Period Myths : పీరియడ్స్ సమయంలో తలస్నానం చేస్తే ప్రెగ్నెంట్ అవ్వరంటా.. నిజమేనా?-period myths on headbath during in periods ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Period Myths : పీరియడ్స్ సమయంలో తలస్నానం చేస్తే ప్రెగ్నెంట్ అవ్వరంటా.. నిజమేనా?

Period Myths : పీరియడ్స్ సమయంలో తలస్నానం చేస్తే ప్రెగ్నెంట్ అవ్వరంటా.. నిజమేనా?

Period Myths : కొన్ని అపోహలు ఎలా ఉంటాయంటే చాలా నవ్వు తెప్పిస్తాయి. కానీ వాటిని చాలా మంది నిజమనుకుని నమ్మేస్తారు. అయితే పీరియడ్స్ సమయంలో ఇవి చేస్తే మంచిది కాదు అని చెప్పే కొన్ని అపోహలను కొట్టి పరేశారు డాక్టర్ తనయ నరేంద్ర. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పీరియడ్స్​లో తలస్నానం చేస్తే మంచిదా? కాదా?

Period Myths : మీ ఇంట్లో అమ్మమ్మలు, నాన్నమ్మలు ఉంటే వాళ్లు మీ పీరియడ్స్ సమయంలో అలా చేయకు, ఇలా ఉండకు అంటూ ఎన్నో కండీషన్స్ పెట్టే ఉంటారు. పీరియడ్స్ సమయంలో తలస్నానం చేస్తే.. పిల్లలు పుట్టరంటా అనే ఒక అపోహ కూడా ఉంది. మరి దీని గురించి నిజనిజాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

పీరియడ్స్ సమయంలో చాలా మంది తలస్నానం చేస్తాము. చేయడం మంచిది కూడా. పైగా ఆ సమయంలో వేడి నీటితో తలస్నానం చేస్తే చాలా హాయిగా ఉంటుంది. పీరియడ్ నొప్పి నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. అయితే ఈ విషయంపై తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ డాక్టర్ క్యూటెరస్ ద్వారా ప్రసిద్ధి చెందిన డాక్టర్ తనయ నరేంద్ర స్పందించారు. ఆమె ఏమి చెప్పారంటే“నో.. ఈ అపోహను అస్సలు నమ్మవద్దు. మీరు హ్యాపీగా మీ జుట్టును పీరియడ్స్‌లో చాలా సార్లు.. మీకు నచ్చిన విధంగా ఎన్నిసార్లైనా కడగవచ్చు. ఇది కేవలం అపోహ మాత్రమే.

మరి ఈ అపోహ ఎందుకు వచ్చిందంటే.. మీరు మీ జుట్టును రుతుక్రమంలో కడుక్కుంటే.. మీ తల మొత్తం నీటిని పీల్చుకుంటుంది. అది మీ గర్భాశయంలోకి చల్లదనాన్ని పెంచుతుంది. దీనివల్ల భవిష్యత్తులో పిల్లలు పుట్టలేరు అని భావిస్తారు. అయితే తల ఏమైనా స్పాంజ్​ అనుకుంటున్నారేమో.. అది నీటిని ఎలా పీల్చుకుంటుంది." అని చమత్కరించింది.

"తలపై చర్మం, నుంచి మీ శరీరం అంతటా ఉన్న చర్మం నిజానికి జలనిరోధితం. కాబట్టి అది ఆ నీటిని పీల్చుకోదు. కాబట్టి మీ పీరియడ్స్ సమయంలో వ్యక్తిగత అలవాట్లలో మీరు రాజీ పడాల్సిన అవసరం లేదు" అని ఆమె స్పష్టం చేసింది.

అంతేకాకుండా కొంతమంది మహిళలు తమ పీరియడ్స్ సమయంలో జుట్టును కడగడం వల్ల జుట్టు రాలిపోతుందని భావిస్తారు. అయితే అది అపోహేనని తనయ వెల్లడించారు. నిజానికి గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల తిమ్మిరి తగ్గుతుందని, మంచి అనుభూతి కలుగుతుందని ఆమె తెలిపింది.

సంబంధిత కథనం