తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Hair Growth Oil : ఈ నూనె రాస్తే.. మీ జుట్టు వద్దన్నా పెరుగుతుంది

Hair Growth Oil : ఈ నూనె రాస్తే.. మీ జుట్టు వద్దన్నా పెరుగుతుంది

HT Telugu Desk HT Telugu

11 March 2023, 16:15 IST

    • Hair Growth Oil : జట్టు రాలడం, జుట్టు పలుచగా ఉండటంతో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఓ రకమైన ఇబ్బందిగా ఫీల్ అవుతారు. బయటకు వెళ్లాలన్నా.. ఆలోచిస్తారు. అయితే ఇంట్లోనే ఆయిల్ తయారుచేసుకుని పెట్టుకుంటే.. జట్టు ఒత్తుగా పెరుగుతుంది.
హెయిర్ గ్రోత్ ఆయిల్
హెయిర్ గ్రోత్ ఆయిల్ (unsplash)

హెయిర్ గ్రోత్ ఆయిల్

Oil For Hair Growth : ఇంట్లో ఉన్న వాటిని ఉపయోగించి.. మీ జుట్టు(Hair)ను అందంగా మార్చుకోవచ్చు. వీటితో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్(Side Effects) కూడా ఉండవు. ఎంచక్కా జుట్టును ఒత్తుగా పెంచుకోవచ్చు. ఈ నూనెను తయారుచేసుకునేందుకు పెద్దగా ప్రాబ్లమ్ ఉండదు. ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే తయారుచేసుకోవచ్చు. ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ నూనెను తయారుచేసుకునేందుకు ముందుగా ఒక గిన్నెలో 100 ఎమ్ఎల్ కొబ్బరి నూనె(Coconut Oil) తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత నూనెను చిన్న మంట మీద వేడి చేయాలి. అయితే ఇందులోకి రెండు టీ స్పూన్ల మెంతులు వేసి వేడి చేయాలి. తర్వాత రెండు రెమ్మల కరివేపాకు(Curry Leave) వేయాలి. ఇందులో ఒక టీ స్పూన్ ఆముదం నూనెను కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ నూనెను చిన్న మంట మీద కలుపుతూ.. వేడి చేసుకోవాల్సి ఉంటుంది.

మెంతులు(Methi), కరివేపాకులో ఉండే పోషకాలు నూనెలో కలిసి.. నూనె(Oil) రంగు మారే వరకు అలానే ఉంచాలి. బాగా వేడి అయ్యేవరకూ ఆఫ్ చేయకూడదు. రంగు మారిన తర్వాత స్టౌవ్ ఆఫ్ చేయాలి. ఈ నూనె చల్లారే వరకూ అలానే ఉంచుకోవాలి. ఇప్పుడు వడకట్టుకుని నిల్వ చేసుకోవాలి. ఇలా తయారు చేసిన నూనెను నెల రోజులపాటుగా ఉపయోగించుకోవచ్చు.

ఆ నూనెను జుట్టు కుదుళ్ల నుంచి చివరకు వరకు పట్టించుకోవాలి. ఈ నూనె రాసుకున్నాక తర్వాతి రోజు తలస్నానం(Head bath) చేయాల్సి ఉంటుంది. ఒకవేళ రోజంతా.. జుట్టుకు రాసుకుని ఉండటం కుదరకుంటే.. రాత్రి పెట్టుకుని.. మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయోచ్చు. ఇలా వారానికి రెండుసార్లు చేయండి. మీ జుట్టు రాలడం(Hair Loss) తగ్గుతుంది. అంతేకాదు.. దీనితో మీ జుట్టుకు కావాల్సిన పోషకాలు అందుతాయి.

మీ జుట్టు కుదుళ్లు బలంగా తయారవుతాయి. ఈ నూనెతో చుండ్రు(Dandruff), దురదలాంటి సమస్యలు కూడా తగ్గుతాయి. జుట్టు రాలడం, జుట్టు బలహీనంగా మారడం, తెల్లజుట్టు(White Hair) లాంటి సమస్యతో బాధపడేవారు.. ఈ చిట్కాను ఉపయోగించుకోవచ్చు.

రసాయనాలు అధికంగా ఉండే ఉత్పత్తులను జుట్టుకు ఎక్కువగా ఉపయోగించడం వలన జుట్టు తెల్ల బడుతుంది. హెయిర్ ప్రొడక్ట్స్‌లో ఉండే సల్ఫేట్‌లు జుట్టుకు కొన్ని ప్రయోజనాలు చేకూర్చినప్పటికీ, వీటి వల్ల జుట్టు పొడిబారి, త్వరగా పాడైపోయేలా చేస్తాయి. ఇది జుట్టును తెల్లగా మారుస్తుంది. అందువల్ల సల్ఫేట్ లేని జుట్టు సంరక్షణ ఉత్పత్తులను ఎంచుకోండి.

దీర్ఘకాలం పాటు ఒత్తిడిని అనుభవిస్తే, అది నిద్రలేమి, ఆందోళన, ఆకలి మందగించటం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఈ పరిస్థితులన్నీ మీ జుట్టుపై చెడుప్రభావం చూపిస్తాయి. ఫలితంగా జుట్టు రాలడం(Hair Loss) వంటి సమస్యలను ఎదుర్కొంటారు, క్రమక్రమంగా వెంట్రుకలు తెల్లబడటం(White Hair) ప్రారంభిస్తాయి. కాబట్టి మిమ్మల్ని ఒత్తిడి లేకుండా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి రోజూ ధ్యానం చేయాలి. సరైన నిద్రపోవాలి.

టాపిక్