తెలుగు న్యూస్ / ఫోటో /
Hair Loss Prevention Foods | రాలిపోయే జుట్టుకు ఈ ఆహారాలతో ప్రాణం పోయండి!
- ఇప్పుడు యువతను వేధిస్తున్న ఒక మహమ్మారి.. జుట్టు రాలడం. ఈ సమస్యతో మానసిక వేదనను అనుభవిస్తున్నారు. అయితే ఇప్పుడు చింతించాల్సిన అవసరం లేదు. జుట్టు రాలడాన్ని నిరోధించి, పెరుగుదను ప్రోత్సహించే ఆహారాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.
- ఇప్పుడు యువతను వేధిస్తున్న ఒక మహమ్మారి.. జుట్టు రాలడం. ఈ సమస్యతో మానసిక వేదనను అనుభవిస్తున్నారు. అయితే ఇప్పుడు చింతించాల్సిన అవసరం లేదు. జుట్టు రాలడాన్ని నిరోధించి, పెరుగుదను ప్రోత్సహించే ఆహారాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.
(1 / 7)
మన చర్మానికి, వెంట్రుకలకు ఏది మంచిదో తెలియకుండా మార్కెట్‌లో దొరికే షాంపూలు, సబ్బులు ఇతరత్రా ఉత్పత్తుల వాడకంతో అవి మన జేబులకు చిల్లుపెట్టడమే కాదు, మన తల వెంట్రుకలను రాలగొడుతున్నాయి. ఎప్పటికైనా సహజసిద్ధమైన నివారణలే రక్షణ కవచాలుగా నిలుస్తాయి. మీరు జుట్టు రాలే సమస్యతో బాధపడుతుంటే మీ డైట్‌లో చేర్చుకోవాల్సిన కొన్ని సూపర్‌ఫుడ్‌లు ఉన్నాయి.(Unsplash)
(2 / 7)
Nuts: నట్స్ మీ డైట్‌లో కీలకమైనవి. ఇందులో పోషకాలు, ముఖ్యంగా బయోటిన్, బి-విటమిన్లు, ప్రోటీన్, మెగ్నీషియం, ఒమేగా 3, 6 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి హెయిర్ క్యూటికల్స్‌ను బలోపేతం చేయడమే కాకుండా స్కాల్ప్‌కు పోషణనిస్తాయి.(Unsplash)
(3 / 7)
పాలకూరలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి జుట్టు రాలడాన్ని నివారించడంలో సహాయపడతాయి. ఇందులోని విటమిన్ బి, సి హెయిర్ ఫోలికల్స్‌ను పునరుజ్జీవింపజేసి పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.(Unsplash)
(4 / 7)
Salmon: సాల్మన్ చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ చేపలు తినడం ద్వారా జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.(Unsplash)
(5 / 7)
కాయధాన్యాల్లో ఫైబర్, బి విటమిన్లు, విటమిన్ సి, జింక్, ఇతర ఖనిజాలు, ప్రోటీన్లు ఉంటాయి. ఈ పోషకాలన్నీ జుట్టు పెరుగుదలతో పాటు, డ్యామేజ్ అయిన జుట్టును రిపేర్ చేయడంలో సహాయపడతాయి.(Unsplash)
(6 / 7)
గుడ్లలో బయోటిన్, ఇతర B విటమిన్లు ఉంటాయి, ఇవి జుట్టు, చర్మం అలాగే గోళ్ల ఆరోగ్యానికి ముఖ్యమైనవి. జుట్టు పెరుగుదలకు కీలకమైన ప్రోటీన్ గుడ్లలో ఉంటుంది.(Unsplash)
సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు