Relationship Tips : బ్రేకప్​ తర్వాత మీ ఎక్స్.. మీ కొలిగ్​గా వస్తే..-when you have to work with your ex in same office follow these tips ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Relationship Tips : బ్రేకప్​ తర్వాత మీ ఎక్స్.. మీ కొలిగ్​గా వస్తే..

Relationship Tips : బ్రేకప్​ తర్వాత మీ ఎక్స్.. మీ కొలిగ్​గా వస్తే..

Geddam Vijaya Madhuri HT Telugu
Jun 25, 2022 12:33 PM IST

బ్రేకప్​ తర్వాత మీ పని మీరు చేసుకుంటున్నప్పుడు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టే విషయం మీ ఎక్స్. వారి జ్ఞాపకాలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. అదే ఎక్స్ మీ ఆఫీస్​లో జాయిన్​ అవుతున్నాడని తెలిస్తే.. ఇక చెప్పేదేమిలేదు. అంతా అయిపోయిందనే ఫీల్ వచ్చేస్తుంది. అలాంటి సమయంలో మీరు మీ ఎక్స్​ని కొలిగ్​గా ఎలా యాక్సెప్ట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

<p>మీ ఎక్స్ కొలిగ్ అయితే..</p>
మీ ఎక్స్ కొలిగ్ అయితే..

Relationship Tips : బ్రేకప్​ అయిన తర్వాత మీ ఎక్స్ మీ కంపెనీలో జాయిన్ అవుతున్నారని తెలిస్తే మీ గుండె చప్పుడు ఒక్క నిముషం ఆగిపోతుంది. ఒక్కసారిగా మీ కళ్లముందు ఆ జ్ఞాపకాలు కనిపిస్తాయి. ఒక్కసారిగా ఆ విషాద ఛాయలు మీ మనసును కలవరపరుస్తాయి. బ్రేకప్​ని మరచిపోయి.. మీ ఆఫీస్​లో కొలిగ్​గానే ట్రీట్​ చేసినా.. మీ జ్ఞాపకాలను ఎదుర్కోవడం కష్టంగానే ఉంటుంది. అయితే మీరు మీ ఎక్స్​తో పనిచేయాల్సి వచ్చినప్పుడు.. ఆ సమస్యను ఎలా ఎదుర్కోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణ ప్రవర్తనను కొనసాగించండి

మీరు ఎప్పుడైనా మీ మాజీతో పని చేయవలసి వస్తే, ఆ పని నుంచి పారిపోకండి. బదులుగా మీ మాజీతో సాధారణంగానే ఉండండి. తద్వారా మీరు ఈ బ్రేకప్​ తర్వాత చాలా దూరం వెళ్లినట్లు మీ మాజీ భావిస్తారు. మీరు ఇలా నార్మల్​గా ఉంటే.. అతను లేదా ఆమె మీతో ఉన్నా మీకు పెద్ద తేడా ఉండదు.

కీప్ యువర్ థింగ్స్ సీక్రెట్..

మీరు పనిచేసే ఆఫీసులో మీ ప్రైవేట్ విషయాలను ఎవరితోనూ పంచుకోకండి. అదే సమయంలో మీ మాజీ కూడా మీ ఆఫీసులో పని చేస్తుంటే.. మీ ప్రైవేట్ విషయాలను ఆఫీస్‌లో ఎవరితోనూ పంచుకోకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విషయంపై ముందే మీ ఎక్స్​తో చర్చించండి.

పరిమిత సర్కిల్‌లో ఉండండి

మీ మాజీ అదే కార్యాలయంలో పని చేస్తున్నప్పుడు మిమ్మల్ని ఏదైనా చికాకు పెట్టడం ప్రారంభిస్తే.. దానిని వ్యక్తిగతంగా తీసుకోకండి. కానీ సరదాగా దానికి సంబంధించిన ప్రతిదానికీ దూరంగా ఉండండి. మీరు మీ పరిమిత సర్కిల్‌లో నార్మల్​గా ఉండండి.

మరొక ఉద్యోగాన్ని వెతుక్కోండి..

మీరు మీ మాజీతో ఒకే కార్యాలయంలో పని చేయడం చాలా కష్టం. అటువంటి పరిస్థితిల్లో.. ఈ సమస్య నుంచి బయటపడటానికి ఒకే ఒక మార్గం ఉంది. అదే మీరు కొత్త ఉద్యోగాన్ని కనుగొనడం.

విస్మరించండి

మీ మాజీ పాత విషయాల గురించి మీ దగ్గర ప్రస్తావిస్తూ.. మిమ్మల్ని ఎగతాళి చేస్తే.. మీరు నవ్వుతూ అక్కడనుంచి వెళ్లిపోండి. లేకుంటే అది భవిష్యత్తులో తీవ్రమైన చర్చకు దారితీస్తుంది. ఇది మీలో ఎవరికీ మంచిది కాదు. మీ సహోద్యోగుల దగ్గర మీరు చులకనయ్యే అవకాశముంది.

పనిపై దృష్టి పెట్టండి

మీ భావోద్వేగాలను పక్కన పెట్టండి. మీ పని, ఎదుగుదలపై మాత్రమే దృష్టి పెట్టడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం ద్వారా మీ మాజీ పట్ల శ్రద్ధ వహించడానికి మీకు తగినంత సమయం ఉండదు.

Whats_app_banner

సంబంధిత కథనం