Pranayamam| ప్రాణాన్ని పొడిగించే ఆసనం.. ప్రాణాయామం! ఎన్ని ప్రయోజనాలో తెలుసుకోండి-learn the art of breathing right with pranayamam and draw benefits ,లైఫ్‌స్టైల్ న్యూస్
Telugu News  /  Lifestyle  /  Learn The Art Of Breathing Right With Pranayamam And Draw Benefits

Pranayamam| ప్రాణాన్ని పొడిగించే ఆసనం.. ప్రాణాయామం! ఎన్ని ప్రయోజనాలో తెలుసుకోండి

ప్రాణాయామం- Pranayam
ప్రాణాయామం- Pranayam (Shutterstock)

యోగాలో ప్రాణాయామం ఎంతో ప్రాముఖ్యత కలిగింది. ప్రాణాన్ని పొడగించే ఆసనాన్నే ప్రాణాయామం అని చెప్తారు. మనస్సును నియంత్రించడానికి అనుసరించే అత్యంత ముఖ్యమైన పద్ధతుల్లో ఇది ఒకటి. మనిషి ఎక్కువ కాలం జీవించడానికి ప్రాణాయామం సహాయపడుతుంది.

ఎల్లప్పుడూ ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండాలని ఎవరు కోరుకోరు? ఫిట్‌నెస్ కోసం మనం అనేక ప్రయత్నాలు చేస్తుంటాం. అయితే ఎక్కువ మంది శారీరక ఆరోగ్యంపైనే దృష్టిపెడతారు. కానీ మానసికంగా కూడా ఫిట్‌గా ఉంటేనే సంపూర్ణ ఆరోగ్యవంతులు అనిపించుకుంటారు. మనసును అదుపులో ఉంచడం, ఏకాగ్రతను సాధించడం అనేవి నాడీవ్యవస్థకు సంబంధించినవి. ఇందులో అత్యంత కీలకమైన దశ శ్వాస. శరీరంలోని అన్ని వ్యవస్థలకు ఆక్సిజన్ అందించి అన్నింటినీ సక్రమంగా నడిపించే ప్రక్రియ శ్వాసక్రియ. అన్ని కణాలకు, శరీర వ్యవస్థలకు ఆక్సిజన్‌ సరఫరా జరగాలంటే శ్వాస మెరుగ్గా ఉండాలి. యోగా ద్వారా శ్వాసను నియంత్రించడం సాధ్యం అవుతుంది.

ట్రెండింగ్ వార్తలు

యోగాలో ప్రాణాయామం ఎంతో ప్రాముఖ్యత కలిగింది. ప్రాణాన్ని పొడగించే ఆసనాన్నే ప్రాణాయామం అని చెప్తారు. మనస్సును నియంత్రించడానికి అనుసరించే అత్యంత ముఖ్యమైన పద్ధతుల్లో ఇది ఒకటి. అనులోమ-విలోమ, యోగేంద్ర ప్రాణాయామాలు, సూర్యభేదనలు మొదలైనవి ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతాయి, ఉచ్ఛ్వాస నిశ్శ్వాసాలను అదుపులో ఉంచుతాయి. నాడీ వ్యవస్థను శుద్ధిచేస్తాయి. ఒత్తిడిని తగ్గించి, ఏకాగ్రతను పెంచుతాయి. తద్వారా మనిషి ఎక్కువ కాలం జీవించడంలో సహాయపడతాయి.

ఒత్తిడి, ఆందోళన ఎక్కువైనప్పుడు శ్వాస వేగవంతం అవుతుంది. దీంతో శరీరంలోని అడ్రినల్ గ్రంథుల్లో కార్టిసోల్ హర్మోన్ ఉత్పత్తి మరింత పెరుగుతుంది. వివిధ వ్యవస్థలకు ఆక్సిజన్ సరఫరా సరిగ్గా జరగదు. అలాంటపుడు ఒక లోతైన శ్వాస తీసుకుంటే కార్టిసాల్ స్థాయిలను తగ్గించవచ్చు. తక్కువ కార్టిసోల్ ఉత్పత్తి అంటే తక్కువ ఒత్తిడి అని అర్థం. కాబట్టి శ్వాస సరిగ్గా ఉండాలి. అందుకు మంత్రం ప్రాణాయామం.

ప్రతిరోజూ ప్రాణాయామం చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇది శరీరంలోని, రక్తంలోని మలినాలను తొలగించడంలో సహాయపడుతుంది. రక్త ప్రవాహం మెరుగుపడి ప్రతి కణానికి పోషణను అందిస్తుంది.

ప్రాణాయామంతో కలిగే ప్రయోజనాలు

  1. కోపం, ఆవేశాన్ని తగ్గిస్తుంది
  2. ఆకలిని నియంత్రిస్తుంది, కాబట్టి శరీర బరువును అదుపులో ఉంచుకోవచ్చు.
  3. ప్రాణాయామంతో మీ శ్వాస అదుపులో ఉంటుంది, మీ మానసిక పరిస్థితి మీ నియంత్రణలో ఉంటుంది. అందువల్ల మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో ఎంతో పరిపక్వతతో సంభాషిస్తారు. ఇది మీ వ్యక్తిగత లేదా వృత్తిపరమైన సంబంధాలను మెరుగుపరుస్తుంది.
  4. మీ ఏకాగ్రత పెరుగుతుంది, పని సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.
  5. మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది
  6. ప్రాణాయామం ఆటో ఇమ్యూన్ వ్యాధుల బారినపడే అవకాశాలను తగ్గిస్తుంది
  7. నిద్రలేమి ఉండదు, నిద్ర నాణ్యతను కూడా మెరుగుపరుస్తుంది
  8. కొన్నిరకాల దీర్ఘకాలిక నొప్పులు, మంటలు అదుపులోకి వస్తాయి.
  9. ప్రతిరోజూ ప్రాణాయామం చేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
  10. హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడంలో సహాయపడుతుంది. రోజంతా మిమ్మల్ని చురుగ్గా, శక్తివంతంగా ఉండేలా చేస్తుంది.
  11. శ్వాసక్రియ మెరుగ్గా ఉంటుంది. శ్వాస సంబంధ సమస్యలు అదుపులో ఉంటాయి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్