Alcohol Affect Sex : మద్యం తాగితే పడక గదిలో రెచ్చిపోతారా?-can alcohol affect your sex performance here s details ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Can Alcohol Affect Your Sex Performance Here's Details

Alcohol Affect Sex : మద్యం తాగితే పడక గదిలో రెచ్చిపోతారా?

HT Telugu Desk HT Telugu
Feb 28, 2023 09:30 PM IST

Alcohol Affect Sex : మద్యం తాగితే.. శృంగారంలో రెచ్చిపోవచ్చు అని చాలా మంది అనుకుంటారు. కోరికలు ఎక్కువగా కలుగుతాయని, దీనిద్వారా.. సెక్స్ ను ఎంజాయ్ చేస్తారని మాట్లాడుకుంటారు. ఇది నిజమేనా? మద్యం తాగితే.. సెక్స్ లో రెచ్చిపోతారా?

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (unsplash)

ఆల్కహాల్ ఎక్కువగా తాగి సెక్స్(Sex) చేస్తే.. ఇక ఊరుకోవడం ఉండదని, రెచ్చిపోతారని చాలామంది మాట్లాడుకుంటారు. అయితే కోరికలు కలుగుతాయి కానీ, రెచ్చిపోయి సెక్స్ చేసేంతలా ప్రభావం ఉంటుందా అని కొంతమందికి అనుమానం. మద్యం తీసుకుంటే.. సెక్స్ సామర్థ్యం పెరుగుతుందని కొందరు అంటే, పవర్ తగ్గిపోతుందని మరికొంతమంది చెబుతారు. మద్యం(Alcohol) తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి.

రోజుకి ఒకటి లేదా రెండు పెగ్గుల వద్యం తాగితే.. మగవారిలో సెక్స్ కోరికలు(sex desire), సామర్థ్యం పెరుగుతుంది. ఆల్కహాల్ మెదడులోని డోపమిన్ అనే హార్మోన్ ను ప్రేరేపించి ఉత్తేజపరుస్తుంది. దీంతో శరీరంలో నూతన ఉత్సాహం కలుగతుంది. క్రమంగా సెక్స్‌పైకి మనసు వెళ్లేలా చేస్తుంది. అయితే ఒకటి, రెండు పెగ్గుల మద్యం తాగేవారికి మాత్రమే ప్రయోజనం ఉంటుంది. అతిగా తాగితే.. చేయాలనుకుంటారు.. కానీ ఎక్కువగా చేయలేరు.

ఎక్కువగా మద్యం తాగితే.. మెదడు నుంచి డోపమిన్ విడుదల తగ్గిపోతుంది. అంతేకాదు.. అంగస్తంభన కూడా సమస్యగా ఉంటుంది. వీర్యం(Sperm) కూడా త్వరగానే బయటకు వచ్చేస్తుంది. తగిన మోతాదులో మద్యం తీసుకుంటే.. శృంగారాన్ని ఎంజాయ్ చేయోచ్చు. లేదంటే సమస్యలే.

ఏది ఏమైనప్పటికీ, ఆల్కహాల్(alcohol) మీ ఆరోగ్యాన్ని స్వల్పకాలంలో, దీర్ఘకాలికంగా ప్రభావితం చేస్తుంది. దానిని ఎక్కువగా ఉపయోగించడం వల్ల మానసిక స్థితి తగ్గుతుంది. లైంగిక కోరిక మీద ప్రభావం ఉంటుంది. ఎక్కువ మద్యం తీసుకుంటే.. పురుషుడు అంగస్తంభన సాధించడం, భావప్రాప్తి పొందడం కష్టతరం అవుతుంది. మన కాలేయం ఒక గంటలో ఒక స్టాండర్డ్-సైజ్ డ్రింక్‌లో ఆల్కహాల్ మొత్తాన్ని మాత్రమే విచ్ఛిన్నం చేయగలదు. కాబట్టి క్రమం తప్పకుండా దాని కంటే ఎక్కువ తాగడం వల్ల ఆల్కహాల్ నుండి టాక్సిన్స్ మీ శరీరంలో పేరుకుపోతాయి. సెక్స్‌లో పాల్గొనడం సహా మీ అవయవాలపై ప్రభావం చూపుతాయి.

మీరు మొదట మద్యం తాగినప్పుడు, మీ టెస్టోస్టెరాన్, డోపమైన్ స్థాయిలు తాత్కాలికంగా పెరుగుతాయి. ఎందుకంటే మెుదట 1, 2 పెగ్గుల దగ్గరే ఉంటారు. అందుకే కొంతమంది ఆల్కహాల్ నిజానికి సెక్స్ డ్రైవ్‌(Sex Drive)ను పెంచడంలో సహాయపడుతుందని అనుకుంటారు. వాస్తవానికి, ఆల్కహాల్ ఎక్కువైతే డోపమైన్, టెస్టోస్టెరాన్ స్థాయిలను తగ్గిస్తుంది.

అంగస్తంభన లోపానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ఆల్కహాల్ కూడా ఒకటి. ఒక మనిషి ఉద్రేకాన్ని అనుభవించినప్పుడు అతని మెదడు అతని పురుషాంగానికి సందేశాన్ని పంపవలసి ఉంటుంది. ఇది అంగస్తంభనను ప్రేరేపిస్తుంది. అయితే, మీరు తాగినప్పుడు మీ మెదడు సాధారణం కంటే నెమ్మదిగా పనిచేస్తుంది. సందేశం రావడానికి కొంత సమయం పట్టవచ్చు. ఆల్కహాల్ తాగడం వల్ల మీ శరీరం డీహైడ్రేట్ అవుతుంది. ఇది మీ రక్త పరిమాణం, ప్రసరణను తగ్గిస్తుంది. అంగస్తంభనను అయ్యేందుకు పురుషాంగానికి మంచి రక్త ప్రసరణ అవసరం.

WhatsApp channel