Raisins Benefits : ఎండు ద్రాక్షలతో ఎనలేని ప్రయోజనాలు.. ఎలా తీసుకోవాలంటే..
Raisins Benefits : చాలామంది స్వీట్స్‌లో, పాయసంలో ఎండుద్రాక్ష వస్తే.. వాటిని తీసి మరి తింటారు. కానీ వాటి వల్ల కలిగే లాభాలు తెలిస్తే.. మీరే వాటిని అడిగి మరీ తింటారు. ఈ ఎండుద్రాక్షలు పూర్తిగా పోషకాలతో నిండి ఉంటాయి. ఇంతకీ వాటి వల్ల కలిగే లాభాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Raisins Benefits : ఎండు ద్రాక్షలలో ఐరన్, బోరాన్, కాల్షియం, యాంటీమైక్రోబయల్ వంటి సమ్మేళనాలు, యాంటీఆక్సిడెంట్లతో పూర్తిగా నిండి ఉన్నాయి. అయితే ఎండుద్రాక్ష వల్ల చాలా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే వాటిని ముందురోజు నానబెట్టి ఉదయాన్నే తింటే మీరు మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. మరి వాటి వల్ల కలిగే బెనిఫిట్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మెరుగైన నిద్రకోసం..
నిద్ర లేమి మీ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఎండుద్రాక్ష నిద్రలేమికి చికిత్స చేస్తుంది. వాటిలో ఐరన్ ఉంటుంది. దీని వల్ల మీరు బాగా నిద్రపోవచ్చు. ఈ పోషకం శరీరంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తిని పెంచుతుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఇది మీ సిస్టమ్‌కు ఆక్సిజన్‌ను చేరవేస్తుంది. మంచి నిద్రను ఇస్తుంది. అదనంగా వాటిలో మెలటోనిన్ అనే హార్మోన్ ఉంటుంది. ఇది నిద్ర-మేల్కొనే చక్రాన్ని నియంత్రిస్తుంది.
రోగనిరోధక శక్తికై..
విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ వంటి అవసరమైన పోషకాలతో ఎండుద్రాక్ష నిండి ఉంటుంది. అవి వివిధ ఇన్ఫెక్షన్‌లను తగ్గించడంలో సహాయపడుతాయి. యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలతో నిండి ఉంటాయి. ఇది మీ సిస్టమ్‌లోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయం చేస్తుంది. అవి మీ కణాలకు ఆక్సీకరణ నష్టం కలిగించకుండా వాటిని స్థిరీకరిస్తాయి. అంతే కాకుండా.. ఎండుద్రాక్ష రోగనిరోధక వ్యవస్థను, తెల్ల రక్త కణాలను కూడా రక్షిస్తుంది.
ఆరోగ్యకరమైన చర్మానికై..
తక్కువ కొవ్వుతో ఎండిన ద్రాక్షలు.. మీ చర్మం ఆరోగ్యానికి గొప్పవి. ఎందుకంటే అవి కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. అంతేకాకుండా ఎండుద్రాక్షలో ఫినాల్ అనే యాంటీఆక్సిడెంట్ నిండి ఉంటుంది. ఇది చర్మం కొల్లాజెన్, కణాలు, ఎలాస్టిన్‌ను దెబ్బతీయకుండా ఫ్రీ రాడికల్స్‌ను నిరోధిస్తుంది. అవి మచ్చలు, చక్కటి గీతలు, ముడతలు వంటి వృద్ధాప్య సంకేతాలను కూడా ఆలస్యం చేస్తాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు మీ చర్మాన్ని బొద్దుగా చేసి పునరుజ్జీవింపజేస్తాయి.
జుట్టు ఆరోగ్యానికై..
విటమిన్ బి, పొటాషియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి జుట్టుకు అనుకూలమైన పోషకాలతో నిండిన ఎండుద్రాక్షలు.. మీ జుట్టును కండిషన్ చేస్తుంది. ఆరోగ్యంగా, బలంగా మారుస్తుంది. వీటిలోని ఐరన్ శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. మీ జుట్టు కుదుళ్లను ఉత్తేజపరుస్తుంది. అయితే వాటిలోని విటమిన్ సి మీ జుట్టుకు తేమను అందించి.. సహజ రంగును కాపాడుతుంది. అలాగే ఎండుద్రాక్ష చుండ్రు, దురద, పొట్టును తగ్గిస్తుంది.
దంతాలకు మంచిది..
ఎండుద్రాక్షలో ఒలియానోలిక్ అనే ఫైటోకెమికల్ ఉంటుంది. ఇది మీ దంతాలను కుళ్లిపోకుండా కాపాడుతుంది. వాటిని బలంగా చేస్తుంది. అవి మీ దంతాలను కావిటీస్, పెళుసుగా రాకుండా కూడా రక్షిస్తుంది. ఇవి నోటిలో బ్యాక్టీరియాను వృద్ధి కాకుండా నిరోధిస్తాయి. దంతాలను సరైన ఆకృతిలో ఉంచుతాయి. వీటిలో ఉండే కాల్షియం దంతాలు విరగకుండా చేస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్