ఖాళీ కడుపుతో రోజు ఉసిరి రసం తాగండి.. ఈ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందండి!-amazing health benefits of amla juice on an morning time ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Amazing Health Benefits Of Amla Juice On An Morning Time

ఖాళీ కడుపుతో రోజు ఉసిరి రసం తాగండి.. ఈ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందండి!

HT Telugu Desk HT Telugu
May 29, 2022 03:22 PM IST

ఉసిరికాయలు అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఉసిరికాయ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, దగ్గుకు కారణమయ్యే బ్యాక్టీరియా నుండి రక్షణనిస్తుంది. అలాగే జీర్ణక్రియకు మెరుగుపరచడంతో పాటు, చర్మ సౌందర్యాన్ని ప్రోత్సహిస్తుంది.

amla juice
amla juice

ఉసిరికాయకు ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. వీటిలో అనేక రకాల ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. మతపరమైన ఆచారాలలో కూడా ఉసిరికాయ ఉపయోగిస్తారు. ఉసిరికాయలో మినరల్స్, విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి వివిధ రకాల వ్యాధుల నుండి రక్షిస్తాయి. ముఖ్యంగా ఉసిరి రసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, దగ్గుకు కారణమయ్యే బ్యాక్టీరియా నుండి మనలను రక్షిస్తుంది. ఇది జీర్ణక్రియకు మెరుగుపరచడంతో పాటు, చర్మ సౌందర్యాన్ని ప్రోత్సహిస్తుంది.. జుట్టును బలపరుస్తుంది. అలాగే దృష్టిని కూడా మెరుగుపరుస్తుంది. పుల్లటి రుచిని కలిగి ఉన్నందున, కొంతమందికి ఇది అసహ్యకరమైనదిగా అనిపించవచ్చు. కానీ, ఖాళీ కడుపుతో ఉసిరి రసం తాగితే మన ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి, ఇక ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఉసిరికాయ జ్యూస్ తాగడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.

 

ఖాళీ కడుపుతో ఉసిరికాయ జ్యూస్ తాగడం వల్ల కలిగే 5 ఆరోగ్య ప్రయోజనాలు:

బరువు తగ్గడం: ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసాన్ని తాగడం వల్ల బరువు తగ్గడంతోపాటు మంచి ఆకృతిని పొందవచ్చు. ఉసిరి రసంలో యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి, ఇవి జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి, జీవక్రియను పెంచడానికి సహాయపడతాయి. ఇది కొవ్వును కరిగించడంతోపాటు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఉసిరి రసంలోని కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు.. కొవ్వు పెరగకుండా శక్తిని పెంచే గుణాలు ఉంటాయి.

వ్యర్థాలను తొలగిస్తుంది: ఖాళీ కడుపుతో ఉసిరి జ్యూస్ తాగడం ద్వారా శరీర వ్యవస్థ వ్యర్ధ రహితంగా మారుతుంది. ఉసిరి రసంలోని నీరు మూత్రం ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది మూత్ర విసర్జనను పోత్సాహించడం ద్వారా శరీరంలోని హానికరమైన టాక్సిన్స్‌ను తొలగిపోవడంతో పాటు కిడ్నీ రాళ్లను తొలగించడంలో సహాయపడుతుంది. ఉసిరి రసంతో యూరినరీ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.

కంటి చూపుకు మంచిది: కంటి చూపును పెంచడంలో ఉసిరికాయ కీలక పాత్ర ప్రోత్సాహిస్తోంది. ఆమ్లాలో కెరోటిన్ ఉంటుంది, ఇది దృష్టి మెరుగుదలకు సహాయపడుతుంది. రోజూ ఉసిరి రసాన్ని తీసుకోవడం వల్ల మీ కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కంటిశుక్లం, చికాకు, తేమ కళ్ళు వంటి సమస్యలను తగ్గిస్తుంది.

మీ శక్తిని పెంచుకోండి: ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఉసిరి రసం తాగడం వల్ల రోజంతా పుష్కలంగా పోషణ, శక్తిని అందిస్తుంది. ఉసిరి రసం ఉదయం పూట ఎనర్జీ బూస్టర్ లేదా ఎనర్జీ డ్రింక్‌గా పనిచేస్తుంది, రోజంతా మనల్ని ఫిట్‌గా, ఎనర్జీగా ఉంచుతుంది.

రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది: విటమిన్ సి అధికంగా ఉండే ఉసిరి శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచే, బలపరిచే విటమిన్. ఉసిరికాయలో నారింజలో కంటే ఎనిమిది రెట్లు విటమిన్ సి ఉంటుంది. ఇది బాక్టీరియల్ మరియు వైరల్ ఇన్ఫెక్షన్ల చికిత్సలో, అలాగే వివిధ రకాల ఆరోగ్య సమస్యల నివారణలో సహాయపడుతుంది.

WhatsApp channel