Forest Bathing Benefits : ఆరోగ్యం కోసం 'ఫారెస్ట్ బాత్'.. ఇక ప్లాన్ చేయండి
Forest Bathing Benefits : ఒకప్పుడు మనిషి పుట్టుక నుంచి చావు దాకా అడవిలోనే. ఇంతటి టెక్నాలజీ రాకముందు.. అడవితో మనిషికున్న సంబంధం మాటల్లో చెప్పలేనిది. ఇప్పుడు ప్రకృతికి దూరంగా జీవనం సాగిస్తున్నాడు మానవుడు. కానీ అడవి తల్లి ఒడిలోకి వెళ్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.
రోజూ.. ఎంత వాకింగ్(Walking) చేసినా.. జిమ్ కెళ్లి చెమటలు చిందించినా.. రాని తృప్తి.. ఒక్కరోజు అడవిలో తిరిగితే వస్తుంది. ఎటైనా వెళ్లేప్పుడు కాస్త.. పచ్చని చెట్ల మధ్య కూర్చుంటే.. మనసుకు తెలియని తృప్తి. అడవి తల్లితో మనిషికి ఉండే సంబంధం అది. అడవిలో నడిచినా.. పరిగెత్తినా.. సేదతీరినా.. ఎన్నో లాభాలు. మనసుకు హాయిగా ఉంటుంది. పచ్చని చెట్లు ఉంటే.. శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు. మానసిక ఒత్తిడి(Stress) దూరమవుతుంది. అడవి ద్వారా సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. అయితే అడవి స్నానం(Forest Bath) గురించి ఎప్పుడైనా విన్నారా? దీని ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
అయితే ఫారెస్ట్ బాత్ అంటే.. అక్కడకు వెళ్లి స్నానం చేసి రావడం అనుకోవద్దు. ఇందులో వేరే విషయం ఉంది. ప్రకృతిలో ఉంటే మనిషి ఎంత ఆరోగ్యంగా ఉంటాడో చెప్పే గొప్ప విషయం దాగి ఉంది. ఫారెస్ట్ బాతింగ్(Forest Bahing) అనే కాన్సెప్ట్ జపనీయుల ఫాలో అవుతారు. అయితే ఇది ఈ మధ్య కాలంలో వచ్చినదేం కాదు. సుమారు 150 ఏళ్లుగా అమలులో ఉన్నట్టుగా ఆధారాలు ఉన్నాయి. జపాన్ ప్రభుత్వం 1982 నుంచి తమ జాతీయ ప్రభుత్వ వైద్య కార్యక్రమంలో దీనిని భాగం చేసింది.
అడవిలో చెట్ల(Trees) నుంచి వచ్చే గాలిలో కాలుష్యం(Pollution) లేకపోవడమే కాకుండా.. పైటోన్ సైడ్ అనే రసాయన మిశ్రమం ఉంటుంది. బ్యాక్టీరియా, క్రిముల దగ్గరకు రాకుండా రక్షించుకునేందుకు చెట్లు పైటోన్ సైడ్ విడుదల చేస్తాయి. ఇది మనుషులు పీల్చుకోవడం కారణంగా రోగనిరోధక శక్తి(Immunity) పెరుగుతుంది. మానిషి శరీరంలోని కణాలు బ్యాక్టీరియా ఇన్ ఫెక్షన్స్ గురైతే.. ఆ బ్యాక్టీరియాను చంపేసేందుకు కొన్ని కణాలు పోరాటం చేస్తాయి. అవే నేచురల్ కిల్లర్స్. అడవి బయట కంటే.. అడవిలో ఉన్నప్పుడు మనిషి నేచురల్ కిల్లర్స్ క్రియాశీలకంగా పనిచేస్తున్నాయని పరిశోధనల్లో తేలింది.
ఫారెస్ట్ బాత్ అంటే.. అడవిలోకి స్నానం చేయడం కాదు. అడవిలో కనీసం రెండు గంటలు తగ్గకుండా.. ఉండాలి. అడవిలో నడక(Walk), పరిగెత్తడం(Run), చెట్ల కింద విశ్రాంతి తీసుకోవాలి. గుండె నిండ స్వచ్ఛమైన గాలి(Air)ని పీల్చుకోవాలి. అదే ఫారెస్ట్ బాత్. అడవిలో చెమటలు కక్కేలా నడక, పరిగెత్తడం ఇందులో భాగం. అటవీ అందాలను చూడటం, స్వచ్ఛమైన గాలి, పక్షుల కిలకిలలు, మంచి వాతావరణం ఉండటం శరీరానికి, మనసుకు ఆరోగ్యం. అవి ఆరోగ్యంగా ఉంటే ఎలాంటి రోగాలు దగ్గరకు రావు.
మీ దగ్గరలోని అడవుల్లో ఇలా ఫారెస్ట్ బాత్ ప్లాన్ చేయండి. అయితే ముఖ్యగమనిక జనాలు తిరిగే ప్రాంతానికే వెళ్లండి. అడవితో ఎంత లాభం ఉందో.. అక్కడే ఉండే జంతువులతో అంతటి అపాయం కూడా ఉంది. అందుకే వీకెండ్స్(Weekends)లో ఫారెస్ట్ బాత్ ప్లాన్ చేస్తే.. జనాలు ఉండే అటవీలోకి వెళ్లండి.