Breakfast | ఎనర్జీ కావాలన్నా.. హైడ్రేట్​గా ఉండాలన్నా.. ఈ స్మూతీ పర్​ఫెక్ట్ -today breakfast is energetic smoothie for summer recipe is here ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Today Breakfast Is Energetic Smoothie For Summer Recipe Is Here

Breakfast | ఎనర్జీ కావాలన్నా.. హైడ్రేట్​గా ఉండాలన్నా.. ఈ స్మూతీ పర్​ఫెక్ట్

HT Telugu Desk HT Telugu
May 31, 2022 07:07 AM IST

మీలో శక్తి తక్కువ ఉందా? ఇన్​స్టాంట్ ఎనర్జీ కావాలా? అయితే ఈ స్మూతీ ట్రై చేయాల్సిందే. ఈ పవర్​ఫుల్ స్మూతీలో ప్రోటీన్, ఫైబర్, హెల్తీ కొవ్వులు, మంచి కార్బ్స్.. ఉంటాయి. హెల్తీ బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. దానిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ​

హెల్తీ స్మూతీ
హెల్తీ స్మూతీ

Breakfast Dairies | మార్నింగ్ బ్రేక్​ఫాస్ట్ స్మూతీ అయితే.. అది మిమ్మల్ని రోజంతా ఎనర్జిటిక్​గా ఉంచితే.. పైగా వేసవిలో మిమ్మల్ని హైడ్రేట్​గా ఉంచితే.. అలాంటి దానిని ఎవరూ కాదనలేరు. అలాంటి స్మూతీ గురించే ఈ రోజు మనం తెలుసుకుంటున్నాం. వేసవిలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్, నట్స్, సీడ్స్ తీసుకోవడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది. వీటిని నానబెట్టి తీసుకోవడం వల్ల బాడీ హైడ్రేట్ అవుతుంది. అందుకే నానబెట్టిన డ్రైఫ్రూట్స్, నట్స్, సీడ్స్​తో మనం ఈ స్మూతీ తయారు చేసుకుంటున్నాము. దీనికి కావాల్సిన పదార్థాలు తయారీవిధానం ఇప్పుడు చుద్దాం.

కావాల్సిన పదార్థాలు

* అరటి పండు - 1

* ఓట్స్ - 2 స్పూన్లు (నానబెట్టాలి.)

* ఎండు ద్రాక్ష - 8 (నానబెట్టాలి)

* అంజీర్ -1 (నానబెట్టాలి)

* పెరుగు - 100 గ్రాములు

* పల్లీలు - 1 స్పూన్ (వేయించినవి)

* గుమ్మడి గింజలు - 1 స్పూన్ (నానబెట్టాలి)

* చియాసీడ్స్ - 2 స్పూన్స్ (నానబెట్టాలి)

* వాల్​నట్స్ - 4

తయారీ విధానం

అరటి పండు, ఓట్స్, ఎండు ద్రాక్ష, అంజీర్, పెరుగు, పల్లీలు, గుమ్మడి గింజలు అన్నింటిని మిక్సీ జార్​లో వేసి.. స్మూతీగా చేసుకోవాలి. అనంతరం ఓ గ్లాసులో చియాసీడ్స్ వేసి.. దానిలో ఈ స్మూతిని వేయాలి. దానిపై వాల్​నట్స్​తో గార్నిష్ చేసుకోవాలి. అంతే సింపుల్ అండ్ హెల్తీ స్మూతీ రెడీ. దీనిని బ్రేక్​ఫాస్ట్​లా తీసుకుంటే రోజంతా మీరు ఎనర్జిటిక్​గా ఉంటారు. పైగా వేసవిలో రోజంతా హైడ్రేట్​గా ఉంటారు.

దీనిలో మొత్తం 287 కేలరీలు ఉంటాయి. ప్రోటీన్ 11.1 గ్రాములు ఫైబర్ 4.4 గ్రాములు, మంచి కొవ్వు - 9 గ్రాములు, కార్బ్స్ 40 గ్రాములు ఉంటాయి. కాబట్టి దీనిని మీరు జిమ్ నుంచి వచ్చిన తర్వాత కూడా తీసుకోవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్