ఈ వయసు, ఆ వయసు అని ఏం లేదు. ఈ కాలంలో చాలా మంది తెల్ల జుట్టు(White Hair) సమస్యతో బాధపడుతున్నారు. చిన్నవయసులోనే చాలామంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. వయసుతో సంబంధం లేదు.. చాలా మంది ఈ బాధలు ఎదుర్కొంటున్నారు. పోషకాహార లోపం, వాతావరణ కాలుష్యం(Weather Pollution), ఒత్తిడి, ఆందోళనలాంటి చాలా కారణాలు ఉన్నాయి. తెల్ల జుట్టు ఉంటే.. ఎవరు ఔనన్నా.. కాదన్నా.. ఆత్మవిశ్వాసం కోల్పోతాం.
తెల్ల జుట్టు సమస్య నుంచి బయటపడేందుకు చాలామంది.. మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్ వాడుతుంటారు. అయితే ఇందులో కొన్ని మంచివి ఉండొచ్చు. మరికొన్నింటితో సైడ్ ఎఫెక్ట్స్(Side Effects) కూడా ఉంటాయి. తాత్కలికంగా జుట్టు నల్లగా మారినా.. ఆ తర్వాత దుష్ప్రభావాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చర్మ సమస్యలు(Skin Problems), దురదలు, దద్దుర్లు వంటివి చూస్తారు. అయితే ఇంట్లోనే కొన్ని పదార్థాలతో ఓ మిశ్రమాన్ని తయారుచేసుకోవచ్చు. దీంతో మీ తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కూడా పెరుగుతుంది.
ముందుగా ఒక కళాయిలో రెండు టేబుల్ స్పూన్ల ఉసిరి పొడిని తీసుకోవాలి. ఆ తర్వాత కుళాయిని స్టౌవ్ మీద పెట్టి.. చిన్న మంటపై ఉసిరి పొడిని వేడి చేయాలి. అలా కలుపుతూ.. నల్లగా అయ్యే వరకూ వేడి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్టౌవ్ ఆఫ్ చేసి.. చల్లగా అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్ఫూన్ కాఫీ పొడి(Coffee Powder)ని మిక్స్ చేయాలి. తరువాత ఒక టేబుల్ స్పూన్ కలబంద గుజ్జును, ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె(Coconut Oil)ను వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి.
ఇప్పుడు మీకు ఓ మిశ్రమం తయారు అవుతుంది. దీని తర్వాత.. ఆ మిశ్రమాన్ని దూదితో లేదా బ్రష్ తో మీ జుట్టు(Hair)కు రాసుకోవాలి. జుట్టు కుదుళ్ల నుంచి చివరి వరకూ ఈ మిశ్రమాన్ని పట్టించాలి. ఒక గంటపాటు అలానే ఉంచాలి. తర్వాత రసాయనాలు తక్కువగా ఉండే.. షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయాలి. అలా చేస్తే.. మీ తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.
దీర్ఘకాలం పాటు ఒత్తిడిని అనుభవిస్తే, అది నిద్రలేమి, ఆందోళన, ఆకలి మందగించటం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఈ పరిస్థితులన్నీ మీ జుట్టుపై చెడుప్రభావం చూపిస్తాయి. ఫలితంగా జుట్టు రాలడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు, క్రమక్రమంగా వెంట్రుకలు(Hairs) తెల్లబడటం ప్రారంభిస్తాయి. కాబట్టి మిమ్మల్ని ఒత్తిడి లేకుండా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి రోజూ ధ్యానం చేయాలి. సరైన నిద్రపోవాలి.
రసాయనాలు అధికంగా ఉండే జుట్టు ఉత్పత్తులను ఎక్కువగా ఉపయోగించడం వలన కూడా జుట్టు తెల్ల బడుతుంది. హెయిర్ ప్రొడక్ట్స్(Hair Products)లో ఉండే సల్ఫేట్‌లు జుట్టుకు కొన్ని ప్రయోజనాలు చేకూర్చినప్పటికీ, వీటి వల్ల జుట్టు పొడిబారి, త్వరగా పాడైపోయేలా చేస్తాయి. ఇది జుట్టును తెల్లగా మారుస్తుంది. అందువల్ల సల్ఫేట్ లేని జుట్టు సంరక్షణ ఉత్పత్తులను ఎంచుకోండి.
టాపిక్