Yoga For Healthy Heart । మీ గుండె ఆరోగ్యం జాగ్రత్త.. రోజూ ఈ యోగాసనాలు వేయండి!-prevent heart attack or cardiac arrest keep your heart healthy and strong with these yoga asanas
Telugu News  /  Lifestyle  /  Prevent Heart Attack Or Cardiac Arrest, Keep Your Heart Healthy And Strong With These Yoga Asanas
Yoga For Healthy Heart
Yoga For Healthy Heart (istock)

Yoga For Healthy Heart । మీ గుండె ఆరోగ్యం జాగ్రత్త.. రోజూ ఈ యోగాసనాలు వేయండి!

28 February 2023, 9:03 ISTHT Telugu Desk
28 February 2023, 9:03 IST

Yoga For Healthy Heart: గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే శరీరం, మనసు రెండూ మీ నియంత్రణలో ఉండాలి. అందుకు యోగా ఒక గొప్ప సాధనం. గుండె ఆరోగ్యాన్ని పెంచే యోగాసనాలు ఇక్కడ చూడండి.

ప్రతి మనిషి రోజంతా పనిచేసిన తర్వాత కొంత విరామం, విశ్రాంతి తీసుకుంటాడు. కానీ, ఎంత పనిచేసినా నిర్విరామంగా నిరంతరం పనిచేసే అవయవం మన గుండె. ఇది శరీరం అంతటా రక్తాన్ని సరఫరా చేసే అత్యంత ముఖ్యమైన అవయవం. ఈ గుండె అలిసిపోయి విరామం తీసుకుందంటే, ఇక మనిషి శాశ్వత విరామం తీసుకున్నట్లే. కాబట్టి గుండె ఎల్లప్పుడూ పనిచేసేలా దానిని ఆరోగ్యంగా చూసుకోవడం చాలా ముఖ్యం.

నేడు చూస్తే, చాలా మంది గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ వంటి గుండె సమస్యలతో బాధపడుతున్నారు. 20 ఏళ్ల చిన్న వయసు వారు కూడా గుండెపోటుతో కుప్పకూలడం సర్వసాధారణంగా మారుతుంది. శరీరానికి అసలు శ్రమ లేకుండా నిశ్చలమైన జీవనశైలిని కలిగి ఉండటం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ధూమపానం, మద్యపానం, నిరంతరమైన ఒత్తిడి, ఆందోళనలు, నిద్రలేమి మొదలైన కారణాలే గుండె పనితీరుకు భంగం కలిగిస్తున్నాయని వైద్యులు అంటున్నారు.

Yoga For Healthy Heart- ఆరోగ్యమైన గుండెకు యోగాసనాలు

హృదయ ఆరోగ్యం బాగుండాలంటే చెడు అలవాట్లు మానేయడం, ఒత్తిడి తగ్గించుకోవడం, ఇంట్లో వండిన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చేయాలి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. మీ హృదయాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి యోగా ఉత్తమమైన మార్గాలలో ఒకటి. కొన్ని యోగా ఆసనాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ప్రతిరోజూ ఆ ఆసనాలు సాధన చేయడం వల్ల మీ గుండె దృఢంగా మారుతుంది. ఆ ఆసనాలు ఏమిటో ఇక్కడ చూడండి.

ఉత్తిత త్రికోణాసనం - Extended Triangle Pose

ఉత్తిత త్రికోనసనా ఛాతీ విస్తరణకు గొప్ప ఆసనం. ఇది గుండెను తెరవడానికి సహాయపడుతుంది. ఈ భంగిమ పొత్తికడుపు కండరాలను ఉత్తేజపరుస్తుంది, వెన్ను కండరాలను సాగదీస్తుంది. ఏకాగ్రతతో స్థిరంగా శ్వాస తీసుకుంటూ ఈ ఆసనం వేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. మీ మెదడు, గుండె పనితీరును ఈ ఆసనం మెరుగుపరుస్తుంది.

పశ్చిమోత్తనాసనం - Seated Forward Bend Pose

ఈ యోగాసనంలో వెన్నెముకతో సహా, తల నుండి మడమల వరకు శరీరం మొత్తం వెనుక భాగాని లోతైన వ్యాయామం అందిస్తుంది. ఇది వెన్నెముక కదలిక, శరీరానికి ఫ్లెక్సిబిలిటీకి ప్రయోజనం చేకూరుస్తుంది. గొప్ప విషయం ఏమిటంటే ఈ యోగాసనం మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. ఆందోళనను తగ్గిస్తుంది, రక్తపోటును అదుపులో ఉంచుతుంది. తద్వారా ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

అర్ధ మత్స్యేంద్రాసన- Sitting Half Spinal Twist Pose

ఇది మీ శరీరాన్ని ట్విస్ట్ చేసే ఆసనం. మీ వెన్నెముక మీద పనిచేస్తుంది. ఈ ఆసనం వేయడం ద్వారా మీ ఛాతీ ఎడమ, కుడి రెండు వైపులా తెరుచుకుంటుంది. ఇది గుండెను కూడా ఉత్తేజపరుస్తుంది, గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.

సేతు బంధాసనం - Bridge Pose

ఈ భంగిమ లోతైన శ్వాసను తీసుకునేలా మీ ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇది వెన్నెముక, ఛాతీని సాగదీస్తుంది. ఛాతీ ప్రాంతంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. గుండెకు వెళ్లే ఆక్సిజన్ పెరుగుతుంది. ఈ విధంగా ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

సంబంధిత కథనం