అరటిపండు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు సూచిస్తుంటారు. బరువు పెరగాలనుకునే వారు తరచుగా పాలు, అరటిపండ్లను తినడం మంచిదని సలహా ఇస్తున్నారు. బరువు తగ్గడంలో అరటిపండు కూడా ఉపయోగపడుతుందని డైటీషియన్లు చెబుతున్నారు. ఈ పండులో ఫైబర్, విటమిన్ బి6, విటమిన్ సి, మాంగనీస్, బయోటిన్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాల కారణంగా, పొట్ట చాలా సమయం పాటు నిండుగా ఉంటుంది, ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అరటిపండు సంబంధించి ఆరోగ్య నిపుణులు చెబుతున్న మరిన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బరువు తగ్గాలనుకునే వారు తరచుగా అరటిపండు తినాలా? వద్దా? అనే మీమాంసలో ఉంటారు. నిజానికి అరటిపండు బరువు తగ్గడానికి ప్రభావవంతంగా పరిగణించబడుతుంది. బరువు తగ్గడంలో అరటిపండ్లు కూడా సహకరిస్తాయని పోషక నిపుణులు అంటున్నారు.
అరటిపండు బరువును ఎలా తగ్గిస్తుంది?
అరటిపండులో అధిక మొత్తంలో కేలరీలు ఉంటాయి. ఈ కేలరీలు చాలా కాలం పాటు శరీరానికి శక్తిని ఇవ్వడానికి పని చేస్తాయి. అదే సమయంలో, అరటిపండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, దీని వల్ల కడుపు నిండుగా ఉంటుంది, అలాగే జీవక్రియను మెరుగుపరుస్తుంది, దీంతో బరువు నియంత్రణలో ఉంటుంది.
పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఫోలేట్ అరటి పండులో పుష్కలంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అరటిపండులో ఉండే ఈ పోషకాలన్నీ శరీరానికి శక్తిని ఇస్తాయి, వ్యాయామం చేసి అలసిపోయినప్పుడు అరటి పండు తినడం వల్ల తక్షణ శక్తిని పొందవచ్చు. అరటిపండులో ఫైబర్, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండడం వల్ల శరీరాన్ని ఎక్కువ కాలం శక్తివంతంగా ఉంచుతాయి. అలాగే దీని వల్ల ఎక్కువ కేలరీలను బర్న్ చేయవచచ్చు. దీనితో పాటు, ఇవి రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడతాయి. అందువల్ల, బరువు తగ్గాలనుకునే వారు అరటిపండ్లను తినడం మంచి అలవాటు.
సంబంధిత కథనం