Monkeypox : మంకీపాక్స్ వల్ల వచ్చే దద్దుర్లు.. కాలక్రమేణా మారుతాయంటా..-monkeypox virus looks like over time here is the display symptoms ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Monkeypox Virus Looks Like Over Time Here Is The Display Symptoms

Monkeypox : మంకీపాక్స్ వల్ల వచ్చే దద్దుర్లు.. కాలక్రమేణా మారుతాయంటా..

Geddam Vijaya Madhuri HT Telugu
Aug 18, 2022 12:25 PM IST

మంకీపాక్స్ ఇన్‌ఫెక్షన్ లక్షణాలతో ఓ వ్యక్తికి ఎదురైన అనుభవంతో కూడిన సోషల్ మీడియా పోస్ట్.. ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ దద్దుర్లు కనిపించిన దానికన్నా ఎక్కువ బాధపెడతాయని నటుడు పోస్ట్​లో పేర్కొన్నాడు.

Monkeypox
Monkeypox

Monkeypox : మంకీపాక్స్ వైరస్ అంటు వ్యాధిలా ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకుంది. ఇది కొత్త వైరస్ కాదు. ఈ ఇన్ఫెక్షన్‌కు కారణమయ్యే మంకీపాక్స్ వైరస్.. మశూచి వైరస్‌ల కుటుంబం నుంచి వచ్చింది. 2022 వరకు ఈ ఇన్‌ఫెక్షన్ దక్షిణాఫ్రికాలోని ప్రజలను మాత్రమే ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు ప్రపంచం మొత్తం వ్యాప్తి చెంది.. అందరినీ భయపెడుతుంది. వేగంగా వ్యాప్తి చెందుతూ.. అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా దీనిని 'ప్రపంచ ఆరోగ్య ముప్పు'గా పేర్కొంది. మంకీపాక్స్ వ్యాధికి సంబంధించిన లక్షణాలు మశూచి, ఫ్లూ లక్షణాలతో సమానంగా ఉంటాయి.

మంకీపాక్స్ లక్షణాలు

* చలితో కూడిన జ్వరం

* దగ్గు

* కండరాల తిమ్మిరి లేదా శరీర నొప్పులు

* తలనొప్పులు

* చర్మ గాయాలు

* వాపు శోషరస కణుపులు

* ఆయాసం

అయితే మంకీపాక్స్ ఇన్‌ఫెక్షన్ సోకిన స్వలింగ సంపర్క వయోజన సినీ నటుడు.. ఇన్‌ఫెక్షన్ లక్షణాల కాలక్రమాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. మంకీపాక్స్ అతనితో రెండు వారాల పాటు కొనసాగిందని.. ఆ సమయంలో వచ్చిన దద్దుర్లు కనిపించిన దానికన్నా.. బాధాకరంగా ఉన్నాయని నటుడు పోస్టులో వెల్లడించాడు. వాటికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. స్టీలే "Monkeypox: A timeline. I’m providing this to all of you so you can see an example of what the virus looks like over time. My goal with this is not to gross anyone out, but to educate. Not everyone displays symptoms the exact same way but I’ve been told by more than one professional that my case is a “clinically perfect” example and it’s being used in CDC demonstrations and medical journals. The second photo is me all smiles yesterday, free of the contagious period. Tomorrow I see my doctor to get the “all-clear” and get a haircut so I can feel human again! Feel free to share this image. Spread the word, not the virus!" అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.

కాలక్రమేణా వైరస్ ఎలా మారుతుందో మీరు ఈ పోస్టులో చూడవచ్చు. తన లక్ష్యం ఎవరినీ వంచించడం కాదని.. మంకీపాక్స్​పై అవగాహన కల్పించడమే లక్ష్యమని తెలిపారు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్