Aloe Vera Juice | కలబందలోని వైద్య లక్షణాల కారణంగా.. ఆయుర్వేదంలో ఔషధ మొక్కగా దీనిని పిలుస్తున్నారు. శతాబ్దాలుగా దీనిని ఎన్నో ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారు. అందుకే ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. దీని ఆరోగ్యం కోసం, చర్మానికి, జుట్టు ప్రయోజనాల కోసం వాడుతారు. అంతేకాకుండా ఇది అధిక స్థాయిలో అవసరమైన పోషక కూర్పును కలిగి ఉంది. ఈ నేపథ్యంలో కలబంద రసం వల్ల కలిగే 5 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను మీకు అందిస్తున్నాము. అవేంటో తెలుసుకుని మీ సమస్యకు కలబందతో చెక్ పెట్టేయండి.
మలబద్ధకం అనేది చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో ఒకటి. ఈ సమస్య ఉన్నవారు కలబంద రసాన్ని సహజ భేదిమందుగా ఉపయోగించవచ్చు. ఇది ఆంత్రాక్వినోన్స్ అనే సమ్మేళనాలను కలిగి ఉంటుంది. అయితే ఈ సమస్య నుంచి బయటపడటానికి కలబంద రసం తీసుకునే ముందు.. వైద్యుడిని సంప్రదించండి. వారి అనుమతితో మలబద్ధకాన్ని వదిలించుకోండి.
అలోవెరా జ్యూస్ విటమిన్-సికి అద్భుతమైన మూలం. ఈ విటమిన్ మన మొత్తం ఆరోగ్యానికి చాలా అవసరమైనది. ఎందుకంటే ఇది సహజ యాంటీఆక్సిడెంట్. వాపు సమస్యతో పోరాడటానికి సహాయపడుతుంది. విటమిన్ సి హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడం నుంచి రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరచే వరకు అనేక నిర్దిష్ట ప్రయోజనాలను కలిగి ఉంటుంది.
మొక్కల ఆధారిత ఆహారాల నుంచి తగినంత విటమిన్ సి పొందడం వల్ల.. ఇనుమును గ్రహించే శరీర సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. నారింజ, పచ్చిమిర్చి, బ్రోకలీ, ద్రాక్షపండు, టొమాటో జ్యూస్ వంటివి సహజంగా లభించే ఆహారాలలో విటమిన్ సి ఉంటుంది.
సమ్మర్లో హైడ్రేటెడ్‌గా ఉండడం చాలా ముఖ్యం. వేసవిలో రోజంతా పుష్కలంగా ద్రవాలు తాగడం వల్ల హైడ్రేటెడ్‌గా ఉంటాం. అదే సమయంలో తక్కువ కేలరీలు కలిగిన కలబంద రసం.. చక్కెర పానీయాలు, పండ్ల రసాలకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
2014లో చేసిన పరిశోధన ప్రకారం.. కలబంద రసం కడుపులోని పుండ్లను తగ్గిస్తుంది. అంతేకాకుండా జీర్ణక్రియను మెరుగుపరచడం వంటి అదనపు జీర్ణ ప్రయోజనాలను కలిగి ఉంటుంది. కలబంద రసంలో విటమిన్ సి వంటి అనేక శోథ నిరోధక సమ్మేళనాలు జీర్ణక్రియ మెరుగుపడేందుకు దోహదం చేస్తాయి.
ప్రీడయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో బ్లడ్ షుగర్‌ని నియంత్రించడంలో కలబంద 'కొంత సంభావ్య ప్రయోజనాన్ని' కలిగి ఉంటుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అలోవెరా జ్యూస్‌తో సప్లిమెంట్ తీసుకోవడం వల్ల ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్‌లో పాల్గొనేవారిలో మెరుగుపడుతుందని పరిశోధకులు గుర్తించారు. అయినప్పటికీ మధుమేహంపై కలబంద రసం చూపే ప్రభావాలను తెలుసుకోవడానికి మరిన్ని అధ్యయనాలు అవసరం.
సంబంధిత కథనం