Foods to Increase Hemoglobin : హిమోగ్లోబిన్ ఇలా పెంచుకోండి.. విటమిన్ సి కచ్చితంగా తీసుకోండి..-
Telugu News  /  Lifestyle  /  Foods To Increase Hemoglobin Levels Naturally
హిమోగ్లోబిన్ ఇలా పెంచుకోండి..
హిమోగ్లోబిన్ ఇలా పెంచుకోండి..

Foods to Increase Hemoglobin : హిమోగ్లోబిన్ ఇలా పెంచుకోండి.. విటమిన్ సి కచ్చితంగా తీసుకోండి..

06 October 2022, 14:20 ISTGeddam Vijaya Madhuri
06 October 2022, 14:20 IST

Foods to Increase Hemoglobin : అమ్మాయిలు హిమోగ్లోబిన్ సరైన స్థాయిలో లేక చాలా ఇబ్బందులు పడుతుంటారు. ముఖ్యంగా గర్భిణీలు ఈ సమస్యను ఫేస్ చేస్తూ ఉంటారు. అయితే సహజంగా హిమోగ్లోబిన్ స్థాయిలను ఎలా పెంచుకోవాలో.. ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Foods to Increase Hemoglobin : ఎర్ర రక్త కణాలు శరీరంలో ఆక్సిజన్‌ను తీసుకువెళ్లడానికి బాధ్యత వహిస్తాయి. కణాల నుంచి కార్బన్ డయాక్సైడ్‌ను విడుదల చేయడానికి ఊపిరితిత్తులకు తీసుకువెళతాయి. హిమోగ్లోబిన్ ఎర్ర రక్త కణాలలో కనిపించే ప్రోటీన్. ఈ ప్రక్రియ సరిగ్గా పనిచేయడానికి ఇది చాలా అవసరం. మీకు తక్కువ స్థాయిలో హిమోగ్లోబిన్ ఉంటే.. ఇది శరీరంలో ఆక్సిజన్‌ను తరలించే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. చాలా మంది మహిళలు బ్లెడ్ లేక, హిమోగ్లోబిన్ సరైన స్థాయిలో లేక ఇబ్బందులు పడుతుంటారు. కొన్ని ఆహారాలు సహజంగా హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతాయి అంటున్నారు నిపుణులు.

ఐరన్ ఎక్కువగా తీసుకోోండి..

మీరు ఐరన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ ఉత్పత్తి పెరుగుతుంది. మరిన్ని ఎర్ర రక్త కణాలు ఏర్పడతాయి.

ఇనుము ఎక్కువగా ఉండే ఆహారాలు ఇవే..

* కాయగూరలు

* బీట్‌రూట్

* గుడ్లు

* ఖర్జూరం, అత్తి పండ్లు లేదా ఎండుద్రాక్ష వంటి ఎండిన పండ్లు

* మాంసం, చేపలు (ప్రాసెస్ చేసిన మాంసాలు తినొద్దు)

* బ్రోకలీ, ఆస్పరాగస్, గ్రీన్ బీన్స్ వంటి కూరగాయలు

* నువ్వులు, జీడిపప్పు

* టోఫు వంటి సోయా ఆధారిత ఉత్పత్తులు

* పీనట్ బటర్

* ఎరుపు, పసుపు బెల్ పెప్పర్స్

* తృణధాన్యాలు, రొట్టె, పాస్తా లేదా బియ్యం, పులియబెట్టిన ఆహారాలు వంటి ఐరన్-ఫోర్టిఫైడ్ ఉత్పత్తులు

ఫోలేట్ తీసుకోండి..

ఫోలేట్ ఫోలిక్ యాసిడ్ శరీరంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తుంది. ఫోలేట్ అనేది విటమిన్ B9 సహజ రూపం. హీమ్‌ను ఉత్పత్తి చేయడానికి శరీరం దీనిని ఉపయోగించుకుంటుంది. ఇది ఆక్సిజన్‌ను తీసుకువెళ్లడానికి సహాయపడుతుంది. తగినంత ఫోలేట్ తీసుకోకపోవడం వల్ల తక్కువ హిమోగ్లోబిన్ స్థాయిలు, ఫోలేట్ లోపం అనీమియా కూడా ఏర్పడవచ్చు.

ఈ ఆహారాలలో సహజంగా ఫోలేట్ అధికంగా ఉంటుంది

* గ్రీన్స్, రోమైన్ లెట్యూస్, ఆస్పరాగస్, బ్రస్సెల్ మొలకలు వంటి ఆకుకూరలు

* బీన్స్

* వేరుశెనగ

* పొద్దుతిరుగుడు విత్తనాలు

* అరటి వంటి తాజా పండ్లు

* బియ్యం, గోధుమపిండి వంటి తృణధాన్యాలు

* చికెన్ కాలేయం

* సీ ఫుడ్

* అవోకాడోలు, బీట్‌రూట్

విటమిన్ సి తీసుకోవాలి.. ఎందుకంటే

ఐరన్ స్థాయిలను పెంచడానికి కేవలం ఐరన్ అధికంగా ఉండే ఆహారాన్ని సొంతంగా తీసుకోవడం సరిపోకపోవచ్చు. ఇనుమును గ్రహించడానికి మీ శరీరానికి సహాయం కావాలి. విటమిన్ సి, బీటా కెరోటిన్ అధికంగా ఉన్న ఆహారాలు.. మీ శరీరాన్ని ఇనుమును సరిగ్గా గ్రహించడంలో సహాయపడతాయి. కాబట్టి గరిష్ట శోషణ కోసం ఐరన్‌తో పాటు విటమిన్ సి తీసుకోవడం ఉత్తమం.

విటమిన్ సి ఉండే ఆహారాలు

* ఆకు కూరలు

* చిలగడదుంపలు

* చేప

* నిమ్మకాయలు, నారింజలు, ద్రాక్షపండు వంటి సిట్రస్ పండ్లు

* బెర్రీలు

* బొప్పాయి

* బెల్ పెప్పర్స్

* బ్రోకలీ, టమోటాలు

* క్యారెట్లు

సంబంధిత కథనం

టాపిక్