Summer Hair Care । వేసవిలో మీ జుట్టును చల్లగా ఉంచుకునేందుకు ఆయుర్వేద చిట్కాలు!-summer hair care keep your hair cool and healthy during summer with this 8 ayurvedic tips ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Summer Hair Care Keep Your Hair Cool And Healthy During Summer With This 8 Ayurvedic Tips

Summer Hair Care । వేసవిలో మీ జుట్టును చల్లగా ఉంచుకునేందుకు ఆయుర్వేద చిట్కాలు!

HT Telugu Desk HT Telugu
Feb 28, 2023 11:17 AM IST

Summer Hair Care: వేసవి ఎండకు మీ జుట్టు ఆరోగ్యం దారుణంగా దెబ్బతింటుంది. మీ జుట్టును చల్లగా ఉంచుకునేందుకు కొన్ని ఆయుర్వేద చిట్కాలను ఇక్కడ చూడండి.

Summer Hair Care
Summer Hair Care (istock)

ఆరోగ్యకరమైన, ఎగిసిపడే జుట్టు మీకు అందమైన రూపాన్ని అందింస్తుంది. వెంట్రుకలు మందంగా, ఒత్తుగా, మెరిసేలా ఉంటే అందరి దృష్టిని ఆకర్షించవచ్చు. ముందున్నది ఎండాకాలం తీవ్రమైన సూర్యకాంతి, కాలుష్యం, దుమ్ము ధూళి మొదలైన కారకాలు జుట్టుపై చెడు ప్రభావం చూపుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో జుట్టుకు రసాయన ఉత్పత్తులను వాడటం వలన వాటి ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే అవుతుంది. వెంట్రుకలు పొడిబారి, నిర్జీవంగా తయారవుతాయి. ఇది క్రమక్రమంగా మరిన్ని సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల జుట్టు సంరక్షణ కోసం ఎల్లప్పుడూ సహజ ఉత్పత్తులు ఉపయోగించడం మేలు.

Summer Hair Care- Ayurveda Tips- వేసవిలో జుట్టు సంరక్షణకు ఆయుర్వేద చిట్కాలు

ఆయుర్వేద నిపుణురాలు డాక్టర్ దీక్షా భావ్‌సర్ వేసవిలో జుట్టు సంరక్షణ కోసం కొన్ని ఆయుర్వేద చిట్కాలను పంచుకున్నారు. అవి మండే ఎండలో మీ జుట్టును చల్లగా, ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడతాయి. మరి ఆ చిట్కాలను మీరూ తెలుసుకోండి.

1. కూలింగ్ హెయిర్ ఆయిల్

మందార, ఉసిరి, కరివేపాకు, కొబ్బరి, నెయ్యి బ్రాహ్మి మొదలైన కూలింగ్ మూలికలతో సహజంగా తయారు చేసిన నూనెను జుట్టుకు ఉపయోగించవచ్చు. మీ జుట్టుకు సమతుల్యమైన పోషణ కోసం వారానికి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే కూలింగ్ నూనె రాయండి. రాత్రిపూట నిద్రవేళకు ముందు మసాజ్ చేసుకొని, మరుసటి రోజు ఉదయం మీ జుట్టును కడగాలి. రాత్రంతా వద్దనుకుంటే, 2 గంటలు ఉంచుకున్న తర్వాత కూడా కడిగేసుకోవచ్చు.

2. జుట్టు రాలకుండా ఉసిరికాయ

మీరు జుట్టు రాలడం వల్ల ఇబ్బంది పడుతుంటే, అర టీస్పూన్ ఉసిరి పొడిని తినవచ్చు. ఉసిరిని మిఠాయి లేదా సిరప్ రూపంలో తీసుకోండి. అంతే కాకుండా ఉసిరికాయలను బ్రహ్మి, భృంగరాజ్, కరివేపాకుతో కలిపి జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం, తెల్లబడటం ఆగిపోతుంది.

3. జుట్టు మృదుత్వానికి అలోవెరా జెల్

అలోవెరా జుట్టు ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి అద్భుతమైన ప్రయోజనాలను కలిగి ఉంది. జుట్టుకు నేరుగా అలోవెరా జెల్ రాసి, 30 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇది మీ జుట్టును ఆరోగ్యంగా, సహజంగా మృదువుగా మార్చడంలో సహాయపడుతుంది.

4. రోజ్ హబిస్కస్ టీ

కొన్ని హెర్బల్ టీలు శరీరానికే కాదు, జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. గులాబీ, మందారతో పువ్వులతో చేసే హైబిస్కస్ టీ ప్రకృతిలో చల్లదనాన్ని కలిగి ఉంటుంది. దీన్ని రోజూ తాగండి , మీ జుట్టుకు మంచి పోషణ ఆందుతుంది.

5. రైస్ వాటర్

కొరియన్ స్కిన్ రొటీన్ తెలిసిన తర్వాత, అందాన్ని పెంచుకోవడానికి గంజి వాడకం పెరిగింది. మీరు వెంట్రుకలకు గంజి నీటిని ఉపయోగించవచ్చు. గంజి నీటిని జుట్టుకు 20 నిమిషాలు పట్టించి, ఆపై గోరువెచ్చని నీటితో జుట్టును కడగాలి.

6. నేచురల్ హెయిర్ మాస్క్

జుట్టు బలంగా, మెరిసేలా చేయడానికి ఇంట్లో తయారుచేసిన హెయిర్ మాస్క్‌లను ఉపయోగించండి. ఉసిరి, మందార, వేప, కలబంద వంటి మూలికలతో తయారు చేసిన హెయిర్ మాస్క్‌లను వారానికి ఒకసారి వేయాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.

7. యోగ- ప్రాణాయామం

అనులోమ-విలోమ, భ్రమరి, షీత్లీ, షిత్కారి వంటి ప్రాణాయామం శరీరం నుండి అదనపు పిట్టాను తగ్గించడంలో సహాయపడతాయి. మీ దోషాలను సమతుల్యం చేయడానికి యోగా అవసరం.

8. నాస్య కర్మ

మీరు నిద్రించే సమయంలో మీ దినచర్యలో భాగంగా నాస్య కర్మను అనుసరించండి. రాత్రి పడుకునేటప్పుడు నాసికారంధ్రాలలో రంధ్రాలలో 2 చుక్కల ఆవు నెయ్యి వేయండి. అంతేకాకుండా రాత్రి నిద్రపోయే ముందు, ఆవు నెయ్యి లేదా కొబ్బరి నూనెతో మీ పాదాలు, అరికాళ్లను మర్దన చేయండి. దీనివల్ల మీరు ప్రశాంతంగా నిద్రపోవడమే కాకుండా, మీ జుట్టుకు ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది.

WhatsApp channel

సంబంధిత కథనం