Rice Water With Coconut Oil : ఇలా చేస్తే.. జుట్టు ఒత్తుగా మారుతుంది!-rice water with coconut oil for healthy hair here s using process ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Rice Water With Coconut Oil : ఇలా చేస్తే.. జుట్టు ఒత్తుగా మారుతుంది!

Rice Water With Coconut Oil : ఇలా చేస్తే.. జుట్టు ఒత్తుగా మారుతుంది!

HT Telugu Desk HT Telugu
Mar 05, 2023 03:45 PM IST

Rice Water With Coconut Oil Benefits : జుట్టు సమస్యలను చాలా మంది ఎదుర్కొంటారు. అయితే ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటిస్తే.. మంచి ఒత్తైన జుట్టు మీ సొంతం అవుతుంది.

ఒత్తైన జుట్టుకు చిట్కాలు
ఒత్తైన జుట్టుకు చిట్కాలు

ఈ కాలంలో జుట్టు ప్రధాన సమస్యగా మారిపోయింది. జుట్టు రాలడం(Hair Loss), తెల్లజుట్టు(White Hair)లాంటి సమస్యలతో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇంట్లోని వాటితోనే మంచి జుట్టును మీ సొంతం చేసుకోవచ్చు. అన్నం వండటానికి ముందుగా.. బియ్యాన్ని కడుగుతాం. దీనితో ఎన్నో ప్రయోజనాలు. చాలా మంది బియ్యం కడిగిన నీటిని పారబొస్తారు. వాటిని సరిగా వాడుకుంటే.. మీ జుట్టు ఒత్తుగా ఉంటుంది.

సాధారణంగా బియ్యాన్ని కడగగా వచ్చిన నీటిని(Rice Water) పారబోస్తాం. కానీ బియ్యాన్ని కడగగా వచ్చిన నీటిని ఉపయోగించి.. అందమైన, ఒత్తైన జుట్టును సొంతం చేసుకోవచ్చు. ముందు.. ఒక గిన్నెలో బియ్యాన్ని తీసుకోవాలి. అందులో కావాల్సినంత నీటి(Water)ని పోసుకోవాలి. ఇరవై నిమిషాలపాటు నానబెట్టాలి.

ఆ తర్వాత బియ్యాన్ని శుభ్రంగా కడిగి.. ఆ నీటిని ఓ గిన్నెలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ నీటిని 24 గంటలపాటు అలానే ఉంచాలి. ఇలా చేస్తే.. ఈ నీటిలో మరింత పోషకాల స్థాయిలు పెరుగుతాయి. మనం జుట్టు(Hair)కు ఎంత మోతాదులో ఉపయోగిస్తామో.. అంతే ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె(Coconut Oil) లేదంటే.. బాదం నూనెను కలపాలి.

ఇప్పుడు అందులో కాస్త నిమ్మరసాన్ని(Lemon) కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించాలి. అరగంట సేపు అలానే ఉంచుకోవాలి. ఆ తర్వాత తలస్నానం(Head Bath) చేయాలి. ఇలా చేస్తే.. జుట్టు రాలడం(Hair Loss) తగ్గుతుంది. చుండ్రు, దురద వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. బియ్య కడిగిన నీటిలో ఇనోసిటాల్ తో పాటుగా ఇతర పోషకాలు ఉంటాయి. జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు ఒత్తుగా, నల్లగా పెరుగుతుంది. కాంతివంతంగా కనిపిస్తుంది.

వేరేలాగా కూడా ఈ నీటని వాడుకోవచ్చు. తలస్నానం చేసిన తర్వాత ఈ నీటిని జుట్టు పట్టించుకోవచ్చు. నాలుగైదు నిమిషాలు పెట్టుకుని.. ఆ తర్వాత నీటితో కడగాలి. ఇలా చేస్తే.. కండీషనర్ లాగా ఉపయోగపడుతుంది.

దీర్ఘకాలం పాటు ఒత్తిడి(Stress)ని అనుభవిస్తే, అది నిద్రలేమి, ఆందోళన, ఆకలి మందగించటం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఈ పరిస్థితులన్నీ మీ జుట్టుపై చెడుప్రభావం చూపిస్తాయి. ఫలితంగా జుట్టు రాలడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు, క్రమక్రమంగా వెంట్రుకలు(Hairs) తెల్లబడటం ప్రారంభిస్తాయి. కాబట్టి మిమ్మల్ని ఒత్తిడి లేకుండా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి రోజూ ధ్యానం చేయాలి. సరైన నిద్రపోవాలి.

రసాయనాలు అధికంగా ఉండే జుట్టు ఉత్పత్తులను ఎక్కువగా ఉపయోగించడం వలన కూడా జుట్టు తెల్ల బడుతుంది. హెయిర్ ప్రొడక్ట్స్‌(Hair Products)లో ఉండే సల్ఫేట్‌లు జుట్టుకు కొన్ని ప్రయోజనాలు చేకూర్చినప్పటికీ, వీటి వల్ల జుట్టు పొడిబారి, త్వరగా పాడైపోయేలా చేస్తాయి. ఇది జుట్టును తెల్లగా మారుస్తుంది. అందువల్ల సల్ఫేట్ లేని జుట్టు సంరక్షణ ఉత్పత్తులను ఎంచుకోండి.

WhatsApp channel