(1 / 7)
“జుట్టు పల్చబడటం, బలహీనమైన జుట్టు, చివర్లు చీలిపోవడం, లింప్, నిర్జీవమైన జుట్టు, దురదలు, చుండ్రు, మరెన్నో జుట్టు సమస్యలతో చాలామంది బాధపడుతుంటారు. ఈ జుట్టు సమస్యలు తరచుగా శరీరంలో పోషకాహార లోపం వల్లే వస్తాయి. దీన్ని ఎదుర్కోవడానికి, సూక్ష్మపోషకాలు (విటమిన్లు, ఖనిజాలు) అవసరం.” అని న్యూట్రిషనిస్ట్ అంజలి ముఖర్జీ వెల్లడించారు. జుట్టు పెరుగుదల, జుట్టు ఆరోగ్యానికి తోడ్పడే ఆహారాన్ని ఆమె సిఫార్సు చేసింది.
(Unsplash)(2 / 7)
శరీరానికి విటమిన్ బి-కాంప్లెక్స్ అందించడానికి తృణధాన్యాలు, పప్పులు, గింజలు, ఈస్ట్, మాంసం, కొన్ని ఆకు కూరలను ఆహారంలో చేర్చుకోవాలని న్యూట్రిషనిస్ట్ అంజలి సిఫార్సు చేసింది.
(Unsplash)(3 / 7)
బయోటిన్ కెరాటిన్ పెరుగుదలను ప్రేరేపించడంలో, ఫోలికల్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది. కోడిగుడ్డు పచ్చసొన, పాలు, వేరుశెనగ, బాదం, సోయాబీన్స్, పెరుగు, చిలగడదుంపలలో బయోటిన్ ఎక్కువగా ఉంటుంది.
(Unsplash)(4 / 7)
విటమిన్ ఎ.. చర్మ గ్రంధుల్లోని సెబమ్‌ను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. ఇది స్కాల్ప్‌ను మాయిశ్చరైజ్ చేయడంలో, జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది కాడ్ లివర్ ఆయిల్, క్యారెట్లు, బచ్చలికూర, పీచెస్, బ్రోకలీలో ఉంటాయి.
(Unsplash)(5 / 7)
విటమిన్ E: ఈ విటమిన్ వాల్‌నట్స్, గింజలు, ఎండిన బీన్స్, సోయాబీన్స్, ఆకుకూరల నుంచి పొందవచ్చు.
(Unsplash)(6 / 7)
విటమిన్ సి: విటమిన్ సి జుట్టు అకాల బూడిద రంగు రాకుండా నివారిస్తుంది. జుట్టు రాలడం, చుండ్రును నివారిస్తుంది. అందుకే మీ డైట్లో సిట్రస్ పండ్లైనా.. స్ట్రాబెర్రీలు, కివి, కాంటాలౌప్, పైనాపిల్, టమోటాలు, బెల్ పెప్పర్, ముదురు ఆకుపచ్చ కూరగాయలను చేర్చుకోవచ్చు.
(Unsplash)సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు