Semen Allergy: ఆ జంటకు విచిత్ర సమస్య…. భర్త వీర్యం తాకితే అంతే…
Semen Allergy హైదరాబాద్‌లో ఓ జంటకు విచిత్రమైన సమస్య ఎదురైంది. భర్త వీర్యం తాకితే చాలు భార్య అలర్జీకు గురవుతోంది. ఆరేళ్లుగా సంతానం కోసం ప్రయత్నిస్తున్న దంపతులకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించాక భర్త వీర్యం భార్య అలర్జీకు కారణంగా తేల్చారు.
Semen Allergy పురుషుడి వీర్యానికి స్త్రీలలో అలర్జీ వస్తుందని ఎప్పుడైనా విన్నారా? వినడానికి విచిత్రంగా అనిపించవచ్చు కానీ స్త్రీలలో ఇలాంటి సమస్య కూడా తలెత్త వచ్చు. వీర్యానికి అలెర్జీగా మారే పరిస్థితి కూడా ఉంటుంది. ఇలాంటి పరిస్థితి వల్ల హైదరాబాద్‌లో ఓ జంట బిడ్డను కనడానికి కష్టపడుతున్నారు.
హైదరాబాద్‌లో మొట్టమొదటి సారి వీర్యపు అలర్జీకి గురైన మహిళను వైద్యులు గుర్తించారు. లైంగిక చర్యలో పాల్గొన తర్వాత అర గంట నుంచి ఆరు గంటల వరకు విపరీతమైన అలర్జీకి లోనవుతున్న మహిళను వైద్యులు గుర్తించారు. మహిళకు శరీరంపై వీర్యం తాకిన చోట దద్దుర్లు, దురదలు వచ్చాయి. కొన్నిసార్లు తీవ్రమైన శారీరక ఇబ్బందులకు సైతం గురవుతోంది. హైదరాబాద్‌లో ఈ తరహా ఘటన వెలుగు చూడటం ఇదే మొదటి సారని వైద్యులు చెబుతున్నారు.
అలెర్జీ సాధారణ లక్షణాలలో ప్రైవేట్ భాగాలపై దద్దుర్లు, దురద, ముఖంపై మొటిమలు పెరగడం, శరీరం వేడిగా మారడం, జలుబు - తుమ్ములు వంటి సమస్యలు ఎదురవుతున్నాయి.
"ఇమ్యునాలజీకి సంబంధించిన అలెర్జీ రుగ్మతల నిర్ధారణలో ఈ కేసును అరుదైన కేసు భావిస్తున్నట్లు హైదరాబాద్‌కు చెందిన అలర్జీ వ్యాధుల నిపుణుడు వ్యాకరణం నాగేశ్వర్ చెప్పారు. ఇలాంటి వ్యాధులు ఎప్పుడూ గుర్తించబడవని, అత్యంత అరుదుగా ఎదురవుతుంటాయన్నారు.
హైదరాబాద్‌కు చెందిన ఈ జంట పెళ్లి తర్వాత గత ఆరేళ్లుగా పిల్లల కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రక్రియలో, వారు గర్భధారణ కోసం అన్ని సహజ పద్ధతులను ప్రయత్నించారు, కానీ ఉపశమనం, ఫలితాన్ని పొందలేదు. "పరీక్షల సమయంలో, మహిళ సెమెన్ హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్‌కు పాజిటివ్‌గా గుర్తించారు. క్లినికల్ పరీక్షలు, భర్త వ్యక్తిగత వ్యాధి చరిత్ర తర్వాత, భాగస్వామి వీర్యం అలెర్జీలకు ట్రిగ్గర్ అని గుర్తించినట్లు వైద్యుడు తెలిపారు.
రోగనిర్ధారణలో భాగంగా, మహిళ చేతి మీద శానిటైజ్ చేసి, చర్మ పరీక్ష నిర్వహించారు. ఆమె భర్త నుండి సేకరించిన 0.5 మిల్లీలీటర్ల వీర్యం చర్మం మీద శానిటైజ్ చేసిన ప్రదేశంలో ఒక చిన్న చుక్క వేశారు. ఈ పరీక్షల్లో బాధితురాలి సమస్యలకు మూల కారణం భర్త వీర్యమేనని స్పష్టమైంది. అలర్జీ లేదా హైపర్ సెన్సిటివిటీని నిర్ధారించడానికి అవసరమైన సంపూర్ణ విలువలను వచ్చాయని వైద్యుడు నిర్ధారించారు.
ఇమ్యునోలాజికల్ పరీక్షల్లో భర్తకు బాల్యం నుండి అలెర్జీ ఆస్తమా, దద్దుర్లు మరియు దురద మరియు అలెర్జీరినిటిస్ వంటి అలర్జీలు ఉన్నాయని తేలింది. అతనికి చాలా తరచుగా జలుబు మరియు తుమ్ములు వస్తాయని వైద్యులు తెలిపారు.
భర్త కారణంగా భవిష్యత్తులో ఆమెకు అలెర్జీలు తీవ్రతరం అయ్యే ప్రమాదాల గురించి ఈ జంటకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇది ఆమెను అలెర్జీ ఆంజియోడెమా లేదా కొన్నిసార్లు ప్రాణాంతక అలెర్జీ అనాఫిలాక్టిక్ షాక్‌కు దారి తీయవచ్చని వైద్యులు హెచ్చరించారు. ఆ దంపతులకు కండోమ్‌తో సంభోగం చేసే అవకాశం ఉందని, గర్భం దాల్చడానికి సులభమైన సహాయక పద్ధతులను అన్వేషించడానికి వైద్య నిపుణుల సహాయం అవసరమని చెప్పారు.
ప్రాణాంతక అనాఫిలాక్టిక్ ప్రతిచర్యకు దారితీసే అలెర్జీ ప్రతిచర్యలను నివారించడానికి ఇంట్లో "ఎపిపెన్ ఇంజెక్షన్"ను సులభంగా ఉంచుకోవాలని వారికి సలహా ఇచ్చారు. ఇకపై పెళ్లి సంబంధాలు చూసే సమయంలో అలర్జీ లక్షణాలు గురించి కూడా ఆరా తీసుకోవాల్సిన పరిస్థితులు రావొచ్చు.
టాపిక్