Dry Hair to Healthy Hair : మీ జుట్టు పొడిగా, చిట్లిపోకుండా ఉండాలంటే.. కండీషనర్ ఇలా అప్లై చేయండి..-user right conditioner in right way to reduce dry hair to healthy hair in winter ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  User Right Conditioner In Right Way To Reduce Dry Hair To Healthy Hair In Winter

Dry Hair to Healthy Hair : మీ జుట్టు పొడిగా, చిట్లిపోకుండా ఉండాలంటే.. కండీషనర్ ఇలా అప్లై చేయండి..

Geddam Vijaya Madhuri HT Telugu
Nov 10, 2022 01:13 PM IST

Dry Hair to Healthy Hair : చలికాలంలో జుట్టు చాలా పొడిగా మారిపోతుంది. పొడి జుట్టు చుండ్రు సమస్యలను, జుట్టు రాలడాన్ని పెంచుతుంది. పైగా హెయిర్ దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. ఈ సమయంలో జుట్టు గడ్డిలా మారకుండా ఉండాలంటే.. మీరు కండీషనర్‌ను ఉపయోగించాల్సిందే. దీనిని సరైన పద్ధతిలో ఉపయోగించకుంటే.. సమస్య పరిష్కారం కాదు.

హెయిర్ కండీషనర్
హెయిర్ కండీషనర్

Dry Hair to Healthy Hair : చాలామంది షాంపూ మీద చూపించినంత శ్రద్ధ.. కండీషనర్ ఉపయోగించడం మీద చూపించరు. తద్వారా జుట్టు గడ్డిలా, పొడిగా తయారై దెబ్బతింటుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి కండీషనర్ ఉపయోగించాల్సిందే అంటున్నారు నిపుణులు. షాంపూతో తలస్నానం చేసిన తర్వాత అసలు కండీషనర్ ఎందుకు పెట్టాలి.. ఏవిధంగా దానిని అప్లై చేయాలో వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

హెయిర్ కండీషనర్ అనేది ఒక రకమైన కాస్మెటిక్ ఉత్పత్తి. ఇది మీ జుట్టుకు మృదువైన, చక్కటి ఆకృతి ఇస్తుంది. ఇది పొడిబారడాన్ని తగ్గిస్తుంది. జుట్టు రూపాన్ని మెరుగుపరుస్తుంది. జుట్టు పొడిబారడం, చిట్లిపోవడం వంటి సమస్యలు పోరాడేలా చేస్తుంది. సాధారణంగా మన స్కాల్ప్ సెబమ్ అని పిలిచే సహజ కండీషనర్‌ను ఉత్పత్తి చేస్తుంది. కానీ షాంపూలో కొన్ని కఠినమైన రసాయనాలు.. మన జుట్టులోని సహజ నూనెలను తొలగిస్తాయి. అందువల్ల షాంపూ చేసిన తర్వాత కండీషనర్ తప్పకుండా అప్లై చేయాలి.

సహజమైనవి..

మీ జుట్టుకు నూనె రాయడం లేదా అరటిపండు, తేనె, పెరుగు మొదలైన వాటితో చేసిన హెయిర్ మాస్క్‌లను అప్లై చేయడం వంటి కొన్ని సహజ పద్ధతులు కూడా మీ జుట్టును కండిషన్ చేయడంలో సహాయపడతాయి. కాబట్టి సహజంగా చేసినా, కాస్మోటిక్స్ అప్లై చేసినా.. అది మీ జుట్టును కండీషనింగ్ చేయడంలో ఒక ముఖ్యమైన దశ. దీనిని పొందడం చాలా ముఖ్యం. కండీషనర్‌ను సరైన మార్గంలో ఎలా అప్లై చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కండీషనర్ ఎలా అప్లై చేయాలి?

* మీరు షాంపూతో మీ జుట్టును బాగా కడిగిన తర్వాత.. మీ జుట్టు నుంచి అదనపు నీటిని పిండి వేయాలి. దీని కోసం మీరు టవల్‌ను కూడా ఉపయోగించవచ్చు.

* మీరు అదనపు నీటిని బయటకు తీసిన తర్వాత.. కొంచెం కండీషనర్ తీసుకొని మీ జుట్టు పొడవునకు అప్లై చేయండి.

* కండీషనర్‌ను మీ స్కాల్ప్​పై ఉపయోగించకండి.

* మీరు కండీషనర్‌ను అప్లై చేసిన తర్వాత.. దానిని 2-3 నిమిషాలు వదిలివేయాలి. ఈ సమయంలో మీరు మీ జుట్టుకు కండీషనర్‌ను సమానంగా వ్యాప్తి చేయడానికి దువ్వెనను కూడా ఉపయోగించవచ్చు.

* అనంతరం మీ జుట్టు నుంచి కండీషనర్‌ను శుభ్రం చేయండి.

WhatsApp channel

సంబంధిత కథనం