Curd and Methi For Hair : ఈ రెండూ కలిపి జుట్టుకు పెడితే.. జుట్టు పెరుగుదల ఆగదు-curd and methi for hair growth how to mix and apply know details inside ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Curd And Methi For Hair Growth How To Mix And Apply Know Details Inside

Curd and Methi For Hair : ఈ రెండూ కలిపి జుట్టుకు పెడితే.. జుట్టు పెరుగుదల ఆగదు

HT Telugu Desk HT Telugu
Mar 07, 2023 11:40 AM IST

Hair Growth Tips : అబ్బా.. ఎంత ట్రై చేసినా.. జుట్టు పెరగడం లేదు. అలానే ఉంటుంది. మా ఫ్రెండ్స్ జుట్టేమో.. మర్రి ఊడళ్ల పెరుగుతున్నాయి.. ఇదే చాలా మంది చేసే కంప్లైంట్. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే.. మీ జుట్టు పెరుగుతుంది.

ఆరోగ్యకరమైన వెంట్రుకల కోసం చిట్కా
ఆరోగ్యకరమైన వెంట్రుకల కోసం చిట్కా (unsplash)

Curd And Methi For Hair Growth : జుట్టు సమస్యలు.. ఈ కాలంలో ఎక్కువగా ఉన్నాయి. జుట్టు పెరగకపోవడం, జుట్టు రాలడం(Hair Loss), తెల్ల వెంట్రుకలు(White Hairs).. ఇలా చాలా సమస్యలతో సతమతమవుతున్నారు. తక్కువ వయసులోనే జుట్టు సమస్యలు(Hair Problems) ఎదుర్కొంటున్నారు. అయితే కేవలం రెండు కలిపి రాస్తే.. మీ జుట్టు పెరుగుతూనే ఉంటుంది. చాలా వరకు జుట్టు సమస్యల నుంచి బయటపడొచ్చు.

ఆరోగ్యకరమైన జుట్టు కోసం.. కేవలం మీరు మెంతులు, పెరుగు(Curd) ఉపయోగించాలి. వాటితో మీ హెయిర్స్ పెరుగుతూనే ఉంటాయి. చాలా వరకు జుట్టు సమస్యల నుంచి బయటపడొచ్చు. రెండు పదార్థాలే అయినా.. మీ జుట్టు సమస్యలను తగ్గించి.. జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా ఈజీ. కేవలం పెరుగు, మెంతులు(Methi) ఉంటే సరిపోతుంది.

మెంతులు, పెరుగు సహజ సిద్ధమైనవే. వీటిలో అనేక పోషకాలు, ఔషధ గుణాలు ఉంటాయి. వాటిని ఉపయోగిస్తే.. జుట్టు కావల్సిన పోషకాలు అంది జుట్టు రాలడం(Hair Loss) తగ్గుతుంది. చుండ్రు సమస్యలు కూడా తగ్గుతాయి. తల చర్మం కూడా బాగుంటుుంది. జుట్టు పొడిబారకుండా ఉండేందుకు కూడా మెంతులు, పెరుగు కలిపి పెడతారు. ఇది ఉపయోగిస్తే.. జుట్టు కుదుళ్లు బలంగా తయారై.. ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.

ఈ చిట్కాకు ముందు.. మీరు మెంతులను పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని మూడు టీ స్పూన్ల మోతాదులో ఒక గిన్నెలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇందులో ముప్పావు కప్పు.. పెరుగును వేసి కలుపుకోవాలి. ఒకవేళ మిశ్రమం మరీ గట్టిగా ఉంటే.. కాస్త నీటి(Water)ని పోసి కలుపుకోవాలి. మిశ్రమాన్ని రాత్రిపూట తయారు చేసుకోండి. ఉదయం లేచాక.. దానిని జుట్టు కుదుళ్ల నుంచి చివరి వరకూ పట్టించాలి.

అలా పెట్టుకుని ఆరిన తర్వాత.. త‌ల‌స్నానం(Head Bath) చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే మంచిది. జుట్టు రాలడం(Hair Loss) తగ్గుతుంది. చుండ్రు సమస్య నుంచి బయటపడొచ్చు. జుట్టు కుదుళ్లు బలంగా, ఆరోగ్యంగా తయారు అవుతాయి. చాలా సమస్యల నుంచి బయటపడేందుకు ఈ చిట్కా ఉపయోగపడుతుంది.

దీర్ఘకాలం పాటు ఒత్తిడి(Stress)ని అనుభవిస్తే, అది నిద్రలేమి, ఆందోళన, ఆకలి మందగించటం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఈ పరిస్థితులన్నీ మీ జుట్టుపై చెడుప్రభావం చూపిస్తాయి. ఫలితంగా జుట్టు రాలడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు, క్రమక్రమంగా వెంట్రుకలు(Hairs) తెల్లబడటం ప్రారంభిస్తాయి. కాబట్టి మిమ్మల్ని ఒత్తిడి లేకుండా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి రోజూ ధ్యానం చేయాలి. సరైన నిద్రపోవాలి.

రసాయనాలు అధికంగా ఉండే జుట్టు ఉత్పత్తులను ఎక్కువగా ఉపయోగించడం వలన కూడా జుట్టు తెల్ల బడుతుంది. హెయిర్ ప్రొడక్ట్స్‌(Hair Products)లో ఉండే సల్ఫేట్‌లు జుట్టుకు కొన్ని ప్రయోజనాలు చేకూర్చినప్పటికీ, వీటి వల్ల జుట్టు పొడిబారి, త్వరగా పాడైపోయేలా చేస్తాయి. ఇది జుట్టును తెల్లగా మారుస్తుంది. అందువల్ల సల్ఫేట్ లేని జుట్టు సంరక్షణ ఉత్పత్తులను ఎంచుకోండి.

WhatsApp channel

టాపిక్