Skin Detox Remedies : మీ చర్మం మళ్లీ మెరిసిపోవాలంటే.. ఇలా డిటాక్స్ చేసేయండి..-post festive detox foods to regain healthy skin here is the details ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Skin Detox Remedies : మీ చర్మం మళ్లీ మెరిసిపోవాలంటే.. ఇలా డిటాక్స్ చేసేయండి..

Skin Detox Remedies : మీ చర్మం మళ్లీ మెరిసిపోవాలంటే.. ఇలా డిటాక్స్ చేసేయండి..

Geddam Vijaya Madhuri HT Telugu
Nov 01, 2022 12:13 PM IST

Skin Detox Remedies : పండుగలకు అందంగా కనిపించాలని రెడీ అవుతాము. కానీ మేకప్​ల వల్ల, లైటింగ్స్ వల్ల.. స్కిన్ డ్యామేజ్ అవుతుంది. అంతేకాకుండా ఫుడ్ ఎఫెక్ట్ కూడా చర్మంపై పడుతుంది. దానివల్ల ముఖంలోని గ్లో మిస్ అవుతుంది. అయితే పండుగ తర్వాత మీ చర్మాన్ని సహజంగా ఎలా డిటాక్స్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

స్కిన్ డిటాక్స్ ఫుడ్స్
స్కిన్ డిటాక్స్ ఫుడ్స్

Skin Detox Remedies : రుచికరమైన ఆహారం లేకుండా ఏ పండుగైనా అసంపూర్ణమే. ఆ సమయంలో మన ఆహార ప్రణాళికలు, ఆరోగ్యకరమైన డైట్​ను కాస్త పక్కన పెట్టేస్తాము. అంతేకాకుండా అందంగా కనిపించేందుకు మేకప్​ కూడా గట్టిగానే ఉపయోగిస్తాము. లైట్స్, టపాసుల కాలుష్యం వల్ల చర్మ సమస్యలు వస్తాయి. హైడ్రేషన్ లేకపోవడం చర్మంపై తీవ్రంగా ప్రభావం చూపుతుంది. అయితే సరైన చర్మ సంరక్షణ దినచర్యను అనుసరించడం వల్ల.. చర్మానికి మెరుపును అందించవచ్చు. అయితే దానికన్నా ముందు.. చర్మాన్ని డిటాక్స్ చేయడం ముఖ్యం. డెడ్ స్కిన్ తొలగిస్తేనే మీ చర్మం ప్రకాశవతంగా మెరుస్తుంది. అయితే ఆరోగ్యమైన చర్మం పొందడానికి కొన్ని డిటాక్స్ ఫుడ్స్ ఇక్కడున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కూరగాయల రసాలు/స్మూతీలు

కూరగాయల, పండ్ల రసాలు లేదా స్మూతీలు మీ చర్మం సమతుల్యతను పునరుద్ధరించడంలో, శరీరానికి పోషకాలను అందించడంలో గొప్పగా సహాయపడతాయి. అంతేకాకుండా చిరుతిళ్లు తినకుండా ఉండేందుకు ఇవి బాగా హెల్ప్ చేస్తాయి. అయితే స్కిన్ డిటాక్స్ కోసం.. మీరు ఆరెంజ్ జ్యూస్, దానిమ్మ రసం లేదా దోసకాయ, బీట్‌రూట్, అరటిపండ్లతో చేసిన స్మూతీలు తీసుకోవచ్చు. ఇవి రుచిగాను ఉంటాయి. పైగా మీ చర్మానికి ఆరోగ్యకరమైన మెరుపుని ఇస్తాయి. తాజాగా తయారు చేసినవి జ్యూస్​లు అయితే మంచి ఫలితాలు ఉంటాయి.

పచ్చని ఆకు కూరలు

ఆకుపచ్చని కూరగాయలు చర్మానికి అద్భుతమైనవి. విటమిన్ ఎ, జింక్, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి అన్ని అవసరమైన పోషకాలు వీటిలో సమృద్ధిగా ఉంటాయి. లోపల నుంచి శరీరాన్ని, స్కిన్​ను శుభ్రపరచడంలో ఇవి ముఖ్యపాత్ర పోషిస్తాయి. బచ్చలికూర, బ్రోకలీ, పచ్చి ఉల్లిపాయలు, సెలెరీ, కీరదోస వంటి పచ్చని ఆకు కూరలు మీ చర్మాన్ని డిటాక్స్ చేసి.. నిగనిగలాడే మెరుపునిస్తాయి. వీటిని సలాడ్ లేదా కూర రూపంలో తీసుకోవచ్చు.

డ్రై ఫ్రూట్స్, నట్స్

ఎండుద్రాక్ష, ఖర్జూరాలు, బాదం, వాల్‌నట్‌లు, జీడిపప్పు వంటి డ్రై ఫ్రూట్స్ చాలా ఆరోగ్యకరమైనవి. విటమిన్లు, మినరల్స్​కు ఇవి గొప్ప వనరులు. ఈ డ్రై ఫ్రూట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్, పర్యావరణ హాని నుంచి రక్షిస్తాయి. ఇవి కొల్లాజెన్‌ను పెంచడంలో, చర్మానికి మెరుపును అందించడంలో సహాయం చేస్తాయి.

అల్లం, నిమ్మరసం

ఇవి శరీరాన్ని నిర్విషీకరణ చేసి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో చాలా బాగా సహాయం చేస్తాయి. అజీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి. అల్లం యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. ఇది చర్మంలో రక్త ప్రసరణను పెంచుతుంది. ఫలితంగా ఆరోగ్యకరమైన, మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది. కాబట్టి మీ ఉదయాన్ని ఈ డిటాక్స్ డ్రింక్‌తో ప్రారంభించండి. నీటిలో అల్లం వేసి మరిగించండి. దానిని వడపోసి.. దానిలో కాస్త నిమ్మరసం కలిపి తాగండి.

విటమిన్ సి

మీ డిటాక్స్ డైట్‌లో విటమిన్ సి కలిగి ఉన్న పండ్లను తీసుకుంటే ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందవచ్చు. నారింజ, ఆపిల్, పుచ్చకాయలు, స్ట్రాబెర్రీ వంటి పండ్లు శరీరాన్ని హైడ్రేట్, చర్మాన్ని మృదువుగా చేయడానికి సహాయపడతాయి. ఈ పండ్లలో డైటరీ ఫైబర్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మం దెబ్బతినకుండా కాపాడతాయి.

ఈ అద్భుతమైన స్కిన్ డిటాక్స్ ఫుడ్స్‌ని మీ డైట్‌లో చేర్చుకుని.. మెరిసే చర్మాన్ని పొందండి.

WhatsApp channel

సంబంధిత కథనం