం వల్ల కలిగే లోపాన్ని కూడా కవర్ చేస్తుంది. అంతేకాకుండా ఇవి మీ చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.
వ్యాయామం చేయాల్సిందే..
శీతాకాలంలో ఉదయాన్నే లేవాలంటే అస్సలు మనసు ఒప్పుకోదు. ఇంక లేచి.. వ్యాయామం చేయాలంటే బద్ధకం ఆపేస్తుంది. అయినా సరే మీరు వ్యాయామాన్ని వదలకూడదు. ఎందుకంటే ఇది మీరు వెచ్చగా ఉండేలా సహాయం చేస్తుంది. అంతేకాకుండా నిద్రమత్తును పోగొట్టి.. మీలో చురుకుదనాన్ని నింపుతుంది.
అంతేకాకుండా వ్యాయామం చేయడం వల్ల మీ హృదయ స్పందన రేటు పెరుగుతుంది. ఇది మీ అన్ని అవయవాలకు ఎక్కువ రక్తాన్ని పంపుతుంది. తద్వారా మీరు ఎల్లప్పుడూ కోరుకునే చర్మపు మెరుపును పొందవచ్చు.
సంబంధిత కథనం